టానానో
మరోసారి వార్తల్లోకి ఎక్కింది. దీనికి కారణం టాటానానో కారు లో కేబుల్ కనెక్షన్ తప్పుగా ఇవ్వడం వల్లే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని అహ్మదాబాద్ యూనిట్ వారు వెల్లడించారు. ఇటువంటివి జరగడం వల్ల జనాభాకి టాటానానో పై ఉన్న నమ్మకం పోతుందని వాపోతున్నారు. టాటానానో కారు ఓనర్ మాట్లాడుతూ పార్క్ చేసినటువంటి నా కారు నుంటి దట్టమైన పోగలు రావడం గమనించానని అన్నారు. ఇది గమనించినటు వంటి ఓనర్ కంపెనీకి తెలియజేయడం జరిగిందన్నారు. దీనిపై స్పందించిన టాటానానో కంపెని అధికారి ఒకరు ఈ విషయంపై ఇన్విస్టిగేషన్ కి పురమాయించామని అన్నారు. నిజానికి ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరగలేదని నానో కారు నుండి పోగలు మాత్రమే వచ్చాయని ఓనర్ తమతో అన్నట్లు వివరించారు. నానో కారు విడుదలై సంవత్సరం అయినప్పటికి కేవలం ఏడు సార్లు మాత్రమే ఇలాంటివి జరిగాయన్నారు.
గతంలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ ఇన్సిడెంటేనని, ఇది కేవలం కేబుల్స్ సరిగా కలపకపోవడం వల్లే జరిగిందన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకోని టాటా నానో భద్రత విషయంలో 20మంది ఫోరెన్సిక్ ఇంజనీర్లను టీమ్ గా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కంపెనీ నుండి వచ్చే ప్రతి టాటా నానో కారుని వీరు క్షణ్ణంగా పరిశీలించడమే కాకుండా, కంపెనీ ఓనర్స్ తోకూడా సేప్టీ గురించి మరియు వారికి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు వివరిస్తానన్నారు. ప్రస్తుతం యావత్ భారతదేశంలో దాదాపుగా 62000యూనిట్స్ ని డెలివరీ చేయల్సిఉందన్నారు. వీటన్నింటిపై జనాభాకు క్లుప్తంగా వివరించడానికి నానో సూపర్ డ్రైవ్ అనే కార్యక్రమం చేపట్టిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ సూపర్ డ్రైవ్ 15000కిమీ ప్రయాణించి 36పట్టణాలను 26రోజులలో ఎటువంటి అవాంతరాలు లేకుండా దిగ్వజయంగా ముందుకి సాగుతుందన్నారు.
ఇదివరకే అనుకున్నాం కదండీ టాటా నానోకారు గురించి
నానోతో డ్రైవింగ్ కొంచెం జాగ్రత్త సుమా!