వెజిటెబుల్ ఉప్మా

కావలసిన పదార్థాలు:
బొంబాయి రవ్వ: 1glass
ఉల్లిపాయ: 2
క్యారెట్: 1
టొమాటో: 1
బంగాళాదుంప: 1
బీన్స్: 1cup
కాలీఫ్లవర్ ముక్కలు: 1/4cup
పచ్చిమిర్చి: 4
ఆవాలు: 1tsp
శెనగపప్పు :1tsp
మినప్పుప్పు : 1tsp
మిరియాల పొడి :1tsp
అల్లం ముక్క : చిన్నది
కరివేపాకు : రెండు రెమ్మలు
నూనె: తగినంత
నెయ్యి :1tsp
ఉప్పు : రుచికి సరిపడా
నీరు: 2glasses

తయారు చేయు విధానం:
1. ముందు కూరగాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి చిన్ని గిన్నెలో వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాతన పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యక రవ్వను అందులో వేసి దోరగా, పచ్చివాసన పోయే వరకు వేయించాలి.
2. స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడిచేసి అందులో శెనగపప్పు, మినప్పుప్పు, ఆవాలు, కరివేపాకు వేయాలి.
3. వేగాక ఇప్పుడు ఉల్లిపాయ, అల్లం,టొమాటో, పచ్చిమిర్చి ముక్కలను ఒకదానిక తర్వాత ఒకటి వేసి దోరగా వేయించాలి. రంగు మారాక కూరగాయ ముక్కలను అందులో వేయాలి.
4. కూరగాయ ముక్కలు కొద్దిగా వేగాక నీరు, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. నీళ్లు మరుగుతుండగా ఉప్మా రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలపాలి. దగ్గరగా అయ్యాక దించేసుకోవాలి. అంతే వెజిటెబుల్ ఉప్మా రెడి. దీనికి పల్లీల చట్నీ లేదా నిమ్మకాయ ఊరగాయతో తింటే చాలా రుచిగా ఉంటుంది.

టమోటా మసాలా బజ్జీ

కావలసిన పదార్థాలు: టమోటాలు: 1/2 kg బంగాళాదుంపలు: 1/2kg
నూనె:వేయించేందుకు సరిపడా గరంమసాలా: 2tsp
కొత్తిమీర: 1cup
పెసరపప్పు: 4tsp
ఉల్లిపాయలు: 3 పచ్చిమిర్చి: 4
శనగపిండి: 1cup

తయారు చేయు విధానం: 1. టమోటాలను ఒకే సైజుగా ఉండేటట్టు కట్‌ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. పెసరపప్పును, బంగాళాదుంపలను బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. టమోటాల్లో గుజ్జు, విత్తనాలను తీసేసి పక్కనుంచాలి. 3. ఇప్పుడు ఉడికించిన పప్పు, బంగాళాదుంపల మిశ్రమంలో గరంమసాలా, ఉప్పు, ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగులను కలిపి ముద్దగా చేసుకోవాలి. 4. ఈ ముద్దను కొద్ది కొద్దిగా తీసుకుని టమోటాల్లో కూరాలి. ఈ టమోటాలను జా

రుగా కలిపి ఉంచిన శెనగపిండి మిశ్రమంలో ముంచి కాగుతున్న నూనెలో వేసి బ్రౌన్

కలర్ వచ్చేదాకా వేయించి తీసేయాలి. అంతే టమోటా మసాలా బజ్జీ రెడీ. వీటికి గ్రీన్ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది.

మా గోదావరి జిల్లాలో సాయత్రంసమయాల్లో బయట బళ్ళఫైనఅమ్మేవారు. ఎంత బావుంటాయో.

రవ్వ భక్ష్యాలు

కావలసిన పదార్ధాలు:
బొంబాయి రవ్వ: 1cup
పంచదార: 1cup
నీరు: 2cup
పాలు: 1cup
యాలకులు పొడి: 1tsp
జీడిపప్పు: 10
మైదా: 100grms
నెయ్యి: 100grms
ఆయిల్: 2tbsp

తయారు చేయు విధానము:
1. మైదాను తగినంత నీటితో ఓలిగలకు(బొబ్బట్లు) కలిపినట్లుగానే కలిపి పక్కన పెట్టుకోవాలి.
2. పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసి జీడిపప్పును వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో రవ్వను కూడా వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
3. ఒక గిన్నెలో నీటిని, పాలను వేసి అవి మరిగాక వేయించి ఉంచిన రవ్వను వేసి కలుపుతూ ఉడికించాలి.
4. మిశ్రమం గట్టి పడిన తర్వాత ఏలకుల పొడి, పంచదార, వేసి కలుపుతూ ఉడికించి చివరగా జీడిపప్పు వేసి దించాలి.(ఫుడ్ కలర్ వేయకుండా కేసరి చేసినట్లుగా చేయాలి)
5. మైదాను చిన్న చిన్న పూరీలు గా చేసి అందులో కొద్దిగా రవ్వ మిశ్రమాన్ని పెట్టి ఓలిగలు(బొబ్బట్లు) వత్తినట్టే చేత్తో వత్తి పెనం మీద నూనె వేస్తూ దోరగా కాల్చాలి. అంతే రవ్వ భక్ష్యాలు రెడీ.

మ్యాంగో కేక్

కావలసిన పదార్ధాలు:
మైదా పిండి: 2 cups
మామిడిపండు ముక్కలు: 1cup
పంచదార: 1cup
నీళ్ళు:1/4cup
బేకింగ్ పౌడర్: 1tsp
వెనిల్లా ఎసెన్స్: 1tsp
పెరుగు: 2tbsp
వాల్ నట్స్: 1/2cup

తయారు చేయు విధానము:
1. మైదా పిండిన ఆయిల్ లేకుండానే రెండు నిమిషాలు పాటు, పచ్చివాసన పోయే వరకూ వేయించాలి.
2. 1/4cup నీళ్ళలో
పంచదార వేయాలి. బాగా కరిగిన తర్వాత అందులో బేకింగ్ పౌడర్, వెనిల్లా ఎసెన్స్, మామిడి పండు గుజ్జు, పెరుగు, వాల్ నట్స్ ముక్కలు వేసి బాగా కలపాలి.
3. తర్వాత పిండిని కొద్దికొద్దిగా అందులో వేస్తూ ముద్దలా కలుపుకోవాలి.
4. ఈ మిశ్రమాన్ని మైక్రో ఓవెన్ లో కానీ, కేక్ చేసే పాత్రలో కానీ వేసి ఉడికించాలి. ఫైనల్ గా క్రీమ్ తో గార్నిష్ చేసుకోవాలి అంతే మంచి రంగు, రుచికరమైనటువంటి మ్యాంగో కేక్ రెడీ.

బ్రెడ్ క్యాప్సికమ్ పిజ్జా

కావలసిన పదార్థాలు:
బ్రెడ్ పీసులు: 6
క్యాప్సికమ్స్: 3
ఛీజ్: 100grm
ఉల్లిపాయలు: 3
వెల్లుల్లి: 2
టొమోటో కెచప్: 1/2 tsp
కారం: 1 tsp

తయారు చేయు విధానం:
1. బ్రెడ్‌ పీసులను తీసుకుని గుండ్రంగా కత్తిరించాలి.
2. తరవాత దానిపైన టొమాటో కెచప్‌ పూయాలి.
3. ఇప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యాప్సికమ్‌లను సన్నని ముక్కలుగా కట్ చేసుకొని బ్రెడ్ ‌మీద పరచాలి.
4. తరవాత ఛీజ్‌ను కూడా సన్నగా తురిమి దాన్ని కూడా బ్రెడ్ ‌పైన పరచి, కారంపొడిని కూడా చల్లాలి.
5. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసులను మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టి బంగారు వర్ణంలోకి మారేదాకా వేయించి తీసేయాలి.
6. తరవాత వీటిమీద టొమోటో కెచప్‌ వేయాలి అంతే బ్రెడ్ క్యాప్సికమ్ పిజ్జా రెడీ.

క్యాప్సికమ్ పనీర్ కర్రీ

కావలసిన పదార్ధాలు:
పనీర్ ముక్కలు: 1cup
అల్లం వెల్లుల్లిపేస్ట్: 2tbsp
పచ్చిమిర్చి పేస్ట్: 1tbsp
పసుపు: చిటికెడు
కారం: 1tsp
ధనియా పౌడర్: 1tsp
టమోటో: 1
క్యాప్సికమ్: 2
మెంతి ఆకులు: 1
గరం మసాలా: 1
ఉప్పు: రుచికి సరిపడా
నెయ్యి: 1
కొత్తిమీర : గార్నిష్ కి సరిపడా

తయారు చేయు విధానము:
1. పాత్రలో నూనె వేడయ్యాక, పనీర్ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించి తీయాలి. గోరు వెచ్చని నీటిలో పనీర్ ముక్కలు వేసి 3నిమిషాలు వుంచి నీటిని వంపేయాలి.
2. అదే పాత్రలో అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా వేయించాలి తర్వాత అందులోనే దనియాల పొడి, కారం, పసుపు, క్యాప్సికమ్ ముక్కలు, ఒకదానితర్వాత ఒకటి వేసి బాగా వేయించాలి.
3. ఇప్పుడు టమోటా ముక్కలు కూడా అందులో వేసి కలిపి, మూత పెట్టి మరికొద్దిసేపు వేయించాలి.
4. పనీర్ ముక్కలు జత చేసి అయిదు నిమిషాలు వేయించాలి, గరం మసాలా, మెంతి వేసి కలిపి దింపేయాలి.
5. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడి చపాతీల్లోకి వడ్డిస్తే చాలా రుచి గా ఉంటుంది.

పైనాపిల్ రైస్

కావలసిన పదార్ధాలు:
పైనాపిల్ తురుము: 1 cup
బాస్మతి బియ్యం: 1cup
నిమ్మరసం: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
పచ్చిమిర్చి: 4
జీడిపప్పు: 5
నూనె: 2tbsp
పోపుదినుసులు: 1tsp
ఇంగువ: చిటికెడు
ఎండుమిర్చి: 2
కరివేపాకు: రెండు రెబ్బలు

తయారు చేయు విధానము:
1. ముందుగా బాస్మతి బియ్యంతో అన్నం వండి చల్లార్చుకోవాలి. చల్లారిన అన్నంలో ఉప్పు, నిమ్మరసం, పైనాపిల్ తురుము వేసి కలపాలి.
2. పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక పోపుదినుసులు, ఆవాలు జిలకర్ర వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, వేసి అర నిమిషం పాటు వేయించాలి.
3. చివరగా ఎండు మిర్చి, ఇంగువ వేసి కలిపి దింపేయాలి. తర్వాత ఈ పోపు మిశ్రమాన్ని ఫైనాపిల్ రైస్ లో వేసి కలపాలి. అంతే పైనాపిల్ రైస్ రెడీ.

ఆపిల్ – క్యారెట్ సలాడ్

ఆపిల్: 2(చిన్న ముక్కలుగా కట్ చేయాలి)
క్యారెట్ తురుము: 1 cup
తేనె: 1 tbsp
మిరియాల పొడి: 1 tsp
జీడిపప్పు: 2tbsp
కిస్ మిస్:1 tbsp

తయారు చేయు విధానము:
1. ఒక గిన్నెలో ఆపిల్ ముక్కలు, క్యారెట్ తురుము, తేనె, మిరియాల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసి కలపాలి చివరగా జీడిపప్పు, కిస్ మిస్ లతో గార్నిష్ చేయాలి అంతే ఆపిల్ క్యారెట్ సలాడ్ రెడీ.

పైనాపిల్‌ కర్రీ

కావలసినవి:
పైనాపిల్‌: 1cup( చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి)
ఉల్లిపాయ: 2
పచ్చిమిర్చి: 4
కారం: 2tsp
కరివేపాకు: కొద్దిగా
పసుపు: చిటికెడు
పంచదార:1cup
ఆవపొడి: 1/2tsp
అల్లం వెల్లుల్లి పేస్టు: 2tsp
కప్పు కొబ్బరి పాలు: 1/2cup
మాల్దీవ్‌ ఫిష్‌ ముక్కలు: 2tsp
దాల్చిన చెక్క: చిన్న ముక్కలు
ఆయిల్‌: తగినంత
ఉప్పు: తగినంత

తయారు చేయు విధానం:
1. స్టౌ మీనద పాన్ పెట్టి నూనె వేసి వేడిచేసి అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, దాల్చిన చెక్క, ఉల్లి ముక్కలు, పచ్చిమిరపముక్కలు ఒకదాని తరువాత ఒకటిగా వేసి ఉల్లి ముక్కలు మెత్తబడే వారకూ ఫ్రై చేయాలి.
2. ఉప్పు, పసుపు, కారం, ఆవపొడి, మాల్దీవ్‌ ఫిష్‌ వేసుకోవాలి. మిశ్రమాన్ని బాగా కలిపి పైనాపిల్‌ ముక్కలు వేసుకోవాలి.
3. పైనాపిల్‌ ముక్కలకు మిశ్రమం బాగా పట్టుకునేలా కలపాలి. మంట తక్కువ చేసి కొద్ది సేపు ఉడికించాలి. పంచదార, ఉప్పు తగినంత వేసుకోవాలి.
4. అవసరమనుకుంటే టేస్ట్‌ చూసి కొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్చు.

మరమరాలు(బొరుగులు)తో ఫ్రూట్ భేల్

కావలసిన పదార్థాలు:
మరమరాలు: 3 cup
శెనగపిండి: 2tsp
ఆయిల్: 2tsp
జీలకర్ర: 1tsp
ఇంగువ: చిటికెడు
పసుపు: 1/2tsp
పళ్లీలు: 1/2cup
మొలకెత్తిన పెసలు: 1/2cup
టొమోటో ముక్కలు: 1cup
ఆపిల్ ముక్కలు: 1cup
క్యారెట్ తురుము: 2tsp
కమలా తొనలు: 1/2cup
కొత్తమీర: 1/4cup
కరివేపాకు: రెండు రెమ్మలు
కారం: 1tsp
ఉప్పు: తగినంత
చిదిమిన వెల్లుల్లి రెబ్బలు: 4

తయారు చేయు విధానము:
1. మొదటగా పాన్ లో ఆయిల్ వేసి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేయాలి చిటపటలాడాక అందులో కరివేపాకు, పళ్లీలు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, పసుపు, కారం, ఉప్పు, వేసి వేయించాలి తర్వాత మరమరాలు వేసి బాగా కలపాలి. అందులోనే శెనగపిండి కూడా వేసి కాసేపు వేయించి దించేయాలి.
2. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మొలకెత్తిన పెసలు, టొమోటో ముక్కలు, ఆపిల్ ముక్కలు, పచ్చిమామిడికాయ ముక్కలు, కమలా తొనలు, కొత్తిమీర, వేసి బాగా కలియబెట్టి సర్వ్ చేయాలి. అంతే మరమరాల ఫ్రూట్ బౌల్ సిద్దమైనట్లే.
3. ఫ్రూట్స్ ఇష్టపడనివారు ఫ్రూట్స్ మినహాయించి మిగిలిన ఐటమ్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి వర్షాకాలం సాయంసమయాల్లో కారం కారంగా స్నాక్స్ల్ లాగా తీసుకోవచ్చు.