శలభాసనంతో మధుమేహం నియంత్రణ 1

 

 

 

 

 

 

 

 

శలభాసనం తామర స్థితి తెలుపుతుంది. ఇది పశ్చమోత్తనాసనానికి, హలాసనానికి వ్యతిరేక స్థితిలో ఉంటుంది. దీనివలన శరీరానికి ప్రయోజనాలు చేకూరుతాయి. అర్ధ శలభాసనం వేయడానికి మొదట నేలపై పడుకోవాలి. ఉదరం, ఛాతీ,చుబకం నేలను తాకుతూ ఉండాలి. భుజాలు చదునుగా పరచాలి.
వేళ్ళను నేలపై ఉంచాలి. పిడికిలి బిగించి పైకి తీసుకు రావాలి. మెల్లగా గాలి పీల్చకుని 10 సెకనులు బిగపట్టాలి. పూర్తిగా గాలి పీల్చకుంటే కాళ్ళు ఎత్తడానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి పూర్తిగా గాలి పీల్చుకోరాదు. ఊపిరి వదలడం మొదలు పెట్టాలి. గాలి పీల్చుతూనే ఆసనాన్ని పూర్తిచేయాలి. నిశ్చ్వాసమనేది కాళ్ళు నేలను చేరేటప్పటికి పూర్తి కావాలి. శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి చేతులు లేదా అరచేయి లేదా పిడికిలి వినియోగించాలి. పిడికిలిని కేవలం అనుభవజ్ఞులు మాత్రమే వినియోగించాలి. మెల్లగా కాళ్ళ వీలైనంత ఎత్తుకు తీసుకురావాలి. నాభి వరకు ఉన్న శరీరభాగం నేలను తాకి ఉండాలి. అది కదలకూడదు. మొండెం చక్కగా ఉండాలి. కాళ్ళు లేపడానికి కేవలం నాభి కింది భాగంలో ఉన్న ప్రాంతాన్ని మాత్రమే వినియోగించాలి. ఉదరం, ఛాతీ, చేతులు, చుబుకం ఖచ్చితంగా ఆసనంలో ఉన్నంతసేపు నేలను తాకే ఉండాలి. కాళ్ళు ఎత్తిన స్థానంలోనే ఖచ్చితంగా ఉంచాలి. కాళ్ళ ఎత్తే సమయంలోకాని, తిరిగి యథాస్థితికి చేర్చే సమయంలోకాని, మోకాళ్ళ వంచరాదు.

ఉపయోగాలు:
ఈ ఆసనంతో గర్భసంచి, అండాశయాలలో ఏవైనా లోపాలు వుంటే తొలగిపోతాయి. మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. కాళ్ళు, చీలమండ వాపులకు ఉపశమనం లభిస్తుంది. అజీర్తి, మలబద్ధకాలు నయమవుతాయి. ఈ ఆసనం జీర్ణక్రియను పెంచుతుంది. నరాల వాపు, మొలలు నివారించబడుతాయి. కాలేయం వేగంగా పనిచేయడానికి దోహదపడుతుంది. కడుపుబ్బరం తగ్గుతుంది. ఉదరకోశవ్యాధులు, గాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయి.

http://www.youtube.com/watch?v=bcB_Ouc50-I   

http://www.viddler.com/explore/odrazsvetla/videos/1/%22%3Elink1

 

 

 

 

 

ధ్యానం

ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటారు లేదా ఒక వస్తువు మీద ధ్యాస ని లగ్నం చేయడం అంటారు .  మీరు రోజు ధ్యానం చేయడానికి ప్రయత్నిచండి. మీ వయసు ఎంత వుందో అంత సేపు చాలు. ఎ సమయోలోనిన సరే ధ్యానం చేయడానికి ప్రయత్నిచండి.
దీనివలన మానసిక  ప్రశాంతతనే కాకుండా  , ఎంతటి అధిక రక్త పోటుని అయిన అదుపులో ఉంచుకోవచ్చు. మరి ధ్యానం చేస్తారు కదూ!.

సంప్రదాయం లో యోగ

ఈశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు పద్మాసనంలో ద్యానయోగంలో ఉన్నట్లుపురాణాలలో వర్ణించబడి ఉంది.లక్ష్మీదేవి ఎప్పుడు పద్మాసినియే,మహా విష్ణువు నిద్రను యోగనిద్రగా వర్ణించ బడినది.తాపసులు తమ తపసును పద్మాసనంలో అనేకంగా చేసినట్లు పురాణ వర్ణన.ఇంకా లెక్కకు మిక్కిలి ఉదాహరణలు హిందూ సంప్రదాయంలో చోటు చేసుకున్నాయి.బుద్ధ సంప్రదాయంలో,జైన సంప్రదాయంలోను ,సన్యాస శిక్షణలోను యోగా ప్రధాన పాత్ర పోషిస్తుంది.సింధు నాగరికత కుద్య చిత్రాల ఆధారంగా యోగా వారి నాగరికతలో భాగంగా విశ్వసిస్తున్నారు.

భగవద్గీతలో యోగములు:
భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయానికి “యోగము” అనే పేరు ఉంది. ఇక్కడ “యోగం” అనే పదం సామాన్య యోగాభ్యాసం కంటే విస్తృతమైన అర్ధంలో, జ్ఞాన బోధ లేదా మార్గం అనే సూచకంగా వాడబడింది.

* అర్జునవిషాద యోగము: యుద్ధ భూమిలో తాతలు తండ్రులు, సోదరులు, గురువులు,మేనమామలు మొదలైన ఆప్తులను శత్రు సేనలో చూసిన అర్జునుడు వారిని వధించవలసి వచ్చినందుకు అర్జుని కమ్ముకున్న విషాదము గురించిన వర్ణన.

* సాంఖ్య యోగము:- ఆత్మ స్వరూపము గుణగణాల వర్ణన.

* కర్మ యోగము:- కర్మ చేయడంలో నేర్పు,దానిని యోగములా మార్చుకోవడం ఎలా అని చెప్పే యోగము.

* జ్ఞాన యోగము:- నర,నారాయణూల జన్మలు,భగవంతుని జన్మలోని శ్రేష్టమైన గుణాలు.జ్ఞాన సముపార్జన మార్గాల వివరణ.

* కర్మసన్యాస యోగము:- కర్మలను ఫలితాలను సన్యసించి భగవంతునికి అర్పించి ఆయన ఇచ్చిన దానిని ప్రసాదంగా స్వీకరించడం ఎలా అన్న వివరణ.

* ఆత్మసంయమ యోగము:- ధ్యానము,ఏకాగ్రతల ద్వారా మనోనిగ్రహము సాధించడము,ఆహారనియమాలు,సాధనా ప్రదేశము ఏర్పాటు వర్ణన.యోగి గుణగాణాల వర్ణన,భగవంతుని సర్వవ్యాఇత్వము,యోగభ్రష్టత ఫలితాల వర్ణన.

* జ్ఞానవిజ్ఞాన యోగము:- భగవంతుని,ఉనికి,గుణగనాలు,ప్రకృతి,మాయని జయించడము.మోక్షగామి గుణగణాల వర్ణన.

* అక్షరపరబ్రహ్మ యోగము:- బ్రహ్మతత్వము,ఆధ్యాతకత,కర్మతత్వము,ఆది దైవతము,ఆది భూతముల వర్ణన.జీవుని జన్మలు,జీవ ఆవిర్భావము,అంతము,పుణ్యలోక ప్రాప్తి,అత్యకాలములో భగవన్నామస్మరణ ఫలం.

* రాజవిద్యారాజగుహ్య యోగము:- మోక్ష ప్రాప్తి వివరణ.భగవతత్వము,స్వర్గలోకప్రాప్తి,దేవతారాధనా వాటిఫలము,భక్తుల గుణగణాల వర్ణన.

* విభూతి యోగము:-భగవంతుని చేరే మార్గము.భగవంతుని విశ్వ వ్యాపికత్వము వర్ణన.

* విశ్వరూపసందర్శన యోగము:- విశ్వరూపము గురించిన విస్తారమైన వర్ణన.

* భక్తి యోగము:- భక్తి యోగ వర్ణన.భగవంతుని ప్రియము పొందలిగిన భక్తుని గుణగణాల వర్ణన.

* క్షేత్ర క్షేత్రజ్ఞవిభాగ యోగము:- ప్రకృతి పురుషులు,క్షేత్రము క్షేత్రజ్ఞుల గురించిన జ్ఞానము తెలిపేది.

* గుణత్రయవిభాగ యోగము:- సత్వగుణము,రజోగుణము,తామసగుణము వివరణ,వారి ఆహారవ్యవహారాల వర్ణన.

* పురుషోత్తమప్రాప్తి యోగము:- భగవంతుని స్వరూపము తత్వము పురుషోత్తముని చేరే మార్గము వివరణ.

* దైవాసురసంపద్విభాగ యోగము:- దైవీగుణసంపద,అసురీగుణసంపద కవారి ప్రవృత్తి,ప్రవర్తన ఆలోచనాదుల వర్ణన.

* శ్రద్దాత్రయవిభాగ యోగము:- సత్వ,రాజసిక,తామసికములనబడే మూడు విధములుగా గుర్తించిన శ్రద్ధలను గురించిన వివరణ.

* మోక్షసన్యాస యోగము:- మోక్ష ప్రాప్తికి కావలసిన జ్ఞానము,సన్యాసము గురించిన వర్ణన.

శలభాసనంతో మధుమేహం నియంత్రణ

శలభాసనం తామర స్థితి తెలుపుతుంది. ఇది పశ్చమోత్తనాసనానికి, హలాసనానికి వ్యతిరేక స్థితిలో ఉంటుంది. దీనివలన శరీరానికి ప్రయోజనాలు చేకూరుతాయి. అర్ధ శలభాసనం వేయడానికి మొదట నేలపై పడుకోవాలి. ఉదరం, ఛాతీ,చుబకం నేలను తాకుతూ ఉండాలి. భుజాలు చదునుగా పరచాలి.
వేళ్ళను నేలపై ఉంచాలి. పిడికిలి బిగించి పైకి తీసుకు రావాలి. మెల్లగా గాలి పీల్చకుని 10 సెకనులు బిగపట్టాలి. పూర్తిగా గాలి పీల్చకుంటే కాళ్ళు ఎత్తడానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి పూర్తిగా గాలి పీల్చుకోరాదు. ఊపిరి వదలడం మొదలు పెట్టాలి. గాలి పీల్చుతూనే ఆసనాన్ని పూర్తిచేయాలి. నిశ్చ్వాసమనేది కాళ్ళు నేలను చేరేటప్పటికి పూర్తి కావాలి. శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి చేతులు లేదా అరచేయి లేదా పిడికిలి వినియోగించాలి. పిడికిలిని కేవలం అనుభవజ్ఞులు మాత్రమే వినియోగించాలి. మెల్లగా కాళ్ళ వీలైనంత ఎత్తుకు తీసుకురావాలి. నాభి వరకు ఉన్న శరీరభాగం నేలను తాకి ఉండాలి. అది కదలకూడదు. మొండెం చక్కగా ఉండాలి. కాళ్ళు లేపడానికి కేవలం నాభి కింది భాగంలో ఉన్న ప్రాంతాన్ని మాత్రమే వినియోగించాలి. ఉదరం, ఛాతీ, చేతులు, చుబుకం ఖచ్చితంగా ఆసనంలో ఉన్నంతసేపు నేలను తాకే ఉండాలి. కాళ్ళు ఎత్తిన స్థానంలోనే ఖచ్చితంగా ఉంచాలి. కాళ్ళ ఎత్తే సమయంలోకాని, తిరిగి యథాస్థితికి చేర్చే సమయంలోకాని, మోకాళ్ళ వంచరాదు.

ఉపయోగాలు:
ఈ ఆసనంతో గర్భసంచి, అండాశయాలలో ఏవైనా లోపాలు వుంటే తొలగిపోతాయి. మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. కాళ్ళు, చీలమండ వాపులకు ఉపశమనం లభిస్తుంది. అజీర్తి, మలబద్ధకాలు నయమవుతాయి. ఈ ఆసనం జీర్ణక్రియను పెంచుతుంది. నరాల వాపు, మొలలు నివారించబడుతాయి. కాలేయం వేగంగా పనిచేయడానికి దోహదపడుతుంది. కడుపుబ్బరం తగ్గుతుంది. ఉదరకోశవ్యాధులు, గాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయి.

వాకింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు

అన్ని వ్యాయామల్లోకి నడక ఉత్తమమైన వ్యాయామం. దానివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.
ప్రతి ఒక్కరూ రోజూ అరగంట నుంచి గంటసేపు నడవాలి.నడిచేటప్పుడు తప్పనిసరిగా షూ వేసుకోవాలి. నడక మొదలు పెట్టే ముందు కనీసం పది, పన్నెండు నిముషాలు వామప్ (శరీరానికి చురుకు పుట్టించే వ్యాయామాలు, కాళ్ళుచేతులను సాగదీయటం ) చేయాలి. ఆ తర్వాత వేగంగా నడవాలి. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో నడిస్తే మంచి వేగంతో నడిచినట్లు లెక్క. మొదట్లో గంటకు నాలుగు కిలోమీటర్లు నడవగలిగితే చాలు. నడిచేటప్పుడు దూరమూ, సమయం దృష్టిలో ఉంచుకోవటం ముఖ్యం.
ఎత్తయిన ప్రాంతానికి ఎక్కుతున్నట్లు మూడు నిమిషాలు తర్వాత చదును ప్రాంతం మీద రెండు నిమిషాలు మళ్ళీ ఎత్తయిన ప్రాంతం మీద ఇలా మార్చి మార్చి నడిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మొదట్లో తక్కువ దూరం వెళ్ళినా తర్వాత, తర్వాత వేగం, దూరం పెంచుకుంటూ వెళ్ళాలి. వాకింగ్ చేసేటప్పుడు పండ్లు, కొబ్బరినీళ్ళు తప్పనిసరి.

నాజూగ్గా ఉండడంకోసం…!

బాపు బొమ్మలాంటి సన్నని నడుము, తీరైన అవయవ సౌష్టవం ఇప్పుడు అపురూపమైపోయాయి. మారిన పరిస్థితులు, ఆహారపు అలవాట్లలో వచ్చిన పెను మార్పులు నాజూకు శరీరాన్ని దూరం చేస్తున్నాయి. సన్నబడాలంటే తినడం తగ్గించాలి కానీ, కడుపునిండా తినమంటున్నారేమిటి? అని ఆశ్చర్యపోతున్నారా! నచ్చింది తిన్నా నాజూగ్గా ఎలా ఉండవచ్చో చూద్దామా.
సన్నగా కనబడడానికి, సన్నపడడానికి చాలా మంది టీనేజర్స్ పడరాని పాట్లు పడుతున్నారు. జిమ్‌ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. బ్యూటీషియన్లకు వేలకు వేలు సమర్పించుకుంటున్నారు. ఇన్ని తిప్పలు పడినా ఫలితం ఆవగింజలో అరభాగం కూడా వుండడంలేదు. వీరి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కొన్ని రోజుల పాటు కొన్ని రకాల జబ్బులు కూడా వచ్చి పడుతున్నాయి. రోజుల తరబడి కడుపు మాడ్చుకోవడం వలన జీవప్రక్రియ దెబ్బతింటుంది. దీని ప్రభావం కండరాల మీద పడుతుంది. చిన్న వయసులోనే కీళ్ళనొప్పులు, ఎక్కువ దూరం నడవలేకపోవడం వంటివి బాధిస్తాయి.
శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా తమ పని తాము చేసుకుపోవాలంటే ఆహారం తీసుకోవడం తప్పనిసరి. రోజంతా చురుకుగా పనిచేయాలంటే కేలరీలు తప్పనిసరి. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే కేలరీలు పొందడం సాధ్యమవుతుంది. కొన్ని రోజుల పాటు ఉపవాసాలు చేసి, ఆ తరువాత కేలరీల వినియోగం గణనీయంగా తగ్గిపోతుంది. కేలరీలు వినియోగం తగ్గినప్పుడు కొవ్వు వచ్చి చేరుతుంది. ఎక్కువ తింటున్నాం కాబట్టి ఎక్కువసేపు వ్యాయామం చేయాలనుకోవటం పొరబాటని నిపుణులు అంటున్నారు. కొద్దిపాటి వ్యాయామాలతో అందంగా ఆరోగ్యంగా వుండడం సాధ్యమవుతుంది. కింద సూచించిన విధంగా మీ ఆహారపు అలవాట్లని మార్చుకొన్నట్లయితే అందాన్ని పదికాలల పాటు కాపాడుకోవచ్చు.
ప్రతి మూడు లేదా నాలుగు గంటలకొకసారి ఆహారం తీసుకుంటూ వుండాలి.(నిద్రపోయే సమయంలో తప్ప) కడుపును ఖాళీగా వుంచితే గ్యాస్ చేరే అవకాశం వుంది. కాబట్టి మూడు నాలుగు గంటలకు మించి కడుపును ఖాళీగా వుంచుకోకండి.
ఆహారంలో ఎక్కువ భాగం గింజలు వుండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. తీసుకొనే ఆహారాన్నే మూడు లేదా నాలుగు భాగాలుగా విభజించుకోవాలి.
ప్రొటీన్లు తీసుకోవడం తప్పనిసరి, ప్రొటీన్లు మిమ్మల్ని ఉత్సాహంగా, ఉల్లాసంగా వుంచుతాయి. గంటల తరబడి పనిచేసినా నీరసం రాకుండా ప్రొటీన్లు కాపాడతాయి.
తృణధాన్యాలు తీసుకొనేటప్పుడు ఫైబర్ అధికంగా వున్నవాటినే తీసుకోవాలి. దీనితోబాటు చక్కెర తక్కువ వున్నవాటినే ఎంపిక చేసుకోవాలి.
రోజుకు కనీసం ఐదు రకాల పండ్లన్నా తీసుకోవాలి. తాజా పండ్లు కూరగాయలలో విటమిన్లు, ఫైబర్ అధికంగా లభిస్తాయి.
60 నుంచి 70 శాతం ఆహారం తీసుకొని మిగతా 30 నుంచి 40 శాతం నీటిని తాగాలి. అంటే రోజుకి 12 గ్లాసుల నీరు తాగడం తప్పనిసరి.
బేకరీ ఉత్పత్తులకు పూర్తిగా దూరం కాకుండా తీసుకొనే పరిమాణాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది. బేకరీ ఉత్పత్తులతో పాటు పళ్ళు కూరగాయలు తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్లు, పోషకాలు అందుతాయి.
శరీరాన్ని కష్టపెట్టే వ్యాయామాల కన్నా రోజూ కొంత సేపు నడిస్తే మంచిది. కనీసం అరగంటకి తక్కువ కాకుండా నడవడం అలవాటు చేసుకోవాలి. రోజు మొత్తంలో ఏ సమయంలోనైనా నడవచ్చు. అయితే తెల్లవారుజామున నడిస్తే ఫలితాలు మరింత మెరుగ్గా వుంటాయి.
మీడైట్ ప్లాన్‌ను తరచూ మార్చకుండా కొన్ని వారాల పాటు కొనసాగించాలి. మూడూనాలుగు వారాలకొకసారి మాత్రమే డైట్ ప్లాన్‌ను మార్చాలి. తరచూ మార్చడం వలన జీవప్రక్రియ దెబ్బతింటుంది.

మీల్స్ చార్ట్:

బ్రేక్ ఫాస్ట్:
లేచిన రెండు లేదా మూడు గంటలకు బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం తప్పనిసరి. రాత్రి భోజనానికి, ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి మధ్య ఎనిమిది నుంచి పది గంటల వ్యవధి మాత్రమే వుండాలి. అంతకు మించి వ్యవధి వుంటే అల్సరు వచ్చే ప్రమాదం పొంచి వుంది. సహజంగా బ్రేక్‌ఫాస్ట్ అనగానే ఇడ్లీ, ఉప్మా, పూరీ, వడ వంటివే ఎక్కువ తీసుకుంటారు. అలా కాకుండా కింద ఇచ్చిన వాటిని తీసుకుంటే ఎంత తిన్నా ప్రమాదం లేదు. ఉడికించిన గుడ్డుతోపాటు గోధుమ లేదా జొన్న రొట్టెను ఆకుకూరతో తీసుకోవాలి. కాఫీ, టీల కన్నా వెన్న తీసిన మజ్జిగ లేదా పాలు, యాపిల్ పండు లేదా గుప్పెడు ద్రాక్షా పండ్లు తీసుకోవాలి. గుడ్డు తినడం ఇష్టపడని వారు దానిని కాకుండా మిగతావి తీసుకోవచ్చు. నెయ్యి లేదా నూనె లేకుండా తయారు చేసిన బ్రేక్‌ఫాస్ట్, వెన్న ఏ మాత్రం లేని కప్పు పెరుగు, ఒక ఆరెంజ్. టమోటాలతో తయారు చేసిన శాండ్ విచ్, ఒక అరటి పండు.
లంచ్:
మధ్యాహ్నం చేసే భోజనంలో కూడా సమతుల్యం పాటించాలి. రెండు లేదా మూడు చిన్న పుల్కాలు, కప్పు అన్నంలో ఆకు కూరతో చేసిన కూర లేదా పప్పు, రసం, వెన్న లేని పెరుగు తీసుకోవాలి. వీటితో పాటు సలాడ్స్ అధికంగా వుండే విధంగా చూసుకోవాలి.
టీ టైం:
మధ్యాహ్నం లంచ్‌కి, రాత్రి డిన్నర్‌కి చాలా తేడా వుంటుంది. అందువల్ల సాయంత్రం నాలుగు లేదా ఐదుగంటల సమయంలో తేలిక పాటి స్నాక్స్ తీసుకోవాలి. ఫ్యాట్ లేని బిస్కెట్లు, లేదా ద్రాక్షా, ఆపిల్, ఆరెంజ్ పండ్లు తీసుకోవాలి.
డిన్నర్:
లంచ్‌కి తీసుకున్నట్లయితే చపాతీలు, కూరలతోపాటు మాంసాహారులు ఆవిరి మీద ఉడికించిన మాంసం తీసుకోవచ్చు. రాత్రి భోజనం ముగించిన వెంటనే పండ్లు తింటే ఆహారం తొందరగా అరుగుతుంది.
పై ఆహారపు అలవాట్లను కొనసాగిస్తూనే బరువును ఎప్పటికప్పుడు గమనిస్తూ వుండాలి. వ్యాయామం చేస్తున్నా బరువు పెరుగుతుంటే నిపుణుల సలహా సంప్రదింపులతో డైట్ చార్ట్ లో మార్పులు చేసుకోవచ్చు.

కటి చక్రాసనంతో అదనపు కొవ్వు మాయం

కటి అంటే కృశోధరము లేదా నడుము. కటిని తిప్పే ఈ ఆసనాన్ని కటి చక్రాసనం అంటారు. దీని వలన శరీరానికి చాలా మేలు జరుగుతుంది.

ఆసనం వేయు పద్దతి
చదునైన నేలపై నిటారుగా నిలబడాలి. తల వెనుకభాగం సమాంతరంగా ఉండేలా చూడాలి. చూపు ఎదురుగా ఉండాలి.చేతులను ముందుకు చాపాలి. అలాగే కాళ్ళ మధ్య కనీసం అరమీటరు దూరం ఉండేలా చూడాలి. ఎడమ చేతిని కుడి భుజంపైకి తీసుకురావాలి. కుడిభుజాన్ని వెనుకకు మడవాలి.అలాగే కుడిచేతిని ఎడమ భుజంపైకి తీసుకువస్తూ ఎడమ భుజాన్ని వెనుకకు మడవాలి. కుడి భుజంపై నుంచి వీలైనంత వరకు చూడాలి. ఈ స్థితిలో కొన్ని సెకనులు నిలబడాలి. ఇలాగే కొద్దసేపు నిలబడిన తరువాత పూర్వస్థితికి రావాలి. ఇదే విధంగా రెండోవైపు చేయాలి. ఇలా కనీసం 5 మార్లు చేయాలి.

జాగ్రత్తల
భుజం, కృశోధరం నొప్పి ఉన్నవారు ఈ ఆసనాన్ని వేయకపోవడం మంచిది.

ఉపయోగాలు
ఈ ఆసనం వలన తొడలు, నడుము, తుంటలలోని అదనపు కొవ్వును తొలగిస్తుంది.

http://www.youtube.com/watch?v=KTESpFPv-zw

ఉదరాకర్షణాసనం

మలబద్ధకంతో బాధపడేవారు ముందుగా ఉదయాన్నే నిద్రలేవగానే నాలుగు గ్లాసుల గోరువెచ్చటి నీటిని త్రాగి ఆ తరువాత “ఉదరాకర్షణాసనం” వేసినట్లయితే మలబద్ధకాన్ని నివారించవచ్చు.

ఈ ఆసనం ఎలా వేయాలంటే.. రెండు పాదాలను నేలకు ఆనించి కూర్చుని, రెండు చేతులనూ మోకాళ్లపైన కేంద్రీకరించాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి, వదలి.. కుడికాలును నేలమీద ఆనించి, ఎడమకాలును పొట్టకు ఆన్చి, ఎడమవైపుకు మెడ, ఛాతీ, నడుమును తిప్పాలి. ఇప్పుడు తిరిగీ శ్వాసను పీల్చుకుంటూ రెండు కాళ్లపైన కూర్చోవాలి.

అదే విధంగా ఎడమవైపుకు ఎడమకాలు నేలమీద ఆనించి, కుడికాలును పొట్టకు ఆన్చి, కుడివైపుకు మెడ, ఛాతీ, నడుమును తిప్పాలి. శ్వాసను పీల్చుకుంటూ యధాస్థానానికి రావాలి. ఇలా కుడి, ఎడమవైపుల్లో పదిసార్లు చేయాలి. దీంతోపాటు కపాలబాతి చేస్తే మంచిది.

ఆ తరువాత సుఖాసనంలో కూర్చుని రెండు చేతుల చూపుడు వేళ్లను మడిస్తే వాయుముద్ర ఏర్పడుతుంది. శ్వాస బయటకు, పొట్టలోపలికి తీసుకుంటూ సెకనుకు ఒకసారి, నిమిషానికి 60సార్లు మొదటిరోజు 5 నిమిషాలు, అలా నెల రోజుల చివరికి 15 నిమిషాలపాటు చేసేలా అలవర్చుకోవాలి. ఇలా చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయి.

అయితే ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే.. ఈ ఉదరాకర్షణాసనం నీరు తాగిన తరువాత చేయాలి. ఆ తరువాత గంట సేపటికి కపాలబాతి, ప్రాణాయామం చేయాలి. లేకపోతే ముందుగానే కపాలబాతి చేసిన తరువాత నీరు త్రాగి ఉదరాకర్షణాసనం ప్రాక్టీసు చేస్తే సరిపోతుంది. వీటన్నింటితోపాటు మర్కటాసనం కూడా చేసినట్లయితే మరిన్ని చక్కటి ఫలితాలను పొందవచ్చు.

http://www.youtube.com/watch?v=LROr1MrczIg

 

మానసిక ఒత్తిడిని తగ్గించండిలా: బ్రమరి యోగ

మానసిక ఒత్తిడితో రకరకాల జబ్బులు సునాయాసంగా మన శరీరంలోకి చేరుకుంటాయి. దీంతో లేనిపోని ఇబ్బందులు తలెత్తుతాయి. విపరీతమైన పని ఒత్తిడివల్ల, మానసికమైన ఒత్తిడులతో ఏ పనీ చేయడానికి మనస్కరించదు. మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడానికి భ్రమరి అనే వ్యాయామం చేస్తే మానసిక ఒత్తిడిని తగ్గించి, నిద్రలేమిని, గుండె సమస్యలను, అధిక రక్త పోటును పరిష్కరిస్తుందంటున్నారు యోగా నిపుణులు. ఈ భ్రమరి వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేస్తే జ్ఞాపక శక్తికూడా పెరుగుతుందని తెలిపారు.

** చేయండిల
కూర్చుని కళ్ళుమూసుకుని, చెవులను చూపుడువేళ్ళతో మూసుకుని గాలిని గట్టిగా లోపలికి పీల్చండి. గాలిని బయటికి వదిలేటప్పుడు మీ గొంతునుండి తుమ్మెద ఎగిరేటప్పుడు వచ్చే శబ్దం తెప్పించండి. ఇలా రోజుకు ఐదుసార్లు చేయండి.
తుమ్మెద ఎగిరే శబ్దం వస్తుందికాబట్టే ఈ యోగాకు భ్రమరి అనే పేరు వచ్చిందంటున్నారు నిపుణులు.

http://www.youtube.com/watch?v=b4CnR39WbUg