annamacharya keerthanalu

పలుకు దేనెల తల్లి పవళించెను |
కలికి తనముల విభుని గలసినది గాన ||

నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర
పగలైన దాక జెలి పవళించెను |
తెగని పరిణతులతో తెల్లవారినదాక
జగదేక పతి మనసు జట్టి గొనె గాన ||

కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగ దరుణి
బంగారు మేడపై బవళించెను |
చెంగలువ కనుగొనల సింగారములు దొలక
అంగజ గురునితోడ నలసినదిగాన ||

మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై
పరవశంబున దరుణి పవళించెను |
తిరు వేంకటాచలా ధిపుని కౌగిట గలసి
అరవిరై నును జెమలు నంటినదిగాన ||

ప : వలపులు వలపులు వయ్యాళి
చలమరి మరుడును సమేళి

చ : నెలత మోమునకు నీ కనుచూపులు
నిలువున ముత్యపు నివాళి
కొలదికి మీరిన గురుకుచములకును
తొలకు నీ మనసు దువ్వాళి

చ : వనిత నిండుజవ్వన గర్వమునకు
ఘనమగు నీ రతి కరాళి
వెనకముందరల వెలది మేనికిని
పెనగు గోరికొన పిసాళి

చ : పడతి కోరికల భావంబునకును
కడు కడు నీతమి గయ్యాళి
చిడిముడి మగువకు శ్రీవేంకటపతి
విడువని కూటపు విరాళి

వలపుల సొలపుల వసంత వేళ యిది

సెలవి నవ్వకువే చెమరించీ మేను

శిరసు వంచకువే సిగ్గులు పడకువే
పరగ నిన్నతడు తప్పక చూచీని
విరులు దులుపకవే వెసదప్పించుకోకువే
సిరులనీ విభుడిట్టే సేసవెట్టీని

పెనగులాడకువే బిగువు చూపకువే
ఘన శ్రీవేంకటేశుడు కౌగిలించీని
అనుమానించకువే అలమేల్మంగవు నీవు
చనవిచ్చి నిన్నునేలె సమ్మతించీ యాతడు

ఇటువలె నుండవద్దా యిరవైన మోహము
తటుకన నీమీది తగులెంతోఁ గానీ

సొరిది నీ మోము సారెఁ జూచియిను తనియదు
తరుణి మాటలాడియుఁ తనియదు
సరసము లాడియాడి చాలునని తనియదు
అరుదైన మదిలోని యాస యం(యెం)తో కాని

ననుపుసేసుక చెలి నవ్వియును తనియదు
తనువుసోక పెనగియు తనియదు
మునుకొని చేతులెత్తి మొక్కియును తనియదు
యెనసి నీపై వలపింకా నెంతో కాని

రమణి నీ కాగిట రతిసేసి తనియదు
తమితో గుబ్బలనొత్తి తనియదు
జమళి శ్రీవేంకటేశ సన్నసేసి తనియదు
అమరిన సంతోసమది యెంతోకాని

అలర చంచలమైన ఆత్మలందుండ

నీ యలవాటు చేసె నీ వుయ్యాల |
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుం

డ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ||

ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన

వుడుమండలము మోచె నుయ్యాల |
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన

అఖిలంబు నిండె నీ వుయ్యాల ||

పదిలముగ వేదములు బంగారు

చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల |
వదలకిటు ధర్మదేవత పీఠమై

మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల ||

మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల

మెరుగునకు మెరుగాయె వుయ్యాల |
నీల శైలమువంటి నీ మేనికాంతికి

నిజమైన తొడవాయె వుయ్యాల ||

జో అచ్యుతానంద జోజో ముకుందా

రావె పరమానంనద , రామ గోవిందా జోజో జోజో

నందునింటనుజేరి నయముమీరంగా
చంద్రవదనలు నీకు సేవచేయంగా
అందముగ వారిండ్ల ఆడుచుండంగా
మందలకు దొంగ మా ముద్దురంగా జోజో జోజో

….
అంగజునిగన్న మాయన్నయిటు రారా
బంగారుగిన్నెలో పాలుపోసేరా
దొంగనీవని సతులు పొంగుచున్నరా
ముంగిటానాడరా మొహనాకారా జోజో జోజో
….
అంగుగా తాళ్ళాపాకనయ్య చాలా
శృంగార రచనగా చెప్పెనీ జోల
సంగతిగ సకల సంపదలు నీవేలా
మంగళము తిరుపట్ల మదనగోపాలా జోజో జోజో

నవరాత్రి పూజ విధానం


తిథి తేదీ
మొదటి రోజు పాడ్యమి 28 సెప్టెంబర్ శ్రీ బాలా త్రిపుర సుందరి
రెండవ రోజు విదియ 29 సెప్టెంబర్ శ్రీ గాయత్రి
మూడవ రోజు తదియ 30 సెప్టెంబర్ శ్రీ మహాలక్ష్మి
నాలుగో రోజు చవితి 1 అక్టోబర్ శ్రీ అన్నపూర్ణ
ఐదవ రోజు పంచమి 2 అక్టోబర్ శ్రీ లలితాదేవి
ఆరవ రోజు సప్తమి 3 అక్టోబర్ శ్రీ సరస్వతి
ఏడవ రోజు అష్టమి 4 అక్టోబర్ శ్రీ దుర్గాదేవి (దుర్గాష్టమి)
ఎనిమిదవ రోజు నవమి 5 అక్టోబర్ శ్రీ మహిషాసురమర్ధిని
తొమ్మిదవ రోజు దశమి 6 అక్టోబర్ శ్రీ రాజరాజేశ్వరి

దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. రాక్షసుడు మహిషాసురుడిని కాళికా దేవీ సంహరించినందుకు గుర్తుగా మనం ఈ నవరాత్రి వేడుకలు జరుపుకుంటాం. మరి అమ్మవారి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలిగా. దుర్గాదేవీ పూజను ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం.

ప్రాణ ప్రతిష్ట చేయు విధానం 
అమ్మవారి విగ్రహాన్ని పువ్వులతో అలంకరించి, పళ్లు, ఫలాలను సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ప్రాణప్రతిష్ట చేసేందుకు పువ్వులు, అక్షింతలను పట్టుకుని అమ్మవారి పాదాలను పట్టుకుని కింది మంత్రములను పఠించాలి.

మం ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునఃప్రాణ మిహ నో ధేహి భోగమ్
జ్యోక్పశ్యేషు సూర్యముచ్చరంత మనుమతే మృడయా న స్స్వస్తి
అమృతంవై ప్రాణా అమృతమాపః

ప్రాణానేన యథాస్థాన ముపహ్వయతే
ఓం అం హ్రీం క్రీం హంస స్సోహం

స్వామిని శ్రీ జగన్నాథే యావత్పూజావసానకం
తాపత్వ్తం ప్రీతిభావేన యంత్రేస్మిన్ సన్నిధింకురు
రక్తాంభోదిస్థపోతోల్లస దరుణసరోజాధిరూఢా కరాభైః
పాశం కోదండ మిక్షూద్భవ మణిగుణ మప్యంకుశం పంచబాణాన్
భిభ్రామా సృక్కపాలం త్రిణయనవిలసత్ పీనవక్షోరుహాఢ్యా
దేవీబాలార్కవర్ణా భవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానః
సాంగాం సాయుధాం సవాహనాం సశక్తిం పతిపుత్ర పరివార సమేతాం శ్రీవహాకాళీ

శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవీ అవాహితాభవ
స్థాపితాభవ సుప్రసన్నాభవ వరదాభవ స్థరాసనం కురు ప్రసీద ప్రసీద

ధ్యానం 
లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం
విద్యాప్రదాన సమయే శరదిందుశుభ్రాం
విద్వేషి వర్గవిజయేతు తమాలనీలాం
దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే
ఖడ్గం చక్రగదేషు చాపపరిఘాన్ శూలం భుశుండిం శిరః
శంఖం సందధతీంకరైః త్రిణయనాం సర్వాంగభూషాభృతాం
యాదేవీ మధుకైటభ ప్రశమనీ యామాహిషోన్మూలినీ
యాధూమ్రేక్షణ చండముండ దమనీ యారక్తబీజాశినీ
యాశుంభాది నిశుంభ దైత్యశమనీ యా సిద్ధలక్ష్మీఃవరా
తాంత్వాం చంద్ర కళావతంస మకుటాం చారుస్మితాం భావయే
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః

అక్షతలు, పుష్పములను దేవి పాదాల వద్ద ఉంచవలెను.

ఆవాహనం

ఈ క్రింది మంత్రమును జపిస్తూ కొద్దిగా దేవిపై  పుష్పాలను లేదా  అక్షింతలు   చల్లవలెను.

హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ 


ఆసనం 
ఈ క్రింది మంత్రమును జపిస్తూ కొద్దిగా దేవిపై  పుష్పాలను లేదా  అక్షింతలు   చల్లవలెను.


తాంమ ఆవాహ జాతదేవోలక్ష్మీ మనపగామినీం
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వరి పురుషానహం

దేవి పాదము వద్ద పుష్పముతో నీటిని చల్లవలెను.

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రభోదినీమ్
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్ 

అర్ఘ్యం

దేవి పాదములపై దేవి పాదము వద్ద పుష్పముతో నీటిని చల్లవలెను. 

కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలన్తీం తృప్తాం తర్పయన్తీమ్
పద్మేస్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్


ఆచమనీయం 
ఈ క్రింది మంత్రము చెబుతూ గ్లాసులోని నీటిని పుష్పముతో కొద్దిగా దేవిపై చల్లవలెను

చన్ద్రాం ప్రభాసాం యశసా జ్వలన్తీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే 

పంచామృతాభిషేకం 

ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః
తస్య ఫలాని తపసా నుదన్తు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః

క్షీరం (పాలు)

ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్సోమ వృషియం
భవావాజస్య సంగధే

దధి (పెరుగు)

దధిక్రావుణ్ణో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః
సురభినో ముఖాకరత్పృణ ఆయూగంషి తారిషిత్

ఆజ్యం (నెయ్యి)
శుక్రమసి జ్యోతిరసి తేజోసి దెవోవస్సవితోత్పువా
త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిః

మధు (తేనె)
మధువాతా ఋతాయతే మధుక్షరన్తి సింధవః
మాధ్వీర్నస్సన్త్వౌ షధీః

చక్కెర (పంచదార)
స్వాదుః పవస్య దివ్యాయజన్మనే స్వాదురింద్రాయ సుహవీతునామ్నే 
స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగ్

ఫలోదకం (కొబ్బరి నీరు)
యాఃఫలినీర్యా ఫలా పుష్పా యాశ్చ పుష్పిణీః
బృహస్పచి ప్రసూతాస్తానో ముంచన్త్వగ్ హనః

శుద్ధోదకం (మంచినీరు) స్నానం

ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః
తస్య ఫలాని తపసా నుదన్తు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః

చివరగా అమ్మవారికి మంచినీటిలో స్నానం చేయించి పట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి. తర్వాత పత్తితో చేసిన ఉపవీతం సమర్పించుకోవాలి. తర్వాత ఈ క్రింది మంత్రం చదువుతూ గంధం వేయవలెను

ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ
ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే

క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహమ్
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుదమే గృహాత్

గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్ 

శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః గంధాం ధారయామి

సుగంధ ద్రవ్యాణి 

ఓం అహిరివ భోగైః పర్యేతి బాహుం
జాయా హేతిం పరిబాధమానాః
హస్తేఘ్నో విశ్వావయునాని విద్వాన్
పుమాన్‌పుమాంసంపరిపాతువిశ్వతః

శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః హరిద్రా కుంకుమ కజ్జల కస్తూరి గోరోజనాది సుగంధద్రవ్యాణి సమర్పయామి.

ఆభరణాణి (నగలు)
తర్వాత అమ్మవారికి ఈ క్రింది మంత్రం చెబుతూ నగలు సమర్పించుకోవాలి.


మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి
పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః 


శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః సర్వభరణాణి సమర్పయామి

పుష్పాణి (పూలమాలలు)
ఈ క్రింది మంత్రం చదువుతూ సుగంధ పూలమాలలను అలంకరించాలి. 

కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్ 


శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి.

అధాంగ పూజ 
ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి
ఓం గిరిజాయై నమః గుల్ఫౌ పూజయామి
ఓం అపర్ణాయై నమః జానునీ పూజయామి
ఓం హరిప్రియాయై నమః ఊరూ పూజయామి
ఓం పార్వత్యై నమః కటిం పూజయామి
ఓం ఆర్యాయై నమః నాభిం పూజయామి
ఓం జగన్మాత్రే నమః ఉదరం పూజయామి
ఓం మంగళాయై నమః కుక్షిం పూజయామి
ఓం శివాయై నమః హృదయం పూజయామి
ఓం మహేశ్వర్యై నమః కంఠం పూజయామి
ఓం విశ్వవంద్యాయై నమః స్కంధౌ పూజయామి
ఓం కాళ్యై నమః బాహూ పూజయామి
ఓం ఆద్యాయై నమః హస్తౌ పూజయామి
ఓం వరదాయై నమః ముఖం పూజయామి
ఓం సువణ్యై నమః నాసికం పూజయామి
ఓం కమలాక్ష్యై నమః నేత్రే పూజయామి
ఓం అంబికాయై నమః శిరః పూజయామి
ఓం దేవ్యై నమః సర్వాణ్యం పూజయామి



ధూపం (అగరవత్తులు) 

ఆపః సృజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే
ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే 

తర్వాత అమ్మవారికి అగరవత్తులను సమర్పించుకోవాలి. 

శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః ధూపమాఘ్రాపయామి.

దీపం 
అమ్మవారి దీపం వెలిగించి క్రింది మంత్రమును చదవాలి. 

ఆర్ద్రాం యఃకరిణీం యష్టిం  సువర్ణాం హేమమాలినీమ్
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ 

శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి
అని చెబుతూ నీటిని పళ్లెములో విడువలెను

నైవేద్యం 

ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీమ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ

తర్వాత నైవేద్యం సమర్పించాలి

తాంబూలం

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్
యస్యాం హిరణ్యం ప్రభూతం గావోదాస్యోశ్వాన్ విందేయం పురుషానహమ్ 

 శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః తాంబూలం సమర్పయామి.

కర్పూరనీరాజనం
ఈ క్రింది మంత్రమును జపిస్తూ హారతి ఇవ్వవలెను.


యః శుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహమ్
శ్రియః పంచదశర్చం చ శ్రీకామః సతతం జపేత్ 


సంతత శ్రీరస్తు, సమస్త మంగళాని భవంతు, నిత్యశ్రీరస్తు, నిత్యమంగళాని భవంతు
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః 
కర్పూర నీరాజనం సమర్పయామి.

మంత్రపుష్పమ్ 
చేతిలో అక్షింతలు, పువ్వులను ఉంచుకుని మంత్రపుష్పమ్ చెప్పవలెను. ఇక్కడ పెద్ద మంత్రపుష్పమ్ లేదా చిన్న మంత్రపుష్పమ్ చెప్పవలెను లేదా శ్రీ సూక్త ఫలమును పఠించవలెను. 

శ్రీ సూక్త ఫలము

ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః

ఋషయస్తే త్రయః ప్రోక్తాస్వయాం శ్రీరేవ దేవతా

పద్మాననే పద్మ ఊరూ పద్మాక్షీ పద్మసంభవే
త్వం మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహమ్

అశ్వదాయీ గోదాయీ ధనదాయీ మహాధనే
ధనం మే జుషతాం దేవి సర్వకామాంశ్చ దేహి మే

పుత్రపౌత్రం ధనం ధాన్యం హస్త్యశ్వాదిగవేరథమ్
ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మామ్

ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః
ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్ను తే

చంద్రాభాం లక్ష్మిమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం
చంద్రసూర్యాగ్ని వర్ణాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే

వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహా
సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః

న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతిః
భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్సదా

వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః
రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మ ద్విషో జహి

పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి
విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ

యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ
గంభీరావర్తనాభిః స్తనభర నమితా శుభ్ర వస్త్రోత్తరీయా
లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైమణిగణ ఖచితైస్స్నాపితా హేమకుంభైః
నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగల్యయుక్తా

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్రగంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్

సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ
శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా

వరాంకుశౌ పాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం
బాలార్క కోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమాద్యాం జగదీశ్వరీం త్వామ్

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే

సరసిజ నిలయే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీదమహ్యమ్

ఓం విష్ణుపత్నీం క్షమాం దేవీం మాధవీం మాధవప్రియాం
విష్ణోః ప్రియసఖీం దేవీం నమామ్యచ్యుతవల్లభామ్

ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్

శ్రీవర్చస్యమాయుష్యమారోగ్యమావిధాత్ పవమానం మహీయతే
ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః
ఋణరోగాది దారిద్ర్య పాపంక్షుదపమృత్యవః
భయశోకమనస్తాపా నశ్యంతు మమ సర్వదా

శ్రియే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియం వయో జరితృభ్యో దధాతు
శ్రియం వసానా అమృతత్వమాయన్ భజంతి సద్యః సవితా విదధ్యూన్

శ్రియ ఏవైనం తచ్ఛ్రియామాదధాతి
సంతతమృచావషట్ కృత్యం సంధత్తం సంధీయతే ప్రజయా పశుభిః
య ఏవం వేద

ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్

తర్వాత ఆత్మప్రదక్షిణ నమస్కారం చేయవలెను. అనంతరం తీర్థం పుచ్చుకుంటూ ఈ మంత్రాలను జపించవలెను.

మం అకాలమృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్తపాపక్షయకరం
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గాపరాదేవీ పాదోదకం పావనం శుభమ్

ఉద్వాసన 
ఈ క్రింది మంత్రము జపించుచూ ఉద్వాసన పలుకవలెను
మం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్
తేహనాకం మహిమానస్సచంతే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః

శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః యథాస్థాన ముద్వాసయామి.

వినాయక చవితి పూజ విధానం

వినాయక చవితి శుభాకాంక్షలు. చవితి సందర్భంగా చవితి పూజ విధానం మీ అందరి కోసం post చేస్తున్నాను.

ఆచమనం:
ఓం కేశవాయ స్వాహాః
నారాయణాయ స్వాహాః
మాధవాయ స్వాహాః
(అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను)

గోవిందాయ నమః
విష్ణవే నమః
మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః
వామనాయ నమః
శ్రీధరాయ నమః
హృషీకేశాయ నమః
పద్మనాభాయ నమః
దామోదరాయ నమః
సంకర్షణాయ నమః
వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః
అనిరుద్దాయ నమః
పురుషోత్తమాయ నమః
అధోక్షజాయ నమః
నారసింహాయ నమః
అచ్యుతాయ నమః
ఉపేంద్రాయ నమః
హరయే నమః
శ్రీ కృష్ణాయ నమః
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

సంకల్పం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే

ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్థాం గతోపివా
యస్స్మరేత్పుండరీ కాక్షం సబాహ్యాభ్యంతరం శుచిః
శ్రీ గోవింద గోవింద

ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓంభూః ఓం భువః ఓగ్ ం శివః ఓం మహః ఓంజనః ఓంతపః ఓ గ్ం సత్యం ఓంతత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓం ఆపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ప్రాణాయామం (మూడు సార్లు లోపలికి గాలి పీల్చి నెమ్మదిగా వదలడం) చేసి దేశకాలములను స్మరించి సంకల్పం చేయవలెను. మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సర్వజిన్నామ సంవత్సరే దక్షిణాయనే వర్షర్తౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్ద్యాం వాసరః స్థిరవాసర యుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీమాన్ … గోత్రః …నామధేయః (ధర్మ పత్నీ సమేతః) మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం సిద్ది వినాయక ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే

భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవమ్ ధ్యాయేత్సిద్ధి వినాయకమ్
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం
షోడశోపచారపూజ
ద్యాయేద్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం॥

శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి
అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ

ఆవాహయామి
మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం॥

ఆసనం సమర్పయామి
గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ॥

ఆర్ఘ్యం సమర్పయామి
గజవక్త్ర నమస్తే~స్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన॥

పాద్యం సమర్పయామి
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో ॥

ఆచమనీయం సమర్పయామి.
దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే ॥

మధుపర్కం సమర్పయామి.
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత ॥

పంచామృత స్నానం సమర్పయామి.
గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే॥

శుద్దోదక స్నానం సమర్పయామి.
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ ॥

వస్త్రయుగ్మం సమర్పయామి.
రాజితం బహ్మసూత్రం చ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక॥

ఉపవీతం సమర్పయామి.
చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం॥

గంధాన్ సమర్పయామి.
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్, గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే॥

అక్షతాన్ సమర్పయామి.
సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే॥

పుష్పాణి పూజయామి.
అథాంగ పూజ
(పుష్పములతో పూజించవలెను)

గణేశాయ నమః – పాదౌ పూజయామి
ఏకదంతాయ నమః – గుల్ఫౌ పూజయామి
శూర్పకర్ణాయ నమః – జానునీ పూజయామి
విఘ్నరాజాయ నమః – జంఘే పూజయామి
అఖువాహనాయ నమః – ఊరూ పూజయామి
హేరంబాయ నమః – కటిం పూజయామి
లంబోదరాయ నమః – ఉదరం పూజయామి
గణనాథాయ నమః – నాభిం పూజయామి
గణేశాయ నమః – హృదయం పూజయామి
స్థూలకంఠాయ నమః – కంఠం పూజయామి
గజవక్త్రాయ నమః – వక్త్రం పూజయామి
విఘ్నహంత్రే నమః – నేత్రం పూజయామి
శూర్పకర్ణాయ నమః – కర్ణౌ పూజయామి
ఫాలచంద్రాయ నమః – లలాటం పూజయామి
సర్వేశ్వరాయ నమః – శిరః పూజయామి
విఘ్నరాజాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి
ఏకవింశతి పత్రపూజ
(21 విధముల పత్రములతో పూజింపవలెను)

సుముఖాయనమః – మాచీపత్రం పూజయామి।
గణాధిపాయ నమః – బృహతీపత్రం పూజయామి।
ఉమాపుత్రాయ నమః – బిల్వపత్రం పూజయామి।
గజాననాయ నమః – దుర్వాయుగ్మం పూజయామి
హరసూనవేనమః – దత్తూరపత్రం పూజయామి।
లంబోదరాయనమః – బదరీపత్రం పూజయామి।
గుహాగ్రజాయనమః – అపామార్గపత్రం పూజయామి।
గజకర్ణాయనమః – తులసీపత్రం పూజయామి,
ఏకదంతాయ నమః – చూతపత్రం పూజయామి,
వికటాయ నమః – కరవీరపత్రం పూజయామి।
భిన్నదంతాయ నమః – విష్ణుక్రాంతపత్రం పూజయామి,
వటవేనమః – దాడిమీపత్రం పూజయామి,
సర్వేశ్వరాయనమః – దేవదారుపత్రం పూజయామి,
ఫాలచంద్రాయ నమః – మరువకపత్రం పూజయామి,
హేరంబాయనమః – సింధువారపత్రం పూజయామి
శూర్పకర్ణాయనమః – జాజీపత్రం పూజయామి,
సురాగ్రజాయనమః – గండకీపత్రం పూజయామి,
ఇభవక్త్రాయనమః – శమీపత్రం పూజయామి,
వినాయకాయ నమః – అశ్వత్థపత్రం పూజయామి,
సురసేవితాయ నమః – అర్జునపత్రం పూజయామి।
కపిలాయ నమః – అర్కపత్రం పూజయామి।
శ్రీ గణేశ్వరాయనమః – ఏకవింశతి పత్రాణి పూజయామి.
శ్రీ వినాయక అష్టోత్తర శత నామ పూజా
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీప్తాయ నమః
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హయగ్రీవాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బల్వాన్వితాయ నమః
ఓం బలోద్దతాయ నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం భావాత్మజాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వ నేత్రే నమః
ఓం నర్వసిద్దిప్రదాయ నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః
ఓం కుంజరాసురభంజనాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థఫలప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళసుస్వరాయ నమః
ఓం ప్రమదాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షికిన్నరసేవితాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః
ఓం అభీష్టవరదాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్త రూపాయ నమః
ఓం పురాణపురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః ?
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అపాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః
ఓం సఖ్యై నమః
ఓం సారాయ నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం విశదాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః
ఓం సమస్తదేవతామూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం విష్ణువే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విష్వగ్దృశేనమః
ఓం విశ్వరక్షావిధానకృతే నమః
ఓం కళ్యాణగురవే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం పరజయినే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్
అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే
దశాంగం గుగ్గలోపేతం సుగంధం, సుమనోహరం, ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ॥

ధూపమాఘ్రాపయామి॥
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయా, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే

దీపందర్శయామి।
సుగంధాసుకృతాంశ్చైవమోదకాన్ ఘృతపాచితాన్, నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్,

భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ, ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక,

నైవేద్యం సమర్పయామి।
సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ, భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక

సువర్ణపుష్పం సమర్పయామి.
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాబూలం ప్రతిగృహ్యతాం

తాంబూలం సమర్పయామి।
ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ

నీరాజనం సమర్పయామి।
అథ దూర్వాయుగ్మ పూజా
గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

సర్వసిద్ది ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఏకదంతైకవదన తథామూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి।

నమస్కారము, ప్రార్థన
ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన,

ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి,
అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన,

పునరర్ఘ్యం సమర్పయామి,
ఓం బ్రహ్మవినాయకాయ నమః

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన,

ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్

వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ

నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.

శ్రీ వినాయక వ్రత కథ
గణపతి జననము
సూతమహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పెను। గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి కోరరాని వరము కోరినాడు। తనను ఎవరూ వధించజాలని శక్తిని, శివుడు తన ఉదరమునందే నివసించవలెనని కోరినాడు। ఆ ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు। అతడు అజేయుడైనాడు।

భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీ దేవికి చాలా దుఃఖహేతువైనది, జగత్తుకు శంకరుడు లేనిస్థితియది, జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువు నర్థించినది, విష్ణువు గంగిరెద్దువాని వేషము ధరించినాదు। నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లినాడు। గంగిరెద్దునాడించి గజముఖాసురుని మెప్పించినాడు గజముఖాసురుడు ఆనందంతో “ఏమి కావలయునో కోరుకో” అన్నాడు। విష్ణుదేవుని వ్యూహము ఫలించినది, నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చినాడు। శివుని నందీశ్వరుని వశము చేయుమన్నాడు। గజముఖాసురునికి శ్రీహరి వ్యూహమర్థమయింది। తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించినాడు। అయినా మాట తప్పుట కుదరదు। కుక్షియందున్న శివుని ఉద్దేశించి “ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియుచున్నది। నా యనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది” అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు। నందీశ్వరుడు యుదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కల్గించాడు। శివుడు గజముఖాసురుని శిరమును, చర్మమును తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు।

అక్కడ పార్వతి భర్త రాకను గురించి విని పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది। తనలో తాను ఉల్లసిస్తూ, స్నానాలంకారముల ప్రయత్నములో తనకై ఉంచిన నలుగుపిండితో ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది। అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది। దానికీ ప్రాణప్రతిష్ఠ చేయవలెననిపించినది। అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది, ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ట చేసినది। ఆ దివ్యసుందర బాలుని వాకిటనుంచి, తన పనులకై లోనికి వెళ్ళింది।

శివుడు తిరిగి వచ్చాడు, వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతరమందిరము లోనికి పోనివ్వక నిలువరించినాడు. తన మందిరమున తనకే అటకాయింపా! శివుడు రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు।

జరిగిన దానిని విని పార్వతి విలపించింది। శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోకపూజనీయతను కలిగించినాడు। గణేశుడు గజాననిడై శివపార్వతుల ముద్దులపట్టియైనాడు। విగతజీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని వాహనమై శాశ్వ్తతస్థానమును పొందాడు. గణపతిని ముందు పూజించాలి:

గణేశుడు అగ్రపూజనీయుడు
ఆది దేవుడు విఘ్నేశ్వరుడు కాని ప్రకృత గజాననమూర్తి మాట ఏమిటి? ఈ గజాననునికి ఆ స్థానము కలుగవలసి ఉంది। శివుని రెండవ కుమారుడైన కుమారస్వామి తనకు ఆ స్థానమును కోరినాదు। శివుడు ఇరువురికీ పోటీ పెట్టినాడు। “మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చేసి ముందుగా నావద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందన్నాడు। కుమారస్వామి వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు। గజాననుడుమిగిలిపోయినాడు। త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు ఉపాయమర్థించినాడు। వినాయకుని బుద్ది సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు। నారములు అనగా జలములు, జలమున్నియు నారాయణుని ఆధీనాలు। అనగా ఆ మంత్ర ఆధీనములు, మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నాముందే వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు। వినాయకునికే ఆధిపత్యము లభించినది।

చంద్రుని పరిహాసం
గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజనీయుడు, జగద్వంద్యుడూ। ఈ విషయమును విస్మరించిన చంద్రుడు వినాయకుని వింతరూపమునకు విరగబడి నవ్వాడు।

(చంద్రుడుమనస్సుకు సంకేతము) ఫలితముగా లోకమునకు చంద్రుడనను సరణీయుడైనాడు। ఆతని మాన్యత నశించింది। నింద్యుడయినాడు। ఆతడిపట్ల లోకము విముఖత వహించాలి। అనగా అతనిని చూడరాదు చూచిన యెడల అజ్ఞానముతో నింద్యుడయినట్లే, లోకులు కూడా అజ్ఞానులు నింద్యులు అవుతారు। నిందలకు గురియగుతారు।

చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు? నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు. లోకులును ఈ శాపము నుండి విముక్తికై గణపతిదేవుని అర్థించినారు. కరుణామయుడగు ఆ దేవుడు విముక్తికై ఉపాయము సూచించినాడు. భాద్రపద శుద్ధ చవితినాడు తన పూజచేసి తన కథను చెప్పుకొని అక్షతలు శిరమున ధరించిన యెడల నిష్కళంక జీవితములు సాధ్యమగునని అనుగ్రహించినాడు.

ఇది ఎల్లరికి విధియని వక్కాణించబడినది. దీనిలో ఏమరుపాటు ఎంతటివారికి అయినా తగదని శ్యమంతకమణ్యుపాఖ్యానము ద్వారా మరింత స్పష్టము చేయబడినది.

శ్యమంతకోపాఖ్యానము
చంద్ర దర్శనం నీలాపనింద: ఒకానొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీ కృష్ణపరమాత్మ పాలలో చంద్రబింబమును చూచుట సంభవించినది. దాని దుష్ఫలితము ఆయనకు తప్పలేదు. సత్రాజిత్తు అను నాతడు సూర్యోపాసనచే శ్యమంతకమను మణిని సంపాదించినాడు. దినమునకు ఎనిమిది బారువుల బంగారము నీయగల మణియది. అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదగినదని ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు భావించినాడు. ఆ విషయము సత్రాజిత్తునకు సూచించినాడు. అతనికి ఆ సూచన రుచించలేదు.

అనంతరము సత్రాజిత్తు తమ్ముడగు ప్రసేనుడు విలాసముగా ఆ మణిని ధరించివేటకై అడవికి వెళ్ళినాడు. అది ఆతనికి నాశనహేతువైనది. ఆ మణిని చూచి మాంసఖండమని భ్రమించిన సింహమొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని పోయినది.

నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేసాడు.

ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది.

అడవిలో అన్వేషణ సాగించినాడు. ఒకచోట ప్రసేనుని కళేబరము కనిపించినది. అచట కనిపించిన సింహపు కాలిజాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము, భల్లూకం పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గుహలోకి వెళ్ళాయి. గుహలో ఒక బాలికకున్న ఊయల తొట్టికి మణి వేలాడగట్టబడి ఉన్నది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. ఇంతలో భయంకరముగా అరచుచు ఒక భల్లూకం అతనిపై బడింది. భీకర సమరం సాగింది ఓక దినము కాదు, రెండు దినములు కాదు, ఇరువది ఎనిమిది దినములు. క్రమంగా ఆ భల్లూకమునకు శక్తి క్షీణించజొచ్చింది.

అది సామాన్య భల్లూకము కాదు. మహాభక్తుడు శక్తివంతుడైన జాంబవంతుడు. రామాయణ కాలమునాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడివడక నిలిచియున్నాడు. అజేయుడాతడు. ఎవరివల్లను అతడు క్షీణబలుడగు ప్రశ్నేలేదు. ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యము. ఈ విషయము తెలిసిన జాంబవంతుడు తాను ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రునితోనేనని గుర్తించి స్తోత్రము చేయనారంభించినాడు.

అది త్రేతాయుగపు గాథ. ఇది ద్వాపరయుగము. ఆ యవతారములో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకొమ్మనగా అవివేకముతో జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రునితో ద్వంద్వ యుద్దమును కోరినాడు. అది శ్రీరామకార్యము గాదు కానఅప్పుడు నెరవేరలేదు. అవివేకముతో అతడు కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధమయినది. ఇప్పుడు కర్మ పరిపక్వమయినది. నేడీ రూపమున ఆ ద్వంద్వ యుద్దము సంఘటిల్లినది. అవివేకము వైదొలగినది. అహంభావము నశించింది. శరీరము శిథిలమయింది. జీవితేచ్ఛ నశించింది. శ్రీకృష్ణపరమాత్మ రూపమున తనను అనుగ్రహించ వచ్చినది ఆ శ్రీరామచంద్ర ప్రభువేనని గ్రహించి ప్రణమిల్లి ఆ మణిని, ఆ మణీతో పాటు తన కుమార్తె జాంబవతిని అప్పగించి కర్మబంధ విముక్తి పొందాడు జాంబవంతుడు.

శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరమునకు వెళ్ళి పురజనులను రావించి జరిగిన యదార్థమును వివరించి నిందబాపుకున్నాడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు.

వినాయక వ్రతము చేయక చంద్రబింబమును చూచుట వలన జరుగు విపరీతమును స్వయముగా అనుభచించిన శ్రీకృష్ణపరమాత్మ లోకుల యెడల పరమదయాళువై భాద్రపద శుద్ధ చవితినాడు వినాయకుని యథాశక్తి పూజించి ఈ శ్యమంతకమణి కథను అనగా అందలి హితబోధను చెప్పుకొని, గణేశతత్వము పట్ల భక్తి వినయములతో శిరమున అక్షింతలు ధరించిన యెడల నాడు చంద్రదర్శనము చేసినను నిష్కారణ నిందా భయముండదని లోకులకు వరము ఇచ్చినాడు. అది మొదలు మనకు శ్యమంతకమణి గాథను వినుట సాంప్రదాయమయినది.

పూజచేసి కథనంతయు విను అవకాశము లేనివారు… సింహ ప్రసేనమవధీత్‌ సింహో జాంబవతా హతాః ఇతి బాలక మారోదః తవ హ్యేషశ్యమంతకః

సింహము ప్రసేనుని చంపినది. ఆ సింహమును జాంబవంతుడు చంపెను. కనుక ఓ బిడ్డా ఏడువకు. ఈ శ్యమంతకము నీదే అను అర్థము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగియున్నదని చెప్పబడినది. ఇది జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడినది.

సర్వేజనాః సుఖినో భవంతు.

విఘ్నేశ్వర చవితి పద్యములు
ప్రార్థన :

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌.
తలచెదనే గణనాథుని
తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా
దలచెదనే హేరంబుని
దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌
అటుకులు కొబ్బరి పలుకులు
చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌
నిటలాక్షు నగ్రసుతునకు
బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌.
వినాయక మంగళాచరణము
ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు
కమ్మనినేయుయు కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు – జయమంగళం నిత్య శుభమంగళం

వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి
మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి – జయమంగళం నిత్య శుభమంగళం

శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు భాసురోతునకు శాశతునకు
సోమార్కనేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు – జయమంగళం నిత్య శుభమంగళం

ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు కడుపుగలుగు
బోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ దేవగణపతికినిపుడు – జయమంగళం నిత్య శుభమంగళం

చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను
పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధీ గణపతికి బాగుగాను – జయమంగళం నిత్య శుభమంగళం

మహా శివరాత్రి

మాఘమాసంలో బహుళ చతుర్ధశిని “మహా శివరాత్రి” అంటారు. (తిథి ద్వయం వున్నప్పుడు అమావాస్యకు ముందు రోజు – రాత్రి చతుర్ధశి కలిగిన వున్న రోజుని జరుపుకోవాలి) . మహా శివరాత్రి మానవులందరకు పర్వదినము – అనగా గొప్ప పండుగ. చలి కాలం వెళ్ళబోతుండగా ‘మహాశివరాత్రి’ పండుగ దినము వస్తుంది. శివక్షేత్రములందు ‘శివరాత్రి’ని పార్వతీ పరమేశ్వరుల (శివ-పార్వతుల) కళ్యాణ మహోత్సవముగా చాలా గొప్పగా జరుపుతారు.
శిభక్తులు ఈ పండుగనాడు తెల్లవారు ఝాముననే నిద్ర లేస్తారు. ఇళ్ళలోను, గుళ్ళలోనూ కూడ శివపూజలు, శివాభిషేకములు చేస్తారు. ఈ రోజు ‘ఉపవాసం’, రాత్రి ‘జాగరణ ‘చేస్తారు. (రాత్రి అంతా మేల్కొని శివనామ స్మరణ చేస్తూ గడపడాన్ని జాగరణ అంటారు. మరునాటి ఉదయం యధావిధి స్నాన సంధ్యలు ముగించుకొని భగవంతునికి (శివునికి) అర్పించిన ఆహారాన్ని తింటారు.)

శివరాత్రి మహాత్యము:

తెలిసిగానీ, తెలియక గానీ భక్తి తోగాని, డంబముతో గాని, యీరోజు ఎవరైతే స్నానము, దానము, ఉపవాసము జాగరణ చేస్తారో వారికి శివ సాయుజ్యం కైలాస ప్రాప్తి తధ్యమని భక్తి గాధలు      తెలుపుతున్నాయి.

భార్య భర్తల మధ్య అన్యోన్యానికి:

రోజు సంధ్యాసమయంలో అర్ధనారీశ్వర స్తోత్రం పఠించి, తేనే కలిపిన పాలు నివేద్యం పెట్టండి. ఇలా ఒక మండలం(40 or 41) రోజులు కానీ రోజు కానీ చేస్తే తప్పక ఫలితం లభిస్తుంది.

సోమవారంనాడు శివాలయంలో పొద్దున్న సమయంలో తేనే, పాలు ఇవ్వండి.

సిరిసంపదలకి

ప్రతి సోమవారంనాడు కనీ, 16 సోమవారాలు కానీ  సోమవర వ్రతం చేయండి ఫలితం లభిస్తుంది.

అట్లతద్ది రేపే తెలుసా?

అట్ల తద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొంటారు. “అట్లతద్దె ఆరట్లు ముద్దపప్పు మూడట్లు” అంటూ ఆడ పడుచులకు బంధువులకు ఇరుగు పొరుగులకు వాయినాలివ్వటం పరిపాటి. సాయం సమయమందు వాయినలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి, అటునుండి చెరువులలో కాలువలలో దీపాలను వదలి, చెట్లకు ఊయలలు కట్టి ఊగటం చేస్తుంటారు.

గౌరీదేవి శివుని పతిగా పొందాలనే కృత నిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు. ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్ది వ్రతం చేయమని నారదుడు సూచించాడు. ఆయన ప్రోద్బలంతో పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతద్ది. ఇది స్ర్తీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం కన్నెపిల్లలు పడచువాణ్ణి పతిగా పొందాలనుకుంటే తప్పక ఆచరించవలసిన వ్రతమిది.

‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూడట్లోయ్’ అంటూ ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగుపొరుగువారికి అట్లు వాయనంగా ఇవ్వటం ఆచారం. చెట్టుకు ఉయ్యాలలు కట్టి ఊగుతారు.

ఆశ్వయుజ బహుళ తదియనాడు చేసుకునే ఈ పూజ ప్రధానంగా చంద్రుని ఆరాధనకు సంబంధించినది. చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత స్ర్తీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రం చెబుతోంది.

ఈ నోములో అమ్మవారికి అట్లు నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం ఉంది. నవగ్రహాలలో ఒకడైన కుజునికి అట్లంటే ప్రీతి. వీటిని ఆయనకు నైవేద్యంగా పెడితే కుజుని వలన కలిగే దోషాలు పరిహారమై, సంసారసుఖంలో ఎటువంటి అడ్డంకులు రావనేది ఒక విశ్వాసం. అంతేకాక కుజుడు రజోదయానికి కూడా కారకుడు కనుక ఋతుచక్రం సరిగా ఉంచి ఋతుసమస్యలు రానివ్వకుండా కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలుండవు. మినుముల పిండి, బియ్యప్పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకి, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు పోవడం కోసం, గర్భస్రావం కాకుండా సుఖప్రసవం అయ్యేందుకు ముత్తయిదువులకు అట్లను వాయనంగా ఇస్తారు. అట్లతద్దిలో ఇంతటి వైద్యవిజ్ఞానం ఉంది.

ఈ రోజు తెల్లవారుఝామునే స్ర్తీలు మేల్కొని స్నానం చేయాలి. పగలంతా ఉపవాసం ఉండాలి. ఇంట్లో తూర్పుదిక్కున గౌరీదేవికి మంటపం ఏర్పాటు చేయాలి. ధూప, దీప, నైవేద్యాలు పెట్టి ముందుగా గణపతిపూజ చేయాలి. పిదప శాస్త్రోక్తంగా గౌరీదేవికి పూజచేసి, ఆ తరవాత గౌరీ స్తోత్రం, శ్లోకాలు చదవడంతో పాటు, పాటలు పాడాలి. సాయంత్రం చంద్రదర్శనం అయిన తరవాత శుచిగా స్నానం చేసి మళ్లీ గౌరీపూజ చేయాలి. 11 అట్లు నైవేద్యంగా పెట్టాలి. ముత్తయిదువులకు అలంకారం చేసి 11 అట్లు, 11 ఫలాలు వాయనంగా ఇచ్చి అట్లతద్ది నోము కథ చెప్పుకుని అక్షతలు వేసుకోవాలి.

పేరంటానికి వచ్చిన ముత్తయిదువులకు నల్లపూసలు, లక్కకోళ్లు, రవికలగుడ్డలు, దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనాలు పెట్టి, తామూ భోజనం చేయాలి. 11 రకాల ఫలాలను తినడం, 11 సార్లు తాంబూలం వేసుకోవడం, 11 సార్లు ఊయల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం, ఇందులో విశేషం. ఇవన్నీ చేయడం వలన గౌరీదేవి అనుగ్రహం లభిస్తుందని, కన్యలకు గుణవంతుడైన భర్త లభిస్తాడని, పెళ్లయిన వారికి పిల్లలు కలుగుతారని, ఐదవతనంతో పాటు పుణ్యం లభిస్తుందని తరతరాల నుంచి వస్తున్న నమ్మకం. ఈపండగనే ఉయ్యాలపండగ లేదా గోరింటాకు పండగ అని అంటారు.

అట్లతద్దినాడు పిల్లల హడావుడి అంతా ఇంతా కాదు. ముందు రోజు చేతులకి గోరింటాకు పెట్టుకుంటారు. మరుసటి రోజు ఉదయమే చద్దెన్నం తినాలి కనుక ముందురోజు రాత్రి అన్నం వండుకుంటారు. ఇంకా గోంగూర పచ్చడి, ఉల్లిపాయ పులుసు, నువ్వులపొడి, గడ్డపెరుగు సిద్ధం చేసుకుంటారు. అట్లతద్దె రోజున తెల్లవారు ఝామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని, ఇరుగుపొరుగు పిల్లల్ని నిద్ర లేపడానికి ముద్దపప్పోయ్, మూడట్లోయ్, పీట కింద పిడికెడు బియ్యం, పిల్లల్లారా, జెల్లల్లారా లేచి రండోయ్…’ అని పాడుకుంటూ వెడతారు. అందరూ కలిసి చె ట్లకి వేసిన పెద్దపెద్ద ఉయ్యాలలు ఊగుతారు. ఆ తరవాత ఇళ్లకి వచ్చి అన్నాలు తిని తాంబూలం వేసుకుంటారు. ఎవరి నోరు ఎరగ్రా పండితే వారికి అంత మంచి మొగుడొస్తాడని ఒకరితో ఒకరు పరాచికాలాడుకుంటారు. ఆ తరవాత స్నానాదులు చేసి అట్లు వేసి ఒకరికొకరు వాయనాలిచ్చుకున్న తరవాత తింటారు. ఇది కన్నెపిల్లలంతా ఎంతో సంతోషంగా చేసుకునే పండుగ. తెల్లవారు ఝామునే లేవటం, పిల్లలతో కలిసి ఆడుకోవటం, పేరంటం చేస్తూ అందరితో సరదాగా ఉండటం పిల్లలకు అలవాటవుతాయి.

మా చిన్నప్పుడు పొద్దున్నే చద్దన్నం తినడానికి ఒకటే పేచి. కాని కొంత వయసు వచ్చాక మాత్రం అట్లతద్ది అర్ధం తెలిసాక ఎప్పుడు నలుగావుతుందా అని చూసే వాళ్ళం.

చలికాలం దగ్గర పడే సమయం కావడంతో పొద్దున్నే లేవలేకపోతారు. ఈ పండగ కారణంగా ఉత్సాహం కొద్దీ ఉదయమే లేవడం అలవాటు చేసుకుంటారు. అలాగే చలి నుంచి శరీరానికి వేడి పుట్టే ఆహారం కూడా ఆ రోజున తీసుకోవడం వల్ల ఆరోగ్యపుష్టికి దోహదపడుతుంది. నువ్వులపొడి, గోంగూర పచ్చడి, పెరుగు వంటివి శరీరానికి వేడి చేస్తే ఉల్లిపాయపులుసు చలవ చేస్తుంది. అంతేకాక అన్నీ చద్దివి తినడం వల్ల అరగదనే భయం కూడా లేకుండా తాంబూల సేవనం కూడా జరుగుతుంది. ఈ పండుగ ఆనంద, ఆరోగ్యాలను కలుగచేస్తుంది. ఆటపాటల వల్ల పిల్లలకి మంచి వ్యాయామం కూడా అవుతుంది.

ఇంత చక్కని వ్రతాన్ని మీరుకూడా చేసుకుంటారు కదూ!

దసరా

ఇంకా ఐదురోజులలో దసరా మొదలవబోతోందికద అందుకే నేను మీకు దసరా విశేషాలు, పూజ విధానాల రకాలు తెలియజేయాలని అనుకుంటూన్నానండి.

దీనిలో భాగంగానే నేను ఒక టపా రాసాను. అందరు చదివే ఉంటారు అనుకుంటున్నాను.

దసరా

ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ ‘దసరా‘ అంటారు. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విద్యార్ధులు పుస్తకపూజ, శ్రామికులు పనిముట్లపూజ, క్షత్రియులు ఆయుధపూజ చేసి, అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దేవి మహిషాసురమర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్పూర్తితో, పూర్వం రాజులు ఈశుభ ముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకొనే వారని పురాణాల్లో చెప్పబడింది. కొన్ని ప్రాంతాలలో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉంది.

ఈ దసరా సమయంలో ఆ అమ్మవారిని పదిరోజులు పది రూపాలలో  మ

నం కొలుస్తాం.  అన్నపూర్ణా దేవి, బాల త్రిపుర సుందరి, దుర్గా దేవి,  గాయత్రీ దేవి,  లలితా త్రిపుర సుందరి దేవి,

మహా లక్ష్మి దేవి, మహా సరస్వతి దేవి, మహిషాసురమర్ధిని దేవి ,

రాజరాజేశ్వరి దేవి రూపాలలో మనం ఈ దసరాలలో అమ్మవారిని పుజిస్తాము. ఈ నవరాత్రులలో

ఏదో తెలియని ఉత్సాహము, ఉల్లాసముతో ఇళ్లన్నీ కళకళలాడుతుంటాయి. ఇక అమ్మవారి ప్రశస్తి చెప్పనలవికాదు.

‘శమీపూజ’ చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే ‘జమ్మిచెట్టు’. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది, శమీవృక్ష రుపమున ఉన్న ‘అపరాజితా’ దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయము సాధించినారు.

కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరవాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరవాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు.


శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ ‘అపరాజితా’ దేవిని పూజించి, రావణుని సహరించి, విజయము పొందినాడు.

తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం ‘పాలపిట్ట’ను చూచే ఆచారం కూడా ఉన్నది.
మేము కూడా చిన్నప్పుడు పాలపిట్టను చూసి వచ్చే వాళ్ళము. తెలంగాణ ప్రాంతంలో దసరా సమయంలో బతుకమ్మ ఉత్సవాలు చేస్తారు.
ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని, విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.

శ్లో” శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |

అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||

అంతేకాకుండా విజయ దశమి రోజున షిర్డీ సాయిబాబా సచ్చరిత్ర ఒకసారి పారాయణ చేయాలంటారు. మొత్తం పారాయణ చేయలేకపోతే కనీసం ఒక్క సర్గ అయిన చదివేతే మంచిది. విజయ దశమి బాబాకి ఎంతో ఇష్టమైనరోజు. అందుకే ఆరోజున షిర్డీ అంతా జనసందోహంతో నిండిపోతుంది.

ఇలా చెప్పుకుంటూ పొతే దసరా కూడా అయిపోతుందండి అంత విశేషమైనది దసరా. ఇక ఇక్కడతో ఆపి మిగిలినది తరువాత టపాలో వ్రాస్తానండి.


శ్రీరామ నవమి శ్రీ సీతారాముల కళ్యాణము…!

రామా అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని జిహ్వ-జిహ్వే కాదు. శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై, సుందర సుమధుర చైతన్య రూపమై, కోట్లకొలది భక్తుల పూజలందుకొంటున్నాడు శ్రీరామచంద్రుడు.

సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం. శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. భద్రుడు అనగా రాముడు అని అచలుడు అంటే కొండ అని అందుకే రాముడు కొండపై నెలవై ఉన్న దివ్య ధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రం. శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి. చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు అభిజిన్ముహూర్తంలో శ్రీరాముడు దశరథుని కుమారునిగా జన్మించినట్లుగా మనకు వాల్మీకి రామాయణం ద్వారా తెలుస్తోంది. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా, అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణము, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్ట్భాషేకం రామునికి జరిగింది.

కోదండ రామకళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటా….శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్ర పర్వంగా పట్ట్భాషేక సమయాన తిలకించి పులకితులవుతారట. ఆంజనేయుని పదభక్తికి మెచ్చి, హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామగ్రామాన రామాలయం నెలకొని ఉన్నాయి. శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ, భాతృ, సదాచారం, నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు. శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు. ప్రతియేడు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతందనేది భక్తుల విశ్వాసం.

మన ఆచార వ్యవహారాలు:

ప్రపంచ సామాజిక చరిత్రలో భారతదేశానికున్న ప్రాముఖ్యత మరే ఇతర దేశానికీ లేదన్నది ప్రపంచ దేశాల ఉమ్మడి అభిప్రాయం. ఇందుకు కారణం ఇక్కడి ఆచార వ్యవహారాలే. ప్రతి దెశానికీ కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. ఐతే భారతదేశంతో పోలిస్తే ఆయా సంప్రదాయాలు ఒక్కో ప్రాంతాన్నిబట్టి మారుతూ ఉంటాయి.ముఖ్యంగా సాంఘిక వ్యవస్థలో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.

కాని భారతీయ సాంఘిక వ్యవస్థ మాత్రం అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధంగా ఉంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ ఇతర దేశాలకు ఓ సరికొత్త దిశను చూపుతున్నాయి. భారతదేశంలో ఉన్నా, మరే ఇతర దేశంలో ఉన్నా స్వదేశీయుడైనా, విదేశీయుడైనా; చిన్నవాడైనా, పెద్దవాడైనా అందరి నోటా వినిపించే ఏకైక మాట “ఇండియన్ కల్చర్”. వేరే ఏ ఇతర దేశమైనా తమ దేశం పేరుపెట్టి ఉచ్చరించడానికి సంశయించే కల్చర్ అన్న పదానికున్న గౌరవం ఒక్క భారతదేశానికి మాత్రమే దక్కడం వెనక ఉన్న భారతీయ సంస్ర్కుతి, చరిత్ర యొక్క ఘనత తేటతెల్లమవుతున్నాయి.ప్రక్రుతితో మనకున్న బంధంకానీ, వివాహ మరియు కుటుంబ వ్యవస్థ పట్ల మనకున్న గౌరవం వల్లకానీ మన సంప్రదాయాలకో ఘనమైన కీర్తి దక్కింది. భారతదేశ ఆవిర్భావం నాటినుండీ ఒక ప్రత్యేక క్రమశిక్షణ కోసం కొన్ని రూపొందించబడితే మరికొన్ని సంప్రదాయాలు మనలో అంతర్భాగంగా వాటంతటకవే స్రుష్టించబడ్డాయి.

స్రుష్టి గతానుక్రమంలో ఇదో అద్భుతమై ఖండాంతరాలలో మనకంటూ ఓ ప్రత్యేక వ్యవస్థను చాటాయి. ఇతర దేశాలకు మార్గదర్శకాలయ్యాయి. మన వేద విజ్ఞానాన్ని పాశ్చాత్యులు అనుసరిస్తున్నారు. యోగ నేర్చుకునేందుకు మన దేశానికే తరచూ వస్తునారు. భారతీయుల్ని సెంటిమెంటల్ ఫూల్స్ అని గేలి చేసినా ఆ సెంటిమెంటే మనలోని భాషాపరమైన, మతపరమైన భిన్నత్వాన్ని ఏకత్వంగా చూపిస్తుంది.మనల్ని ఏకతాటిపై నిలుపుతోంది. నవీన తరానికి నేటి ఆచార వ్యవహారాలు చాందసంగా అనిపించినా ఆ చాందసత్వమే వారి పాలిట వరమని కొన్నాళ్ళకి వాళ్ళే తెలుసుకునేలా చేస్తుంది. ఉదయం నిద్ర లేచినప్పటినుంచి రాత్రి నిద్ర పోయేవరకు మనం ఎన్నో నియమ నిబంధనలను అనుసరిస్తుంటాం. సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తాం. సూర్య నమస్కారాలు చేస్తాం.

ఇది మన ఆచార వ్యవహారాలలోని ఓ అంకమైనా దాని వెనుక ఓ గొప్ప సాధన యోగం ఉంది. అదే ఆరోగ్యానికి మూల కారణంగా నిలుస్తుంది. ఆ చిన్న రహస్యం తెలుసుకుంటే చాలు ప్రతి ఆచారం మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే ఓ సంజీవనిగా మనకు బోధపడుతుంది. అలాగే ఇంటి ముందు ముగ్గులేయడం. మన పూర్వీకులు పెట్టిన ఈ సంప్రాదాయం శుభ మంగళానికి చిహ్నంగా కళ్ళకు కనబడుతున్నా, వీధిలోని బ్యాక్టీరియా ఇంటిలోకి రాకుండా నియంత్రించే ఒక ఔషధంగా ఇది ఉపయోగపడుతుంది. కొన్ని ఆరోగ్యానికి సూత్రాలుగా నిలిస్తే, మరికొన్ని నడవడికకు మార్గదర్శిగా నిలుస్తాయి. అజ్ఞానాన్నీ, అహంకారాన్నీ కొన్ని తొలగిస్తే కొన్ని అరాచకం ప్రబలకుండా నియంత్రిస్తాయి. ఆరోగ్యం దేహానికి మాత్రమే కాదు, ఈ సమాజానికి కూడా ఎంత అవసరమో ఈ కట్టుబాట్లు తెలియజేస్తాయి. ఆరోగ్యకరమైన సమాజమంటే మిత్రభేదం లేని ఆహ్లాదకరమైన సమాజం. అశాంతులకి అవకాశమీయని నాగరిక సమాజం.అటువంటి సమాజం కావాలంటే కట్టుబాట్లనేవి ఇంటినుంచే ప్రారంభం కావాలి. ఇంట్లో పాటించే అనేక కట్టుబాట్లు కట్టుదిట్టమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయి.
మనం చేసే ఉపవాస దీక్షలు పరులకు ఎంతగానో ఉపకరిస్తాయి. ఏ విధంగా అంటే ఉపవాసం ద్వారా మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. దానివల్ల మనిషిలో మానసిక ఎదుగుదల వస్తుంది. మానసికంగా పరిపూర్ణుడైన వ్యక్తి లో ఇరుగు పొరుగు అనే భావన కలుగుతుంది. తన అనే భేద భావం పోయి మన అనే ఆలోచన కలుగుతుంది. అది అతని పొరుగువారికి ఎంతో శ్రేయోదాయకంగా ఉంటుంది. సమాజ నిర్మాణంలోపాలుపంచుకోవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. అలాగే ప్రార్ధనా స్థలాలకు వెళ్ళడం, జాగరణలు చేయడం ఇవన్నీ మన సంస్ర్కుతిలో భాగాలు. వీటి వల్ల శాంతి ప్రవర్తన కలిగి, సౌభాగ్యం వెల్లివిరుస్తుంది.
ఈ సాంఘికాచారాలనే సంస్కారాలు అని కూడా అంటారు. వీటిలో కొన్ని ఆరోగ్యం కోసం చేసేవైతే, మరికొన్ని ఇంటిపై ఇతర చెడు ప్రభావాలు (దిష్టి) పడకూడదని చేసేవి. ఈ సంస్కారాల్లో ముఖ్యమైనవి పెళ్ళి, నామకరణము, అన్నప్రాశనము, పుట్టు వెంట్రుకలు తీయించుట, చెవులు కుట్టించుట, అక్షరాభ్యాసము, ఉపనయనం మొదలైనవి. స్త్రీలకు ప్రత్యేకంగా సీమంతము అనే ఆచారముంది. సీమంతమంటే గర్భిణి స్త్రీకి ఆరవ నెలలో చేసే శుభ సంస్కారం. పెళ్ళిలో రెండు విధాలైన ఆచారాలు ఉంటాయి. అవి ఆర్యాచారాలు, దేశీయాచారాలు. పాణిగ్రహణము, సప్తపది ఆర్యాచారాలు. కాబట్టే వీటిని వైదిక మంత్రాల ద్వారా నిర్వహిస్తారు. మంగళసూత్రధారణ దేశీయాచారము. కాబట్టి దీన్ని మంత్రాలతో కాక శ్లోకాలతో నిర్వహిస్తారు. అనేక వేడుకల సంగమమే పెళ్ళి.
కొత్త దంపతుల మధ్య అన్యోన్యత పెరగడానికి పెద్దలు అనేక వేడుకలు చేస్తారు. పూల చెండ్లతో బంతులాట ఒకటి. తరువాత అయిరేని కుండలలో బంగారం, వెండి ఉంగరాలు వేసి దంపతులచే తీయించడం మరోటి. వీటన్నింటిలోనూ తలంబ్రాలు పోసుకొనుటలో ఎంతో వినోదం ఉంటుంది. ఇటివంటి ఆచారాలు ప్రాచీన కాలం నుంచీ వస్తూ మన నిత్య జీవితంలో అంతర్భాగాలైపోయాయి. ఐతే ఈ సాంఘికాచారాలు చాలావరకు స్త్రీలకు సంబంధించినవే ఉంటాయి. ఉపనయనం మాత్రం కేవలం పురుషులకు సంబంధించినది. ఇంటి ఆడపిల్లను ఒక గ్రుహిణిగా తీర్చిదిద్దేందుకు చేసే పద్ధతులే ఈ ఆచారాలు. ఓర్పు, మితభాషిత్వం నేర్పేందుకు మౌనవ్రతము లేదా మూగ నోము అనే అచారము ఏర్పదింది. మూగనోము దీపావళి వెళ్ళిన మరునాటినుంచి కార్తీక శుద్ధ పూర్ణిమ వరకు పదిహేను రోజులపాటు చేస్తారు. ఇవికాక ఇంకా చిన్న చిన్న నోములు బాలికలకు అనేకం ఉంటాయి.
శ్రావణ మాసంలో చేసె గౌరీ వ్రతము, వరలక్ష్మి వ్రతము, ఇంకా…అట్లతద్దె, నాగుల చవితి, బొమ్మల నోము మొదలైనవి. కొందరు మొక్క మొలిచిన కంద దుంపను తెచ్చి అలంకరించి పసుపు కుంకుమలతో పూజిస్తారు. దీనివల్ల కందపిలకలవలే సంతనాభివ్రుద్ధి జరుగుతుందని వీరి నమ్మకము. అట్లతద్దె నాదు ప్రొద్దున్నే నిద్రలేచి, తలారా స్నానాలు చేసి, పెరుగన్నం తింటారు. ఆ తరువాత పెద్దలు అట్లు పోసి చుట్టుప్రక్కలవారికి పంచడం చేస్తుంటారు.అత్లతద్దె నాటి వేడుకలలో అత్యంత ముఖ్యమైనది ఊయలలు వేయడం.
ఈ ఊయలలు ఇళ్ళలోనే కాకుండా ఊరంతా అనుకూలంగా ఉన్నచోటల్లా వేస్తారు. ముఖ్యంగా తాటి చెట్టు బోదెలతో వేసె అతి పెద్ద ఊయలలు ఊరంతా వినోదాన్ని నింపుతాయి. తెలంగాణ ప్రాంతంలో స్త్రీలు బతకమ్మ పండుగను ఎంతో ఘనంగా చేస్తారు. బతకమ్మను చెరువులో వాలారించి చల్దులు తిని ఇంటికొస్తారు. స్త్రీలు మిక్కిలి భక్తి శ్రద్ధలతో చేసే వ్రతం నాగులచవితి. పాము పుట్ట వద్దకు వెళ్ళి పుట్టలో పాలు పోసి, మొక్కుకుంటారు. నాగెంద్రునికి వేది వస్తువులు పెట్టరు. ప్రధానంగా చలిమిడి పెదతారు. ఇదే కాకుండా గ్రామ దేవతను సంత్రుప్తిపరిచేందుకు బోనాలు పెడతారు. బోనము అంటే అన్నం వండి పెరుగు, స్వీటు చేసి, ఒక గిన్నెను పసుపు కుంకుమలతో అలంకరించి బోనమును దానిలో పెట్టి గ్రామ దేవతకు సమర్పించడం. ఇవేకాక స్త్రీలు చేసె మరో చక్కని వ్రతము బొమ్మల నోము.
దీని కనుమ పండుగ నుండి 9 రోజులపాటు జరుపుకుంటారు. ఈ వ్రతము ఐదవతనమును పెంపొందిస్తుందని వారి నమ్మిక. పురుషుల వినోదాలు మరో రకంగా ఉంటాయి. సంక్రాంతికి కోడి పందేలు, పొటేళ్ళ పందేలుతో సరదాగా గడుపుతారు. ఉపనయనం మాత్రం కేవలం పురుషులకు సంబంధించినది. దీని కనుమ పండుగ నుండి 9 రోజులపాటు జరుపుకుంటారు. ఈ వ్రతము ఐదవతనమును పెంపొందిస్తుందని వారి నమ్మిక. పురుషుల వినోదాలు మరో రకంగా ఉంటాయి. సంక్రాంతికి కోడి పందేలు, పొటేళ్ళ పందేలుతో సరదాగా గడుపుతారు. పట్టణాల్లోకంటే గ్రామాల్లోనే పురుషుల వినోదాలు ఎక్కువ. ఏదేమైనా పురాతనకాలం నాటి ఆచార వ్యవహారాలను వీడకుండా వాటిని చెక్కుచెదరకుండా ఆ వారసత్వాన్ని మన పెద్దలు మనకు అందిస్తూనే ఉన్నారు. వాటి మనుగడకోసం క్రమశిక్షణతో క్రుషి చేస్తున్నారు. తమ తమ వారసులకు వాటి ఔన్నత్యాన్ని చాటి చెబుతున్నారు.
ఆ సంప్రదాయాలను కాపాడుకుంటూవస్తున్నారు. సంస్ర్కుతీ సంప్రదాయాల ద్వారా సమైక్యతను చాతుతున్న భారతదెశం ఇతర దేశాలతో పోలిస్తే ఎన్నో విధాలుగా ముందంజలో ఉందని చెప్పవచ్చు. అందుకు ఆధారం ప్రపంచ దేశాలు మన సంస్ర్కుతి పట్ల ఆకర్షితులవడమే. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించే సంప్రదాయం ఒక్క భారతదేశంలోనే ఉంది. ఆ సమైక్యత వారసత్వంగా తరతరాలకూ అందుతూనే ఉంది.ఆ సంపదను కలసిమెలసి అనుభవించడం, ఆ ఆనందాన్ని నలుగురితోనూ పంచుకోవడంలోనే అసలైన ఆనందం ఉంది. ఆ ఆనందాలకు శాశ్వతత్వం చేకూర్చవలసిన బాధ్యత అందరి మీదా ఉంది.

శ్రీరామనవమి:

దుష్టశిక్షణ శిష్టరక్షణార్ధమై చైత్రశుద్ద దశమినాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’ గా విశేషంగా జరుపుకుంటాం.

‘రామ’ యనగా రమించుట అని అర్ధం. కావున మనము ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న ‘ఆ శ్రీరాముని’ కనుగొనుచుండవలెను. ఒకసారి పార్వతీదేవి పరమశివుని ‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం’ అని, విష్ణు సహస్రనామ స్తోత్రంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు, “ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!” అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు. శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే || ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.
ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవశంకరుడే ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి వార్కి సధ్గతి కలిగిస్తారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక భక్త రామదాసు అయితే సరేసరి! శ్రీరామనామ గానమధుపానాన్ని భక్తితో సేవించి, శ్రీరామ నీనామ మేమి రుచిరా… ఎంతోరుచిరా… మరి ఎంతో రుచిరా… అని కీర్తించాడు. మనం శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట! అలాగనే ‘మ’అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు ‘రామనామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట! శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరకీ పంచుతారు

శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి

దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో “శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి” వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును “శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి” గా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత సమీక్షగా తెలుసుకుందాము! పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న “తారకా సురుడు” అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై! దేవతలు బ్రహ్మదేవుని శరణువేడినారు.
దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి, వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లకాని వానికి మరణములేదు. కావున! మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం శెలవిచ్చారు. అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి, శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు! దేవతలు మన్మధుని ఆశ్రయిస్తారు.
మొత్తం మీద మన్మధుని పూలబాణాలతో ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురు అయినా! పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుడు కారణ భూతుడవుతాడు. కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్ధనమేరకు పునర్జీవింపబడతాడు. ఇలా ఉండగా! పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందసమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గ్రహించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు.
ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్‌కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక రెల్లుపొదలో విసర్జిస్తారు. అంత ఆ ఆరుతేజస్సులు కలసి ఆరుముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు. ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అనియు, సుబ్రహ్మణ్యస్వామి అనియు నామాలతో పిలువసాగిరి. కారణజన్ముడైన ఈ స్వామి పార్వతి పరమేశ్వరులు, దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి, వానిని దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు “శూలం” మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి “శక్తి” అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడ్నిచేసి, తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. అంత ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపందాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి కొన్ని అక్షౌహిణులను సంహరించి, రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి “సర్పరూపం” దాల్చి వారిని ఉక్కిరి బిక్కిరి చేసి, భీకర యుద్ధము చేసి తారకాసురుని సంహరించి విజయుడైనాడు.
సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపిన ఈ రోజును “శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి”గా పరిగణిస్తారని, సర్వులకు పూజ్యనీయులైన శ్రీ వేదవ్యాసులవారు దీని విశిష్టతను వివరిస్తారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్కి గ్రామాలు, పట్టణాలు అనుబేధము లేకుండా దేశం నలుమూలలా దేవాలయాలు కలవు. ఈ రోజున “శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి” వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు తీర్ధములు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని; పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని ప్రజల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినాన శ్రీ స్వామికి పాలు, పండ్లు, వెండి, పూలు పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇటువంటి పుణ్యప్రదమైన “శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి” నాడు మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు పొందుదాము.