పాదాల పగుళ్ళ నివారణ

పాదాల పగుళ్ళు సాదారణము గా పొడి చర్మము ఉన్న వాళ్ళకి , మధుమేహ వ్యాధి గల వారికి ఎక్కువగా బాధపెడతాయి .

కారణాలు :

* శరీరములో అధిక వేడి ,
* పొడి చర్మము ,
* ఎక్కువ సేపు నిలబడి పనిచేయువారికి ,
* కటిన నేలపై నడవడం ,
* ఎత్తైన చెప్పులు ధరించి నడవడం ,
* అధిక బరువు కలిగిఉండడం ,
* పోషకాహార లోపము ,
* మధుమేహ వ్యాది ,

పరిష్కార మార్గాలు >

* రొజూ నిద్రించటానికి ముందు కాళ్ళను శుభ్రపరుచుకుని తడుచుకోవాలి .
* పగుల్లపై కొబ్బరి నునే తో మృదువుగా మర్దన చేసి మందం గా ఉండే సాక్సులు ధరించాలి .
* ప్రతిరోజూ ఉదయం పాత బ్రష్ తో రుద్ది గోరువెచ్చని నీటిలో కడిగితే మురికి , మ్రుతకనలు పోయి నున్నగా తయారవుతాయి .
* అరటిపండును ముద్దగా చేసుకొని పగుళ్ళ పై రాసి పదినిముసాలు వుంచి తరువాత నీటితో శుభ్రపరచుకుంటే పాదాలు మెట్టబడతాయి .
* గోరువెచ్చని నీటిలో కొంచెము నిమ్మరసం వేసి అందులో పదాలను వుంచి పది నిముషాలు తరువాత మామూలు నీటితో శుభ్రపరచుకునే పగుళ్ళ ఉండే నొప్పి తగ్గుతుంది .
* ప్రతి రోజు సాయంత్రం రోజ్ వాటర్ ను పళ్ళెం లో వేసి పది నిముషాలు పాదాలు ముంచి ఉంచితే మృదువు గా తయారవుతాయి .
* నిమ్మరసము వ్యాజ్ లైన్ వేసిన గోఫువేచ్చని సబ్బుద్రావనం లో పాదాలను పెట్టి 10 నిముషాలు అయ్యాక పొడి వస్త్రం తో తుడిచి నాణ్యమైన మాయిశ్చరైజర్ రాయాలి .
* ఉదయం ఆవన్ర్న్ర్ తో కాళ్ళను మర్దన చేసుకుంటే పగుళ్ళు మెత్తబడి కొద్దిరోజులకు తగ్గిపోతాయి .
* రోజు మంచి పోషకాహారము తీసుకోవాలి .

పాదాల శుభ్రత కోసం

రోజు పడుకునే ముందర మీ పాదాలను కాసేపు గోరువెచ్చని నీటిలో   ఒక పది నిముషాలు వుంచండి. పగుళ్ళు వుంటే మాత్రం తప్పకుండ డి చేయాలండి.  వారానికి ఒకసారి లేదా పది రోజుల కొకసారి గోరువెచ్చని నీటిలో ఉంచిన తరువాత పాదం అడుగు భాగం లో వున్న డెడ్ స్కిన్ తొలగించాలి. దీనికి బయట దుకాణాలలో స్క్రుబ్బెర్(pumic  stone) అనే చిన్న రాయి లాంటి డి దొరుకుతుంది. దానితో మరి గట్టిగ కాకుండా రుద్దితే మట్టి లాంటి పదార్దం వచేస్తుంది. తరువాత Nailcutter  వెనుక భాగంతో గొల్లాల్ ఇరుకుకున్న మట్టిని తీసేసి  గోళ్ళు కట్టిరించుకున్నాక చల్లటి నీటితో   కడిగేసుకుని ఒక బట్ట తో తుడుచేసి moisturizer రాసుకోండి. అదే మీ పాదాలకు పగుళ్ళు ఎక్కువగా వున్నట్లితే pedicure మాత్రం ఒకసారి  చేయిచుకోండి. ఇలా చేసి చూస్తారు కదూ!

నిగనిగలాడే ఒత్తయిన కురుల కోసం

సౌందర్య పోషణలో అతివల జుట్టుకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో మన జుట్టుని చూసి చెప్పవచ్చు. ఒత్తయిన నిగనిగలాడే జుట్టు ఆరోగ్యానికి సంకేతం. వాతావరణ కాలుష్యం వల్ల, సరైన పోషణ లేక జుట్టు పొడిబారిపోయి రాలుతుంది. ఈ చిట్కాలతో దీన్ని అరికట్టి మెరిసే జుట్టు మీ సొంతం చేసుకోండి ఇలా…

ఒక టీ స్పూన్ తేనే, టీ స్పూన్ ఆలిన్ ఆయిల్, టీస్పూన్ నిమ్మరసం కలిపిన మిశ్రమంలో కోడిగుడ్డులోని తెల్లసోనని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి కుద్దుళ్ళ నుండి పట్టించాలి. 20 నిమిషాల తరువాత తల స్నానం చెయ్యాలి.

ఒక కప్పు కొబ్బరి నూనె, ఒక కప్పు ఆవాల నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక కప్పు కరివేపాకుల్ని వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి చిన్న మంట పై వేడి చెయ్యాలి. కరివేపాకు కాస్త వేగగానే నూనె మిశ్రమంలోంచి తీసెయ్యాలి. ఆ తరువాత దింపేసి మూడు కర్పూరం బిళ్లలు వెయ్యాలి. చల్లారిన తరువాత నూనె మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి జుట్టుకంతా పట్టించి రాత్రంతా అలాగే ఉంచి, మరుసటి రోజు తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది

జుట్టు రాలడం సమస్యగా ఉందా?..

చాలా మంది అందంగా ఉన్నా, జుట్టు మాత్రం గడ్డి లాగా ఉంటుంది.దీనితో వారు సహజం గా అందం గా ఉన్నా జుట్టుకు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో తెలియక దిగులు పడుతూ ఉంటారు.కొంచెం సమయమం కేటాయిస్తే అందమైన, పట్టు కుచ్చు లాంటి జుట్టు మీ సొంతం..!! అది ఎలా అంటే..తలంటి పోసుకునే ముందు రోజు రాత్రి ఆలివ్ ఆయిల్, ఆముదం, కొబ్బరినూనె ఈ మూడు సమభాగాలుగా తీసుకుని కొంచెం గోరు వెచ్చగా చేసి 5నుండి10 నిమిషాలు మునివేళ్ళతో మృదువు గా మసాజ్ చేయండి.తరువాత రోజు పొద్దున వీలైతే కుంకుడుకాయల తో కాని, మీ తలకి సరిపడిన మంచి మైల్డ్ అంటే ఎక్కువ కెమికల్స్ లేని షామ్పూ తో శుభ్ర పరుచుకోండి.ఇలా వారానికి 2 సార్లు చేయటం ద్వారా నెల తిరిగే సరికి మీ జుట్టు లోని మార్పు ను మీరే గమనిస్తారు.!!మీ జుట్టు కు మంచి మెరుపు రావటము కోసం ఇలా చేయండి.

కేశ సౌందర్య కానుక మీ జుట్టు కోసం
మీ జుట్టు తలంటి పోసుకున్నా కూడా నిర్జీవం గా ఉందా??ఐతే మీ జుట్టు మెరుపు కు “మన అమ్మ” చిట్కా!!దీనివల్ల మీజుట్టుకు మెరుపు మాత్రమే కాక, మృదువు గా అవుతుంది..!! మామూలుగా మీ తలంటి అయ్యాక , చివర్లో ఒక నిమ్మచెక్క ను తీసుకొని ఒక మగ్గు గోరు వెచ్చని నీళ్ళలో పిండి, ఆ నీళ్ళను తలమీద పోసుకోండి.తరువాత మరొక మగ్గు మామూలు నీళ్ళను పోసుకోండి.ఇంతే మీరు చేయాల్సింది…ఎంత సులువో చూశారా!..

చక్కని జుట్టు కోసం
అందమైన, దట్టమైన, నల్లని, నిడుపాటి కేశసంపద అంటే ఎవరికైనా ఇష్టమే. కానీ ఉరుకులు పరుగుల నేటి జీవితంలో కేశసంరక్షణ కోసం తగినంత సమయం కేటాయించే అవకాశమే కనిపించటం లేదు. అయినప్పటికీ, తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ఎవరైనా చక్కని నిగనిగలాడే కేశపాశంతో అందరి దృష్టిలోనూ అందగత్తెలుగా నిలవవచ్చు.

జిడ్డుగా వుండే జుట్టుకు తరచూ అంటుకుపోయే సమస్య ఎక్కువగా వుంటుంది. మైల్డ్‌ షాంపూను రోజూ వాడటం లేదా వారంలో మూడు రోజులు వాడటం వల్ల ఈ అంటుకుపోవటం తగ్గుతుంది. ఎండిపోయినట్లుగా వుండే జుట్టుకు మూడు రోజుల కోసారి షాంపూ చేసుకోవటం మంచిది. ఇలాంటి రకం జుట్టుకు, క్రీమ్‌ వున్న షాంపూలు మేలు చేస్తాయి.

షాంపూను ఎప్పుడూ నీటిలో కలిపిన తరువాతే తలకు పట్టించుకోవాలి. నేరుగా షాంపూలను తలకు పట్టిస్తే, జుట్టు బలహీనమవుతుంది.

షాంపూ చేసుకున్న వెంటనే జుట్టుకు కండిషనర్‌ పట్టించుకుంటే, జుట్టు పట్టుకుచ్చులాగానూ, మెరుస్తూనూ వుంటుంది. జిడ్డుగా వుండే జుట్టుకు, 1/2 మగ్గు నీటిలో 1 చెక్క నిమ్మరసం, 1 చెంచా వినిగర్‌ కలిపి కండిషనర్‌లా వాడుకోవాలి. శుష్కమైన కేశాలకు క్రీమ్‌ కలిసిన కండిషనర్‌లను వాడాలి.

జిడ్డుగా వుండే జుట్టుకు మసాజ్‌ చేసేటప్పుడు, నూనెకు మారుగా హెయిర్‌ టానిక్‌ వాడాలి. దీని వల్ల జుట్టు ఆరోగ్యవంతంగా వుంటుంది.

అప్పుడప్పుడూ చక్కని క్లినిక్‌లో జుట్టుకు లేజర్‌ ట్రీట్‌మెంట్‌ చేయించుకుంటుంటే, జుట్టు కుదుళ్లు దృఢంగా వుంటాయి. వారంలో ఒకసారి ఇంట్లోనే స్టీమ్‌ మసాజ్‌ చేసుకోవచ్చు. జుట్టుకు నూనె బాగా రాసుకుని మర్దన చేసుకుని, గంట తరువాత వేడి నీటిలో టవల్‌ను తడిపి, పిండి, తలకు చుట్టుకోవాలి. కాసేపటి వరకూ మళ్లీ మళ్లీ తడుపుతూ, చుట్టుకుంటూ వుండాలి.

నీరు బాగా తాగటం వల్ల తల మీది చర్మంలో తగినంత తేమ నిలిచి వుంటుంది. చుండ్రు వచ్చే అవకాశాలు కూడా బాగా తగ్గుతాయి. అందుకని రోజులో 10 నుంచి 15 గ్లాసుల నీరు తప్పకుండా తాగాలి.

టవలూ, దువ్వెనా, ఎవరివి వారికే వుండాలి. అలా జాగ్రత్త పాటిస్తే, ఇన్ఫెక్షన్‌లు వచ్చే అవకాశాలూ తగ్గుతాయి. జుట్టూ ఆరోగ్యంగా వుంటుంది.

జుట్టు, కెరోటిన్‌ ప్రోటీన్‌తో తయారవుతుంది. జుట్టు బాగుండాలంటే, కెరోటిన్‌ ప్రోటీన్‌ వుండే పదార్థాలైన పాలు, పాలతో చేసిన పదార్థాలు, బీన్స్‌, సోయా, గుడ్లు, మాంసం, చేపలు బాగా తీసుకోవాలి. జుట్టు రాలటం, బలహీనం కావడం జరిగితే, ఏదైనా మంచి బ్యూటీ క్లినిక్‌లో ఓజోన్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలి. దీని వల్ల జుట్టు దృఢంగా వుండటంతో పాటు, కొత్త జుట్టు కూడా పెరుగుతుంది.

నెలకు ఒకసారి జుట్టుకు గుడ్డు పట్టించి, 20 నిముషాల తరువాత కడిగేయాలి. ఆ పైన షాంపూ చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు రాలదు; జుట్టుకు కొత్త మెరపూ వస్తుంది.

నెలకు ఒకసారి జుట్టుకు తప్పకుండా మెహందీ పెట్టుకోవాలి. మెహందీ, జుట్టుకు మెరపు నీయటంతో పాటు, మంచి కండిషనర్‌గానూ పని చేస్తుంది.

తలంటుకునే రోజు మందు రాత్రి పడుకునే ముందు లేదా తలంటుకునే అరగంట ముందు జుట్టుకు నూనె రాసి, కడిగేయాలి. దీని వల్ల జుట్టుకు కావలసిన తేమతో పాటు, కాంతి కూడా నిలిచి వుంటుంది. జుట్టుకు పరమశత్రువు చుండ్రే కనుక యాంటి డాండ్రఫ్‌ షాంపూలు వాడాలి. దీనితో చుండ్రు సమస్యను శాశ్వతంగా పోగొట్టుకోవచ్చు.‌

ముఖవర్చస్సుకు క్యారెట్టు…!

మహిళలకు అందమైన మోముంటే అందరూ చాలా బాగుందంటారు. దీనికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కాని ఇంట్లో దొరికే వస్తువులతో ప్రయోగాలు చేసుకోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. దీనికి చేయవలసిందల్లా ఒక్కటే…బంగారంలాంటి మేనిమి ఛాయ బంగారంలా మెరవాలన్నా, కంటి ఆరోగ్యం కోసం విటమిన్ ఏ పుష్కలంగా ఉండే క్యారెట్టును వాడాలంటున్నారు.బ్యుటీషియన్స్. ముందుగా ఒక క్యారెట్‌ను తురుముకోవాలి. అందులో ఒక చెంచా పాలను అందులో కలుపుకొని కాసింత నీటిలో ఉడకబెట్టాలి. చల్లారిన తర్వాత పాలనుకలుపుకుని ముఖానికి,శరీరానికి పట్టించండి. అరగంట అయిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరచండి. దీంతో మీ చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా మృదువుగా తయారవుతుంది.

చిక్కటి శిరోజాల కోసం చిట్కాలు

నేడు ఎన్ని ప్రయత్నాలు చేసినా 80శాతం మంది यసీల తలవెంట్రుకలు తెల్లబడటం, పలచబడటం,ఊడిపోవటం వంటి సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ సమస్య గురించి ఆలోచించి ఆరోగ్యం పాడుచేసుకోవద్దని, కేశాల సంరక్షణకోసం తీసుకోవాల్సిన ఆహారం, ఇతర జాగ్రత్తలు యోగాపరంగా ఉన్న పరిష్కార మార్గాలు ఉన్నాయని కొంతమంది నిపుణులు పేర్కొంటున్నారు.మరి అవి ఏమిటనేవి ఇపుడు తెలుసుకుందామా.

స్త్రీ లలో తల వెంట్రుకలు ఒక నెలలో 1.2 సెంటీ మీటర్ల పొడవు పెరుగుతాయి. ఇతర సమస్యలు లేకుండా ఉంటే 15 నుంచి 30 సంవత్సరాల వయసువారిలో జుట్టు అతివేగంగా ఒత్తుగా పెరుగుతుంది.

సమస్యలకు గల కారణాలు
జుట్టు ఊడటానికి ప్రధాన కారణం పోషకాహార లోపం. విటమిన్‌ బి6, అమినోయాసిడ్‌ లోపం వలన కూడా జుట్టుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.  మానసిక ఒత్తిడి, చింత, తీవ్ర మనస్తాపం, అధిక శ్రమ వలన ఈ సమస్యలు తలెత్తుతాయి. తరచుగా జలుబు చేయటం, టైఫాయిడ్‌, రక్తహీనత, జ్వరంతో కూడిన హెచ్చుస్ధాయి జలుబు, దగ్గు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నపుడు కూడా కేశాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.  వెంట్రుకలు నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోకపోవటం, అధిక షాంపూ, సబ్బులు వాడటం కూడా సమస్యలకు కారణమవుతాయి.  ఈ సమస్య అధికంగా మాంసాహారం, చేపలు, గుడ్లు తినేవారిలో వచ్చే అవకాశం ఉందని ప్రముఖ వైజ్ఞానిక ఆచార్యుల అభిప్రాయం.

ఆహారం, దినచర్య, నిద్ర, వ్యాయామం సరైన క్రమంలో లేకపోవటం కూడా కేశాల సమస్యలకు కారణమవుతాయి. ఆహారం కేశాల రక్షణకు 15 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు  80 నుంచి 100 గ్రాముల ప్రొటీన్లు మధ్య వయసు కలవారు 60నుంచి 80 గ్రాముల వరకు ప్రొటీన్లు ప్రతిరోజూ తప్పనిసరిగా తీసుకోవాలి.  ఆవుపాలు (స్వదేశీఆవుపాలు శ్రేయస్కరం) పెరుగు, మొలకెత్తిన విత్తనాలు, సోయాబీన్స్‌ ఇవి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.  విటమిన్‌ ఎ, బి ,ఐరన్‌, కాపర్‌, అయొడిన్‌ ఉన్న పదార్థాలు తీసుకోవాలి.  ఆకుకూరలు, తేనె, కాలానుగుణంగా లభించే పళ్లు,  మొలకెత్తిన గింజలు, గోధుమ గడ్డి జ్యూస్‌, గోధుమ పదార్ధాలు విశేష  లాభాన్నిస్తాయి.  అంతేకాకుండా సమయానుకూలంగా, కాలానికి తగినట్టుగా ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి.

కేశాల సంరక్షణ కోసం
తలస్నానం చన్నీటితో చేయాలి. స్నానానికి కుంకుడు రసం వాడాలి.  స్నానానంతరం వేళ్లతో జుట్టు కుదుళ్లకు ఆ ప్రాంతంలో వేడి పుట్టేలా మర్దనా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీనివలన తలలోనినాడులు చైతన్యవంతమై రక్తప్రసరణ మెరుగుపడి కేశాలసంరక్షణ జరుగుతుంది.కొబ్బరినూనెలో ఎండిన ఉసిరికాయ ముక్కలు వేసి వేడిచేసి తలవెంట్రుకలకు పట్టించాలి. బచ్చలి ఆకురసం సేవించడం లేదా ఆకుని ఆహారంగా వాడటం వలన కురులు అందంగా, ఒత్తుగా పెరుగుతాయి. క్యారట్‌జ్యూస్‌ కూడా కేశాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.కొబ్బరినూనెలో నిమ్మరసం పిండి వెంట్రుకలకు పట్టించి ఒక గంట తరువాత తలస్నానం చేస్తే వెంట్రుకలు తెల్లబడటం, రాలిపోవటం ఆగుతాయి. కొత్తిమీర ఆకులను రసం తీసి తల వెంట్రుకలకు పట్టించాలి.

ఆవనూనెలో గోరింటాకులను వేసి వేడిచేసి చల్లారిన తరువాత తలవెంట్రుకలకు పట్టించడం, కుదుళ్లకు బలాన్నిస్తుంది.  కొబ్బరిపాలను తలపై పోస్తూ బాగా మర్దించినట్లైతే వెంట్రుకల కుదుళ్లు బలంగా తయారై ఊడటం ఆగుతుంది.  మినపప్పు ఉడికించి పేస్ట్‌లా చేసి, కొంచెం మెంతిపొడిని కలిపి వెంట్రుకలకు పట్టిస్తే విశేష లాభం ఉంటుంది.  చాలామంది కోడిగుడ్డుని వెంట్రుకలకు అప్లయి చేస్తుంటారు. కానీ దీనివలన జుట్టుకు అనుకున్నంత ప్రయోజనం చేకూరకపోగా దుష్ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంది. వెంట్రుకలు చిట్లిపోవటం, బిరుసుగా అవటం, కాంతిహీనంగా మారటం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇది ప్రకృతి విరుద్ధంగా భావించాలి. ఇది భారతీయ వైద్య విజ్ఞానానికి విరుద్ధం. రేగడి మట్టిలో ఉసిరిక, నిమ్మ కాయ, కొత్తిమీర రసం వీటిలో దేనినైనా కలిపి పేస్ట్‌లా చేసి తలవెంట్రుకలకు అప్లయి చేసి ఆరిన తరువాత స్నానం చేయాలి.   ఈ పద్ధతులను ఆరునెలలపాటు ఆచరించినట్లైతే విశేషలాభాలు పొందవచ్చని నిపుణుల అభిప్రాయం.

ఆసనాలు
పైన చెప్పిన కురుల సమస్యలకు విరుగుడుగా ఈ ఆసనాలు పనిచేస్తాయి.8నుంచి 30 సంవత్సరాల లోపు వయసుండి ఆరోగ్యవంతులైనవారికి శీర్షాసనం, సర్వాంగ పద్మాసనం, విపరితకరణి, వృచ్ఛికాసనం, వృక్షాసనం, చక్రాసనం, టిట్టిభాసనం వేయవచ్చు. ఆపై వయసుండి ఆరోగ్యంగా ఉన్నవారు (అనగా బిపి, అధిక బరువు, హృదయ సంబంధవ్యాధులు లేనివారు) అర్థ శీర్షాసనం, సర్వాంగాసనం, పాదహస్తాసనం, హలాసనం, అర్థటిట్టిభాసనం (వీటి సాధన గురించి వచ్చే వారాల్లో విశదంగా తెలుసుకుంటారు) యోగనిద్రాసనం వేయవచ్చు.శరీరం బిరుసుగా ఉండి, ఏమైనా రుగ్మతలున్నవారు సూర్యనమస్కారాలు, యోగిక్‌ వ్యాయామం, ప్రాణాయామం వీటితోపాటు పైన తెలిపిన సూచనలు పాటించాలి.  ప్రాణాయామాలు నాడీశోధన, బస్త్రిక, కపాల బాతి, అంతః కుంభకం, ఆచరించవచ్చు.

సమ్మర్ టిప్స్

పుచ్చకాయ తొక్క తీసి శుభ్రం చేసి జ్యూస్ చేసి ఫ్రిజ్‌లో పెట్టుకుని తాగవచ్చు. లేదా కావలసినప్పుడు తాజాగా తయారుచేసుకోవచ్చు. దీని వల్ల దాహశాంతీ, చల్లదనమూ.

బూడిద గుమ్మడికాయ తొక్క, విత్తనాలు తీసేసి, మిక్సీలో జ్యూస్ చేసుకుని, దానికి ఉప్పు, మజ్జిగ, ఇంగువ చేర్చి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. రోజూ 100 మి.లీ.ల చొప్పున తాగుతుంటే, వేసవిలో వచ్చే మూలశూల తగ్గుతుంది.

వేసవిలో చెమట వల్ల చర్మరంధ్రాలలో మురికి చేరి మూసుకుపోతుంటాయి. తరచూ చల్లని నీటితో ముఖం కడుక్కుంటుంటే, ఈ రంధ్రాల్లోని మురికి పోయి శుభ్రపడటంతో పాటు, చర్మమూ శుభ్రపడుతుంది. శరీరం వేడిమీ తగ్గుతుంది.

ఖీరాలను మిక్సీలో రుబ్బి, ఆ ముద్దను సబ్బులా ముఖానికి వలయాకారంగా వేళ్లను తిప్పుతూ పూసుకుని ఆరిపోయాక కడిగేయాలి. ముఖకాంతి పెరుగుతుంది.

10 గ్రాముల జీలకర్ర, 6 తాటి కలకండ ముక్కలు, 3 గ్లాసుల నీటిలో వేసి, మరిగించి, చల్లారనీయాలి. వేసవిలో, బహిష్టు సమయంలో ఈ నీటిని తాగుతుంటే, స్త్రీలకు ఒళ్లు పట్టడం వుండదు.