మన టాలివుడ్లో Rare photos

photo1: jr ntr school photo

photo2: ntr with his sons

photo3: chirus family

photo4: raviteja rare photo

photo5: ram charan tej and daggubati rana

photo6: super star rajanikanth

photo7: balayya family

photo8:hero mohan babu

photo9: Venkatesh and Nagarjuna

photo10: venatesh children

photo11: venatesh wife

ట్విట్టర్ లో టాలీవుడ్ హీరోస్..! మీరు చూసారా!

ప్రపంచవ్యాప్తంగా దూసుకువెళ్తున్న ట్విట్టర్ లో మన తెలుగు స్టార్స్ కూడా జాయిన్ అయి సందేశాలు పంపుతున్నారు. తాజాగా నాగార్జున (ఐ యామ్ నాగార్జున), మహేష్ బాబు (యువర్స్ ట్రూలీ మహేష్),సిద్దార్ధ(ఏక్టర్ సిద్దార్ధ) ఈ ట్విట్టర్ ని ఉపయోగించుకుంటూ మెసేజ్ లు పాస్ చేస్తున్నారు. కాబట్టి స్ట్రైయిట్ గా వారినుంచే ఇక మనకి వారి న్యూస్ లు తెలుస్తాయి. మహేష్ బాబు రీసెంట్ గా తన లేటెస్ట్ చిత్రం ఆగస్టు 2010లో రిలీజ్ కానుందని ట్వీట్ చేసారు.

ఇక త్రివిక్రమ్,మహేష్ ల కాంబినేషలో రెడీ అవుతున్న కలేజా(వర్కింగ్ టైటిల్) చిత్రంలో అనూష్క హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రం తర్వాత శ్రీనువైట్ల కాంబినేషన్లో సినిమా ప్రారంభం కానుంది.అలాగే నాగార్జున హీరోగా దర్శకుడు రాధామోహన్ డైరక్షన్ లో గగనం చిత్రం రూపొందుతోంది. దిల్ రాజు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. సిద్దార్ధ..బావ అనే చిత్రంలో హీరోగా చేస్తున్నారు.

నాలుగు క్లైమాక్స్ లతో మణిరత్నం ‘రావణ్’

మణిరత్నం తాజా చిత్రం రావణ్ లో నాలుగు క్లైమాక్స్ లు తీసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే హిందీ, తమిళ భాషలను దృష్టిలో పెట్టుకుని ఏ క్లైమాక్స్ ని ఇస్తారనేది ఇంకా నిర్ణయించుకోలేదంటున్నారు. అలాగే హిందీకో ఎండింగ్, తమిళ్ కో ఎండింగ్ ఉండే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇక మొదట క్లైమాక్స్ ప్రకారం రావణ్(అభిషేక్ బచ్చన్)..సీత(ఐశ్వర్య)నుగెలుచుకోవటంతో ముగుస్తుంది. ఇక సెకెండ్ ఎండింగ్ ప్రకారం సీత.. రాముడు(విక్రమ్) ని కోరుకుంటే..రావణుడు ఓకే చేస్తాడు. ఇక మూడో ఎండింగ్ లో రాముడు, రావణుడు ఇద్దరూ చనిపోతే సీత తిరిగి తన పాత వైభవాన్ని పొంది పాలకురాలు అవుతుంది. ఇవి బాలీవుడ్ లో వినపడుతున్న క్లైమాక్స్ రీతులు. మణిరత్నం రామాయణాన్ని అనుసరించకుండా ఈ కథను ఊహించని ట్విస్ట్ లతో అందించనున్నారని తెలుస్తోంది. అందుకే ఎవరూ ఊహించని రీతిలో క్లైమాక్స్ ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు. స్త్రీ మొగవాడి కబంధ హస్తాలనుంచి వచ్చి తనకు తానుగా నిలబడే విధంగా కథను రూపొందించాడని చెప్తున్నారు. ఇక రావణుడు పాత్రను హైలెట్ గా చేసాడని కూడా తెలుస్తోంది.

వరుడు

జోశ్యుల సూర్య ప్రకాష్
సినిమా: వరుడు
బ్యానర్: యూనివర్సిల్ మీడియా
నటీనటులు: అల్లు అర్జున్ , భానుశ్రీ మెహ్రా, ఆర్య, ఆశిష్ విధ్యార్ధి, సుహాసిని,
నరేష్, నాసర్, రావు రమేష్, శాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్,
బ్రహ్మానందం, సింగీతం శ్రీనివాస్, అనితా చౌదరి తదితరులు.
సంగీతం: మణిశర్మ
కెమెరా: ఆర్.డి.రాజశేఖర్
మాటలు: తోట ప్రసాద్
ఎడిటింగ్: ఆంధోని
ఫైట్స్: స్టన్ శివ
కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: గుణశేఖర్
నిర్మాత: డివివి దానయ్య
రిలీజ్ డేట్: 31-03-2010

హీరోయిన్ ని విలన్ ఎత్తుకుపోవటం, దాంతో హీరో రెచ్చిపోయి…విలన్ ని తుక్కు చేసి ఆమెను రక్షింపచేయటం లాంటి ఒక్కడు నాటి కాన్సెప్ట్ తోనే వరుడు వచ్చాడు. అయితే ఈ సారి ఐదు రోజుల పెళ్ళి, పదహారు రోజులు పండుగ అని కొద్దిగా బిల్డప్ ఇచ్చి కొత్త కథ అని నమ్మించబోయి తానే బోల్తా పడ్డాడు.అలాగే కథ,కథనంలు లోపంగా వచ్చిన ఈ వరుడులో హీరోయిన్ ని మిస్టీరియస్ గా ఉంచి ఆసక్తి రేపాలని ప్రయత్నం చేసారు. అయితే ఆమె కూడా ఊహించనంత గొప్పగా లేకపోవటంతో అదీ తుస్సుమంది. అయితే అల్లు అర్జన్, ఆర్య నటనలు మాత్రం ఈ సినిమాలో పోటీపోటీగా కనిపించటం విశేషం. ఇక ఐదు రోజుల పెళ్ళి అనే పాయింటు తో వచ్చిన ఈ చిత్రం ఐదు రోజులైనా సక్సెస్ ఫుల్ గా నడుస్తుందా అంటే సందేహమే.

మంచి కుటుంబలో పుట్టి పెరిగిన సందీప్ (అల్లు అర్జున్) పైకి ఆధునికంగా కనిపించినా సంస్కృతి సంప్రదాయాలకు విలువనిస్తూంటాడు.రేపో మాపో అమెరికా వెళ్ళిపోదామనుకుంటున్న అతనికి పెళ్ళి చేద్దామని అతని తల్లి(సుహాసిని), తండ్రి(ఆశిష్ విధ్యార్ధి) నిర్ణయించుకుని ఏమన్నా ప్రేమ వ్యవహారం ఉందా అని అడుగుతాడు. కానీ బుద్ది మంతుడైన సందీప్ అలాంటిదేమీ లేదని ఎరేంజ్ మ్యారేజ్ చెయ్యమంటాడు. అయితే ఐదు రోజులు పాటు పెళ్ళి గ్రాండ్ గా చేయాలని, పెళ్ళి కూతురుని పీటల మీదే చూస్తానని కండీషన్ పెడతాడు. సరేనన్న అతని తల్లి తండ్రులు ఓ అమ్మాయి(భానుశ్రీ మెహ్రా) తో వివాహం నిర్ణయిస్తారు. పెళ్ళి పీటల మీద తొలిసారిగా చూసిన వరుడు సందీప్ ఆమెతో ప్రేమలో పడిపోతాడు. అయితే ఆ సంతోషం ఎంతో సేపు నిలబడదు. ఆ పెళ్ళి మండపం కూలగొట్టి దివాకర్‌ (ఆర్య). అనే విలన్ ఎంట్రీ ఇచ్చి వధువుని ఎత్తుకుపోతాడు. ఆ తర్వాత వరుడు ఆమెను ఎలా తిరిగి వెనక్కి తెచ్చుకుని పెళ్ళి చేసుకున్నాడనేది మిగతా కథ.

మంచి వివాహమే మంచి దాంపత్యం. మంచి దాంపత్యమే మంచి సంతానం. మంచి సంతానమే మంచి సమాజం. మంచి సమాజమే మంచి ప్రపంచం అంటూ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ప్రారంభమవుతుంది ఈ చిత్రం. దాంతో ఏదో గొప్ప మెసేజ్ ఉన్న చిత్రం చూస్తున్నాం అని ఫిక్స్ అవుతాం. అయితే ఆ డైలాగులు ఆచరణలోకి రాకుండా కేవలం మాటలు క్రిందే సినిమాలో ఉండిపోతాయి. ఇక కథ, కథనమే ఈ చిత్రానికి మైనస్ గా నిలిచాయి. హీరోయిన్ ని ఎత్తుకుని విలన్ వెళ్ళిపోతే…హీరో ఎదురు ఎత్తులు వేసి విలన్ ని ఇరికించి ఆమెను రక్షించుకోవటం చేయడు. విలన్ చేష్టలకు ప్రతిగా పెద్ద పెద్ద డైలాగులు చెపుతూ పారిపోతూంటాడు. దాంతో హీరో పాత్ర ప్యాసివ్ గా మారి పూర్తి స్ధాయి బోర్ గా మారింది. అలాగే ఎంతో బిల్డప్ గా చెప్పిన ఐదు రోజుల పెళ్ళి వ్యవహారం కేవలం నామ మాత్రంగా స్క్రీన్ టైమ్ ని తినటానికే తప్ప కథకు ఏ మాత్రం ఉపయోగపడదు. ఆ ఎలిమెంట్ లేకపోయినా కథ నడుస్తుంది. ఇక డైలాగులు అయితే టెక్స్ట్ బుక్ లోవి తెరమీదకు వచ్చినట్లుగా ఉంటాయి.ఇక హీరోయిన్ భాను మెహ్రా అంత రహస్యంగా ఉంచి ప్రెజెంట్ చేయాల్సినంతగా కనిపించదు. అంతేగాక ఆమె నటనకు కొత్తని స్పష్టంగా తెలిసిపోతూంటుంది. ఇక అక్కడక్కడా నవ్వించబోయి బ్రహ్మానందం నవ్వులు పాలవటం బాధ అనిపిస్తుంది. వీళ్ళలో తమిళ హీరో ఆర్య నటనే హైలెట్ అవుతూంటుంది. ఆహుతి ప్రసాద్, సుహాసిని, సింగితం శ్రీనివాసరావు వంటి వారు కూడా పెద్దగా కథకు ఉపయోగపడరు. వీటికి తోడు యాభై నిజమైన కుటుంబాలను ఎందుకు పెట్టారో అర్దం కాదు. జూనియర్ ఆర్టిస్టులైనా ఆ సీన్స్ కు సరిపోతారు. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ లో సిలైన్ ని హీరోయిన్ కి పెట్టి హీరో పరుగెత్తే సీన్ అస్సలు ఎక్కదు. అయినా పెళ్ళి మండపం సెట్ చూస్తుంటే కేరళలలో ఇళ్ళు గుర్తుకు రావటం ఎలా తెలుగు నేటివిటి అనిపించుకుంటుంది. టెక్నికల్ గా ఎడిటింగ్ సోసో గా ఉంది. కెమెరా కొన్ని సన్నివేశాల్లో బాగుంది అనిపించినా చాలా చోట్ల టీవీ సీరియల్ వాతావరణం క్రియేట్ చేసింది. మణిశర్మ సంగీతం ఇంప్రెసివ్ గా లేదు. రెండు పాటలు వినసొంపుగా ఉన్నాయి.

ఏదైమైనా పెళ్ళి సంప్రదాయాలు చూపే సినిమా అంటేరాజశ్రీ వారి హమ్ ఆప్ హై కౌన్ గుర్తుకు వస్తుంది. నిజాయితీగా తమ సంప్రదాయాలను వాళ్ళు ప్రజెంట్ చేసారు. అదే వరుడుకి కొరవడింది. సంప్రదాయాలు పేరు చెప్పి ఓ యాక్షన్ చిత్రం చూపించే ప్రయత్నం చేసారు. ఇక ఈ చిత్రాన్ని చూద్దామని ఇప్పటికే టిక్కట్లు బుక్ చేసుకున్న వారికి ఎలాగో తప్పదు. ఆలా కానివాళ్ళు కేవలం అల్లు అర్జున్ కొత్త చిత్రమని బయిలుదేరాలే…తప్ప ఏ విధమైన ఏగ్జయిటీ కానీ, ఎంటర్టైన్మెంట్ గానీ ఆశించి వెళ్ళటం అనవసరం.

లీడర్

తారాగణం :   దగ్గుబాటి రాణా, ప్రియాఆనంద్ , రిచా గంగోపాధ్యాయ,సుహాసిని, సుమన్,        కోట శ్రీనివాసరావు ,హర్షవర్ధన్, ఆహుతిప్రసాద్, సుబ్బరాజు,  తనికెళ్ళ భరణి  తదితరులు.

కధ , మాటలు :  శేఖర్ కమ్ముల

ఎడిటింగ్ :   మార్తాండ్ కె వెంకటేష్

సంగీతం : మిక్కీ జే మేయర్

నిర్మాతలు : శరవణన్ , గుహన్

దర్శకత్వం : శేఖర్ కమ్ముల

భారీ అంచనాల మద్య వాయిదా పడుతూ వస్తున్న లీడర్ ఎట్టకేలకు ఫిబ్రవరి 19 న విడుదల అయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో , ప్రతిష్టాత్మక ఎవిఎం బానర్ పై దగ్గుబాటి రాణా హీరోగా నిర్మితమైన ఈ సినిమా పై చాలా అంచనాలు ఉన్నాయి. మరి ప్రేక్షకుల అంచనాలు లీడర్ అందుకున్నాడా లేదా అనేది చూద్దాం.

కధ కమామిషు : ఇది పూర్తిగా రాజకీయాల నేపధ్యంలో తీసిన చిత్రం . ఒక చీఫ్ మినిస్టర్  వాహనం కింద మందుపాతర  పేలడంతో సినిమా మొదలవుతుంది.  అందులో  ప్రయాణిస్తున్న ముఖ్యమంత్రి సంజీవయ్య (సుమన్) మరణిస్తాడు. ముఖ్యమంత్రి కుమారుడు అర్జున్ ( రాణా) ఇతను ఆధునిక భావాలు ఉన్న  యువకుడు. ముఖ్య మంత్రి కొడుకైనప్పటికీ  పేదవారి మద్య మురికివాడల్లో తిరుగుతూ సమాజాన్ని పూర్తిగా అర్ధం చేసుకునే పనిలో ఉంటాడు . ప్రస్తుత రాజకీయ  వ్యవస్థ ని మార్చడం ఇతని ఉద్దేశం. ముఖ్యమంత్రి మరణించడంతో  అతని కొడుకైన అర్జున్ ని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటారు అయితే ఇదే సమయంలో  సమయంలో అతని ప్రత్యర్ధులు అర్జున్ కజిన్  ధనుంజయ్ ( సుబ్బరాజు)  అతని పెదనాన్న ( కోట శ్రీనివాసరావు) అడ్డు తగులుతుంటారు  . ముఖ్యమంత్రి అవడానికి అర్జున్   ఎమ్యేల్యేలకులకు డబ్బులు పంచి సిఎం   అవడం ,  తన పదవి కాపాడు కోవడం కోసం ఎక్కువ మంది ఏంఎల్ఏ ల సపోర్ట్ వున్నా వొక వర్గ నాయకుడి కూతుర్ని ప్రేమ లో పడేసి (ఇది మోసమే గా) తన పదవి నిలబెట్టుకుంటాడు . ధనుంజయ్ కూడా డబ్బులు పంచి సిఎం అవ్వాలనుకోవడం లాంటి ప్రయత్నాలు జరుగుతాయి.  సరిగ్గా అప్పుడే అవినీతి సొమ్ముని ఎసిబి దాడుల ద్వారా బయటకి తీసి లక్ష కోట్లు పోగేసి జనానికి ఏదన్నా చేయాలి అనుకునే లోపు రాజకీయ సంక్షోభం వస్తుంది. తర్వాత జరిగే ఎన్నికలలో అర్జున్ గెలిచాడా ? అర్జున్ ని అంతమొందించాలి అనుకున్న  ధనుంజయ్ ప్రయత్నాలు ఫలించాయా?  అన్నది తెర మీద చూడాలి . మొత్తానికి  దేశం లో బ్లాక్ మనీ చాలా  ములుగు తోంది దాన్ని బయటకు తీసి ప్రజలకి ఖర్చు పెడితే దేశం బాగు పడుతుందన్నది స్టొరీ లైన్ .

నటీనటుల పని తీరు : రాణా మొదటి చిత్రం తోనే భేష్ అనిపించుకోవడం ఖాయం . నిండైన విగ్రహంతో బాటు , చక్కని వాచకం కూడా ఉన్న ఇతను సినీ జగత్తులో ఒక వెలుగు వెలుగుతాడు అనడంలో సందేహం లేదు. కొత్త వాడన్న బెరుకు ఎక్కడా కనపడనీయకుండా డైలాగులు  చక్కగా స్ప్రష్టంగా చెప్పాడు . సినిమాలో డాన్స్ కి అవకాశం లేనందున ఇతని డాన్స్ చూసే అవకాశం లేకుండా పోయింది.

హీరోయిన్ లు ఈ సినిమా కి పెద్ద మైనస్  ప్రియా ఆనంద్ గురించి యెంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రిచా పర్వాలేదనిపించింది.

కోటా పాత్ర చాలా సీరియస్ గా ఉంటుంది . ఈయన్ని శేఖర్ కమ్ముల సరిగా వాడుకోలేదనిపించింది. సుబ్బరాజు తన పరిధిలో బాగా చేశాడు. హర్షవర్ధన్ కూడా ఓకే అనిపించాడు .రావు రమేష్ చేసింది చిన్న పాత్ర అయినా బాగా చేశాడు. ఒక పాటలో నర్తించిన ఉదయభాను బట్టలు బాగా తక్కువ వేసుకుంటే తను ఎలా ఉంటుందో చూపించింది.

ప్రేమ సందేశాలిచ్చే శేఖర్ కమ్ముల  ఈ సినిమాలో రాజకీయ  సందేశాలెక్కువ ఇచ్చి  సరుకు తక్కువ చేశాడు . మొదటి సగం బాగా ఎక్కడా బోర్ కొట్ట కుండా తీస్తే రెండో సగం నిడివి ఎక్కువయ్యింది.. కధంతా పదవిని నిలబెట్టు కోడానికి వేసే ఎత్తులు మీద తిరుగుతుంది.  కారంచేడు  దహన సంఘటన , ఎవరి సత్తా బట్టి వాళ్ళకి వృత్తులు నిర్ణయించడం జరిగిందని , అందులో పుట్టిన వాడు వేరే వృత్తులు పదవులు చేస్తా అంటే కుదరదని పెద్దాయన (కోట) చేత చెప్పించడం వివాదం అవడానికి ఆస్కారం ఉంది. .కామెడి ఎక్కడా లేదు కనీసం చిరు మంద హాసానికి కుడా అవకాశం లేదు  .స్పీకర్ స్థానం లో వ్యక్తి కూర్చోండి ప్లీజ్ ……….సిడవును ప్లీజ్  అనప్పుడు మాత్రం కొద్ది మంది నవ్వారు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ని గుర్తు తెచ్చు కుని .

మొత్తానికి సినిమా కాలక్షేపానికి చూడాల్సిందే ……….వేరే సినిమాలు లేవుగాబట్టి .

ఏం మాయ చేశావే

తారాగణం : అక్కినేని నాగచైతన్య, సమంతా , కృష్ణుడు, పూర్ జగన్నాద్ , కృష్ణుడు , సురేఖా వాణి,  సంజయ్ స్వరూప్సంగీతం ; ఏ.ఆర్. రెహమాన్

నిర్మాతలు : మంజుల , సంజయ్ స్వరూప్

దర్శకత్వం : గౌతం మీనన్

కధ కమామిషు : కార్తీక్ ( నాగ చైతన్య )  ఇంజనీరింగ్ విద్యార్ధి . సినిమా  డైరక్టర్ అవడం అతని కోరిక . కానీ  అతని తండ్రి ఒప్పుకోడు . ఇంజినీరింగ్ పూర్తి చేసిన కార్తీక్ తన స్నేహితుని ( కృష్ణుడు) సాయంతో ఒక డైరక్టర్ ( పూరీ జగన్నాద్ )  వద్ద అసిస్టెంట్ డైరక్టర్ గా చేరుతాడు.  సరిగ్గా ఇదే సమయానికి అతని జీవితంలోకి జెస్సీ ( సమంతా) అనే క్రిష్టియన్ అమ్మాయి ప్రవేశిస్తుంది. తొలి చూపులోనే అమ్మాయి ప్రేమలో పడతాడు కార్తీక్ .   కార్తీక్ హిందూ అయినా క్రిష్టియన్ అయిన జెస్సీ ని గాడంగా ప్రేమిస్తాడు . అదీ కాక కార్తీక్ వయసు 22 ,జెస్సీ వయసు 24.  ఇదే కధలో అసలైన పాయింట్.  తమ మద్య ఉన్న వయసు భేదాన్ని పట్టించుకోకుండా ఆమె వెంట పడుతూ ఉంటాడు . కొన్నాళ్ళకి జెస్సీ అతనికి ఓకే చెబుతుంది . ఆమె చేత ఒఒప్పించుకోవడాని కార్తీక్ చేసిన కొన్ని పనుల వల్ల అతనికి కొన్ని చిక్కులు వస్తాయి  అవి కార్తీక్ ఎలా పరిష్కరించుకున్నాడు , డైరక్టర్ అవ్వాలనే తన లక్ష్యం నెరవేరిందా అనేది తెర మీద చూడాలి.

నటీనటుల పనితీరు : నాగ చైతన్య మొదటి సినిమా కన్నా ఈ సినిమాలో నటనలో పరిణితి కనబరిచాడు , హావభావాల విషయంలో మరి కాస్త మెరుగుపడాల్సి ఉంది . డైలాగ్ డెలివరీ పర్వాలేదు,. సమంతా చక్కగా చేసింది . నటన , ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ చాలా బాగున్నాయి . హీరోయిన్ గా నిలదొక్కుకునే చాన్స్ లు ఉనాయి. పూరీ జగన్నాద్ సహజంగా నటించేసాడు. మిగతా పాత్రలన్నీ తమ తమ పరిధిలో చేశారు.

ఈ సినిమా యువతకి అందులోనూ ప్రేమలో మునిగి తేలే వారికి  చక్కగా నచ్చుతుంది . ప్రేమ , కెరీర్  ఈ రెండిటి మద్య నడిచే  కధ కనుక  కాలేజీ యువత కి బాగా నచ్చే అవకాశం కూడా ఉంది. “4 ఫైట్లు, ఆరు పాటలు రెండు కామెడీ సీన్లతో సినిమా ఎన్నాళ్ళు చూస్తారు అందుకే మా సినిమాలో అవేమీ ఉండవు డిఫరెంట్ గా తీసాం” అని   నిర్మాత మంజుల ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమాలో ఎక్స్‌పొసింగ్ లు లేవు , భారీ ఫైట్లు లేవు . మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోఇవడం కష్టం . కాలేజీ యువత మీదే సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది.

రెహమాన్ అందించిన అద్బుత సంగీతానికి తగినట్టు  సినిమా  మొదటి భాగం లో పాటలకి గౌతమ్ మీనన్ న్యాయం చేయలేదు అనిపిస్తుంది. రెండవ భాగం లో పాటలు బాగున్నాయి . మొత్తానికి సినిమాని కళ్ళతో కాకుండా మనసుతో చూడాలి.

ఆకాశరామన్న

నటీనటులు: రాజీవ్ కనకాల, అల్లరి నరేష్, శివాజీ, మీరా జాస్మిన్, గౌరీ పండిట్, నాగబాబు, రఘు బాబు, సన, శ్రీనివాసరెడ్డి, రాజేష్, రావురమేష్ తదితరులు, కెమేరా: శ్రీరామ్, కథానువాదం, కథ: అశోక్, నిర్మాణం: మన్యం ఎంటర్ టైన్మెంట్, బ్యాక్ గ్రౌండ్, సంగీతం: చక్రి, నిర్మాత: మన్యం రమేష్.

పాయింట్: ఈ జన్మలో తప్పు చేస్తే వచ్చే జన్మలో శిక్ష పడుతుందనేది పాతమాట. ఈ జన్మలోనే తప్పుకు తగిన శిక్ష విధిస్తాడు విధి అనే కర్మ సిద్ధాంతమే ఆకాశరామన్న కథ.

పనీపాట లేకుండా తేజ( రాజీవ్ కనకాల) పబ్‌లో తాగుతూ చిందులేస్తుంటాడు. అక్కడ పబ్‌లో ఓ స్వామీజీ( రఘు బాబు) తన శిష్యులతో వచ్చి చిందులేస్తుంటాడు. తనకొచ్చిన అనుమానాల స్వామీజీతో చెప్పి తేజ నివృత్తి చేసుకుంటాడు. తప్పు చేస్తే తగిన శిక్ష దేవుడు విధిస్తాడని చెపుతాడు స్వామీజీ.

కానీ తాము అందుకు అతీతులమని స్వామీజి చెప్పిన మరుక్షణంలో కారు యాక్సిడెంట్లో చనిపోతాడు. దాంతో కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని చివరి మాట చెపుతాడు స్వామీజీ. కథాగమనం ఎలా సాగుతుందో ప్రారంభ సన్నివేశంలో తెలిసిపోతుంది. అంటే ఇంకా ఇటువంటి తప్పులు చేసేవారు కొందరున్నారు. వారు ఎన్ని తప్పులు చేశారు. వాటికి తగిన శిక్ష ఎలా పడింది అనేది సినిమా. కాకపోతే ఈ పాయింట్ చెప్పడానికి దర్శకుడు ఎన్నుకున్న కొత్త మార్గం రివర్స్ స్క్రీన్ ప్లే.

ముందు సన్నివేశం చూపాక మళ్లీ అది ఎక్కడ ప్రారంభయిందో తెలియాలంటే… స్టోరీలోకి కాస్త వెనక్కి వెళ్లాలి. అలా అన్ని పాత్రలు వెళ్లి వెళ్లీ చివరికి ఒక పాత్రతో ఒకదానికి ఎలా లింకులున్నాయన్నదే ఈ చిత్రంలో ఆసక్తికరంగా సాగుతుంది.

రాజీవ్ కనకాల తాగుబోతు పాత్రలో బాగా సూటయ్యాడు. డైలాగ్ మాడ్యులేషన్ యాక్సిడెంట్ తర్వాత అతను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ బాగా పండించాడు. కామెడీలో అన్ని పాత్రలు బాగానే రక్తి కట్టించారు. అల్లరి నరేష్ చిలిపి పాత్రలు వేయడంలో దిట్టనే చెప్పాలి. తన ప్రేయసి మీరా జాస్మిన్ దగ్గరకు డబ్బుకోసం ఆమె పని చేస్తున్న షాపింగ్ మాల్‌కు వస్తాడు. అక్కడ ఆమెతో జరిగే సంభాషణ, తర్వాత క్యాష్ కౌంటర్లో డబ్బులు తస్కరించి పిస్టల్‌తో చేతిపై కాల్చి తను తప్పించుకోవాలని ప్లాన్ చేస్తాడు.

కానీ దొంగతనం ఎవరు చేసిందనేది పోలీసులకు పూసగుచ్చినట్లు తెలిసిపోతుంది. ఇది ఎలా తెలిసింది అనేది తెలియాలంటే… మళ్లీ రీల్ వెనక్కి తిప్పితే… గౌరీ పండిట్ ఈనాటి కల్చర్‌కు అలవాటు పడ్డ అమ్మాయి. ఆమె తన జల్సాలకోసం అటు నరేష్‌ను, మరోవైపు షాపింగ్ మాల్ ఓనర్ శివాజీని ట్రాప్ చేసి వారిద్దరినీ తను గర్భిణీ అని నమ్మించి చెరో ఐదు లక్షలు నొక్కేస్తుంది.

దానికోసం ఆమె వచ్చేటపుడు నరేష్ మీరాను బెదిరించడం చూస్తుంది. మరోవైపు శివాజీ ఆమెకు ఐదు లక్షలివ్వాలనే క్రమంలో ఆమెతో గడిపే తరుణంలో చిన్నపాటి యాక్సిడెంట్‌కు గురవడం… వీటిని పోలీసు అధికారి రావు రమేష్ పెట్రోల్ చేస్తూ అందరినీ పట్టుకుని శిక్షించాలనుకోవడం జరుగుతుంది. కానీ కర్మ సిద్ధాంతం ప్రకారం శిక్షలన్నీ ఆకాశ రామన్న వేసేస్తుంటాడు. అంటే విధి అన్నమాట.

ఇలా చిత్రగమనం కాస్త గందరగోళంగా ఉంటుంది. సామాన్యుడిగి కన్‌ఫ్యూజ్‌గానే ఉంటుంది. మల్లీప్లెక్స్ సినిమాల కోవలో ఇది చేరుతుంది. ఈ సినిమా చూడాలంటే కాస్త రిలాక్స్ చేసుకుని వెళ్లాలి. లేదంటే చిత్రం ఓ పట్టాన అర్థం కాదు. సస్పెన్స్ థ్రిల్లర్‌లా సాగే ఆ చిత్రం టైమ్‌పాస్ చిత్రం. ఇది ఏ మేరకు జనాలకు ఎక్కుతుందో అనుమానమే. కానీ హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో సినిమా తీశారని మాత్రం చెప్పగలం.