వీటికి సమాధానము ఇవ్వగలరా?

పచ్చని గుడిలో ఎర్రని రత్నాలు?

పుట్టినా కదలనిది ఏది?

బొట్టు కాని బొట్టు ఏమి బొట్టు?

భయం కాని భయం?

మల్లపు గుర్రానికి ఒళ్ళంతా రంధ్రాలు?

మాతాత ఏటి అవతలికి వెళ్ళి మూడెడ్లను తెచ్చాడు. ఒకటి కరిగేది, ఒకటి తేలేది, ఒకటి మునిగేది?

మనతో వస్తుంది, మనకు చెప్పకుండానే వెళ్తుంది?

బిళ్ళ కాని బిళ్ళ, లోకం కోరే బిళ్ళ?

బారుగాని బారు! ఏమి బారు?

బడి గాని బడి! ఏమిబడి?

బంగారు చెంబులో, వెండి గచ్చకాయ?

జవాబులు రేపటి టపాలో వ్రాస్తాను.

ఇక్కడ చెప్పులు వున్నాయి అవి కనిపెట్టి మూడు నిమిషాలలో చెప్పగలరా?

ఇక్కడ చెప్పులు వున్నాయి అవి కనిపెట్టండి.
ఆ తలుపు దగ్గర జాగ్రత్తగా గమనించండి.