ఇంక అస్సలు తగ్గవంటార?

ఇలా అయితే ఇంక ఎలాగండి నాలాగ నగలు కొనుక్కోవాలనుకునే వాళ్ళ సరదా ఎప్పుడు తీరుతుంది. అసలు ధరలు దిగి రావని ఇంక పెరిగిపోతాయని మా ఆఫీసులో పొద్దునించి మీటింగ్ లే మీటింగ్లు. సారంశం   వింటుంటే బాధగా వుందండి. ఇంక అస్సలు తగ్గవంటార?
అంటే నేను ఏదో చాల కోనేద్దామని కాదు కాని ఏదో ఆశ తగ్గుతాయని ఏమంటారు? ఈ వార్తలు చదువుతుంటే నే బాధ వచేస్తోంది.

టీవీలు చూడటంలో మహిళలే నెంబర్ 1

పురుషులకన్నా మహిళలు టీవీలు చూడటంలో ప్రథమ స్థానంలో నిలిచారని స్టేట్ ఆఫ్ ది మీడియా డెమోక్రసీ సంస్థ న్యూ ఢిల్లీలో వెల్లడించింది. తాము జరిపిన సర్వేలో 92 శాతం మహిళలు టీవీలు చూసేందుకు ఎక్కువ సమయం గడుపుతుంటారని తేలినట్లు ఆ సంస్థ తెలిపింది.ఎక్కువ సమయాన్ని ఎలా గడుపుతారని తాము దేశవ్యాప్తంగా రెండు వేలమంది పురుషులు, మహిళలపై సర్వే జరిపామని సంస్థ తెలిపింది. ఇందులో పాల్గొన్న 93 శాతం మంది మహిళామణులు టీవీలతో కాలక్షేపం జరుగుతుందని, అదే పురుషుల్లో 90 శాతం మాత్రమే టీవీలను చూసేందుకు ఇష్టపడతామని తెలిపినట్లు ఆ సంస్థ పేర్కొంది. టీవీల్లో పలు ధారావాహిక కార్యక్రమాలతోపాటు మహిళలకు సంబంధించిన పలు ప్రోగ్రాంలు వస్తుంటాయని, దీంతో తమకు టీవీయే మనోరంజకమైన సాధనమని మహిళలు పేర్కొన్నట్లు సర్వే నిర్వాహకులు తెలిపారు.తాము బెంగుళూరు, లక్నో, లుధియానా, సూరత్, ఇండోర్‌లాంటి నగరాల్లో సర్వే జరిపినట్లు సంస్థ యాజమాన్యం తెలిపింది. ఇతర ప్రసారసాధనాలకన్నా టీవీనే ఎక్కువగా ఆకర్షిస్తుంటుందని తమ సర్వేలో వెల్లడైందని, టీవీ ద్వారా అన్ని రకాల విషయాలను తెలుసుకోగలుగుతామని సర్వేలో పాల్గొన్న మహిళలు తెలిపినట్లు సంస్థ తెలిపింది.టీవీల ద్వారా దృశ్య, శ్రవణాలను ఒకేసారి వీక్షించి వినే అవకాశం కలుగుతుంది. ఇటీవలి కాలంలో దేశీయ మార్కెట్‌లో డైరెక్ట్‌- టు- హోమ్ (డీటీహెచ్) విరివిగా రావడంతో మారుమూల గ్రామాల్లోను వీటి ద్వారా వార్తలు, ఆటలు, వివిధ ధారావాహిక కార్యక్రమాలను ఇంటిల్లిపాది వీక్షించే అవకాశం కలుగుతోంది. దీంతోపాటు మనసుకు ఉల్లాసం, ఉత్సాహాన్ని నింపే పలు కార్యక్రమాలు ప్రసారమవుతుండటంతో తాము టీవీలను ఎక్కువగా చూస్తుంటామని మహిళలు తెలిపినట్లు ఆ సంస్థ వివరించింది.మనసును రంజింపజేసేందుకు మొదటి స్థానంలో టీవీ నిలవగా రెండవ స్థానంలో వార్తాపత్రికలు నిలిచాయని ఆ సంస్థ తెలిపింది. పశ్చిమ దేశాల్లో నేటికీ ఉదయం నిద్ర లేవగానే టీతోపాటు వార్తాపత్రికను చదవడం ఇష్టపడతారు. 26 సంవత్సరాల వయసుపైబడినవారిలో వార్తాపత్రికలను చదివేందుకు ఉత్సుకత చూసిస్తున్నట్లు తమ సర్వేలో తేలిందని ఆ సంస్థ తెలిపింది.

స్త్రీల నగలకు అర్ధం తెలుసా!

వడ్డాణం:
గర్భకోశము కదలి లోపలున్న శిశువు వికారంగా పుట్టకుండా చేస్తుంది. అలాగే బంగారాన్ని అనేక మార్గాల ద్వారా ఆహారంగా తీసుకుంటే ఎంతో ఫలితం ఇస్తుంది. అలాగే బంగారాన్ని ఏ రూపంగా ధరించినా ఎంతో కొంత శక్తి శరీరానికి సంక్ర మిస్తుంది.
ముక్కర:
దీన్ని ధరించటం వల్ల మాట్లాడేటప్పుడు పై పెదవికి తగిలి వీలయినంత తక్కువ మాట్లాడమని చెబు తుంది. ముక్కర ధరించటం  వల్ల ముక్కుకొనపై ఏదో విధంగా దృష్టి ఉంటుంది. అలా దృష్టి ఉండటం ధ్యానంలో ఒక భాగం. అలాగే భార్యా భర్తలు కలుసుకున్న సమయాల్లో స్త్రీ వదిలిన గాలి పురుషునికి అనారోగ్యం. అలాంటి చెడుశ్వాస కలిగిన గాలిని బంగారు ముక్కర పవిత్రం చేస్తుంది.

కాలికి మెట్టెలు:
గర్భకోశంలో నున్న నరాలకూ, కాలివేళ్లలో ఉన్న నరాలకు సంబంధం ఉంది.దానితో పాటు స్త్రీ కామాన్ని అదుపులో ఉంచుకోవాలంటే కాలివేలికి రాపిడి ఉండాలి. నేలను తాకరాదు. కామాన్ని పెంచే నరాలు కుడికాలి వేళ్లలో ఉన్నాయి.
చంద్రవంక:
దీనిని శిరోమధ్య ప్రదేశంలో ధరిస్తారు. ఆ ప్రాంతం నుంచే మన జీవనాధారమైన ప్రాణవాయువు బ్రహ్మరంధ్రం నుండి హృదయంలోకి ప్రవేశిస్తాడు. అందుకే  ఆ భాగాన్ని కప్పి ఉంచుతారు.

కంఠానికి వేసుకునే హారాలు:
హృదయంలో పరమాత్ముడున్నాడు. ఆ విషయాన్ని గుర్తించామని చెబుతూ ధరించటం. తెలిసీ, తెలియక చేసిన పాపాలను కూడా బంగారం పోగొడుతుంది.

బంగారం ధరించటం ద్వారా చెడుకలలు రాకపోవటమే కాదు, గుండెల మీద బంగారం గుండెకి సంబంధించిన వ్యాధులను కూడా అరికడుతుంది. అలంకారానికి పెట్టుకునే వస్తువులే అవసరానికి ఆదుకుంటాయి. పూర్వం రాజులూ, చక్రవర్తులూ అతి సన్నని బంగారు రేకులు చేయించుకొని వేడి అన్నం మీద వేసేవారు. వెనువెంటనే బంగారు రేకు కరిగి అన్నంలో కలిసిపోయేది. అలా వారు బంగారాన్ని ఆహారంగా తీసుకునేవారు.

కుంకుమ తిలకం

హిందూ సాంప్రదాయములో పసుపు , కుంకుమకు ముఖ్యపాత్రనే వుంది . ఏ శుభకార్యము తలపెట్టినా , ముందుగా పసుపు ,కుంకుమ లనే కొంటారు . ఆ తరువాతనే ఏమి కొన్ననూ . అమ్మవారికి , కుంకుమపూజ చేస్తే చాలామంచిది అని , పర్వదినాలలో తప్పక చేస్తారు . కుంకుమను , సుమంగళీ చిహ్నముగా భావిస్తారు .

మా అమ్మ కుంకుమను ఇంట్లోనే తయారు చేసేది . ప్రతిరోజూ అమ్మవారికి , ఆ కుంకుమ తోనే పూజ చేసి , ఆ పూజా కుంకుమను , ముతైదువులకు పంచేది . మా బంధువులు , మిత్రులు అందరూ కావాలని అడిగి తీసుకునేవారు .  ఆ కుంకుమ తయారి గురించి .

కావలిసిన సామానులు :
10 కిలోలు , పసుపుకొమ్ములు ,
1 కిలో పటిక ,
1 కిలో ఎలిగారం ,
400 నిమ్మకాయలు ,
1/2 కిలో నువ్వుల నూనె .

ముందుగా నిమ్మకాయలను రసము తీసుకొని , ప్లాస్టిక్ బకెట్ లో పోసుకోవాలి . పటిక , ఎలిగారం ను కచ్చాపచ్చాగా దంచి , ఆ రసములో ,కరిగి పోయేటట్లుగా కలపాలి . తరువాత పసుపు కొమ్ములు వేసి బాగాకలిపి ఒక రోజు వుంచాలి . మరునాడు వాటిని , ఇంకో ప్లాస్టిక్ బకెట్లోకి పూర్తిగా వంచేయాలి . ఆ విధముగా , నిమ్మరసము , పసుపు కొమ్ములకు పూర్తిగా పట్టేవరకు ,ప్రతిరోజూ ఒక బకెట్ లో నుండి , ఇంకో బకెట్ లో కి గుమ్మరించాలి .. ఇలా మార్చటము వలన పసుపు కొమ్ములకు నిమ్మరసము చక్కగా అంటుతుందన్నమాట. పసుపుకొమ్ములకు నిమ్మరసము పూర్తిగా పట్టిన తరువాత , అంటే ,ఈ సారి బకెట్ వంచుతే ,ఒక్క చుక్క కూడ నిమ్మరసము , పడకూడదన్నమాట , ఎవరూ తిరగని చోట , దుమ్మూ ధూళీ పడని చోట , నీడలో నేల శుభ్రముగా తుడిచి , చాప వేసి , దానిమీద , శుబ్రమైన బట్టను పరిచి , ఈ పసుపు కొమ్ములను ఎండపెట్టాలి . నీడలోనే సుమా ! అవి పూర్తిగా ఎండిన తరువాత , రోటిలో వేసి దంచాలి . ఆ పొడిని , తెల్లటి , పలచటి బట్టలో వేసి , జల్లించాలి . తరువాత ఆ పొడిలో కొద్ది కొద్దిగా నూనె వేస్తూ కలపాలి . నూనె తో కలపటము వలన , కుంకుమ నుదుటి మీద నిలుస్తుంది . లేకపోతే పెట్టుకోగానే రాలిపోతుంది . సరిపడా నూనె కలిపాక , సువాసన కొరకు ,కొద్దిగా రోజ్ వాటర్ కాని , ఉడుకులోన్ కాని కలపాలి . ఈ కుంకుమ మంచి ఎరుపురంగు లో వుంటుంది . ( సింధూరం రంగు కాదు , ఎరుపు ) .

ఎవరైనా ప్రయత్నము చేయాలంటే 100 గ్రాముల పసుపు కొమ్ములతో , మిగితావి ఆ కొలతకు సరిపడా తీసుకొని చేసుకోవచ్చు. పటిక , ఎలిగారము , కిరాణాదుకాణాలలో దొరుకుతాయి . చక్కని సువాసన తో ఈ కుంకుమ చాలా బాగుంటుంది .

పసుపు కొమ్ములలో , కుంకుమ రాళ్ళు వేసి , దంచి , తెల్లనిబట్టతో జల్లించి , నూనె కలుపుకొని , తోపురంగు కుంకుమ ( మెరూన్ కలర్ ) తయారు చేసుకోవచ్చు . కుంకుమరాళ్ళు , పటికలాగా వుంటాయి . తొందరగానే నలుగుతాయి .కుంకుమ రాళ్ళు కూడా కిరాణా దుకాణాలలో దొరుకుతాయి . బజారులో దొరికే కుంకుమ ఇదే .

ఓపిక , టైము వుంటే కుంకుమను తయారుచేసుకొని చూడండి . ఎంతైనా మనము సొంతముగా తయారు చేసుకున్న ఆనందమే వేరుకదా !

అమ్మాయిలు ఎలాంటి భాగస్వామిని కోరుకుంటున్నారంటే..?!

ప్రతి అమ్మాయి తన జీవిత భాగస్వామి అందంగా ఉండాలని కలలు కంటూ ఉంటుంది. అందంతోపాటు అతని చదువు, ఆదాయం, వ్యక్తిగత గుణాలు, మంచి అలవాట్లు కలిగిన వాడైతేనే ఇష్టపడుతున్నారు నేటి అమ్మాయిలు.  ఆమెకు కాబోయే జీవిత భాగస్వామి పిసినారిగా, పిరికిపందలా ఉండకూడదని కోరుకుంటుంటారు. పిసినారి భర్తతో తన కోరికలు నెరవేరవని నేటి అమ్మాయిలు భావిస్తున్నారు.
మంచి ఆదాయపరుడైన వరుడు తనకు జీవిత భాగస్వామిగా లభించాలని కోరుకుంటోంది. స్త్రీ తెచ్చే ఆదాయంపై ఆధారపడే పురుషులంటే ఏ అమ్మాయి కూడా ఇష్టపడదని సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి అబ్బాయిలతో తస్మాత్ జాగ్రత్త. చాలా మంది అమ్మాయిలు తనకు కాబోయే భర్త తనకన్నా గొప్పగా చదివి వుండాలి, మంచి తెలివిపరుడై ఉండాలి. అందరికన్నా యోగ్యుడై ఉండాలని కోరుకుంటున్నారు.  తల్లిదండ్రుల ఆదాయంపై ఆధారపడి జీవించే అబ్బాయిలంటే అమ్మాయిలు మొహం చాటేస్తున్నారు. స్వతహాగా ఆదాయపరులై ఉండే అబ్బాయిలనే తమ జీవిత భాగస్వామిగా కోరుకుంటున్నారు.
తమ ఆలోచనలను పదిమందితో పంచుకునే వాడుగా అబ్బాయి వుండాలి, పదిమందికి ఆదర్శప్రాయుడై ఉండాలి. సంకుచిత స్వభావం కలిగిన వారంటే అమ్మాయిలు అస్సలు ఇష్టపడరు. అలాగే అమ్మాయిల ఆలోచనలను గౌరవించేవారంటే మరీ ఇష్టపడుతుంటారు.  తనకు కాబోయే జీవిత భాగస్వామి కేవలం తన భర్తగానే కాకుండా తనకు మంచి మిత్రునిగా కూడా వ్యవహరించేలా ఉండాలని అమ్మాయిలు కోరుకుంటున్నారు. సుఖదుఃఖాలలో, కష్టనష్టాలలో, సంతోషంలో తనతో పాలుపంచుకునే వాడినే తన జీవిత భాగస్వామిగా కోరుకుంటున్నారు నేటి అమ్మాయిలు. తనకు కాబోయే జీవిత భాగస్వామి కనుసన్నల్లో జీవించాలని నేటి అమ్మాయిలు కోరుకోవడం లేదు. అలాగే ఇతరులు చెప్పే చెప్పుడు మాటలతో తన జీవితాన్ని నరకప్రాయం చేసుకునేవారంటే అస్సలు ఇష్టపడటం లేదు. ఇలాంటి వారు జీవిత భాగస్వామిని సుఖపెట్టలేరని అమ్మాయిల అభిప్రాయంగా ఉంది. సుగుణాల రాముడు, సుసంపన్నుడైతేనే ఇష్టపడుతున్నారు నేటి అమ్మాయిలు. దురలవాట్లున్న వ్యక్తి తన జీవిత భాగస్వామిని సరిగా చూసుకోలేడని అమ్మాయిలు బలంగా నమ్ముతున్నారు.  పదిమందిలో స్త్రీలపట్ల గౌరవ భావం చూపగలిగిన వాడినే చాలామంది అమ్మాయిలు కోరుకుంటుంటారు.
స్త్రీలంటే కాళ్ళక్రింద చెప్పులుగా చాలా మంది భావిస్తుంటారు, అలాంటి మగవారిని తమ జీవిత భాగస్వామిగా అమ్మాయిలు ససేమిరా అంగీకరించరు.  తనంటే ప్రేమ, గౌరవం, అభిమానం పంచేవాడైతేనే అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. వివాహమైన తర్వాత తన జీవిత భాగస్వామి తనను ఒంటరి జీవితాన్ని గడిపేలా చేసేస్తే మరి అలాంటి వివాహం ఎందుకు అని వారు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా వివాహం చేసుకుని చాలామంది అబ్బాయిలు విదేశాల్లో ఉద్యోగాలు వెలగబెడుతుంటారు. అంటే.. అమ్మాయిని అమ్మగారింట్లోనో లేక అత్తగారింట్లోనో వదిలేసి వీరు మాత్రం విదేశాలలో బ్యాచిలర్‌గా ఫోజులు కొడుతూ జీవిస్తుంటారు. ఇది కూడా ఒక జీవితమేనా అని ప్రశ్నిస్తున్నారు నేటి అమ్మాయిలు.