annamacharya keerthanalu

పలుకు దేనెల తల్లి పవళించెను |
కలికి తనముల విభుని గలసినది గాన ||

నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర
పగలైన దాక జెలి పవళించెను |
తెగని పరిణతులతో తెల్లవారినదాక
జగదేక పతి మనసు జట్టి గొనె గాన ||

కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగ దరుణి
బంగారు మేడపై బవళించెను |
చెంగలువ కనుగొనల సింగారములు దొలక
అంగజ గురునితోడ నలసినదిగాన ||

మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై
పరవశంబున దరుణి పవళించెను |
తిరు వేంకటాచలా ధిపుని కౌగిట గలసి
అరవిరై నును జెమలు నంటినదిగాన ||

ప : వలపులు వలపులు వయ్యాళి
చలమరి మరుడును సమేళి

చ : నెలత మోమునకు నీ కనుచూపులు
నిలువున ముత్యపు నివాళి
కొలదికి మీరిన గురుకుచములకును
తొలకు నీ మనసు దువ్వాళి

చ : వనిత నిండుజవ్వన గర్వమునకు
ఘనమగు నీ రతి కరాళి
వెనకముందరల వెలది మేనికిని
పెనగు గోరికొన పిసాళి

చ : పడతి కోరికల భావంబునకును
కడు కడు నీతమి గయ్యాళి
చిడిముడి మగువకు శ్రీవేంకటపతి
విడువని కూటపు విరాళి

వలపుల సొలపుల వసంత వేళ యిది

సెలవి నవ్వకువే చెమరించీ మేను

శిరసు వంచకువే సిగ్గులు పడకువే
పరగ నిన్నతడు తప్పక చూచీని
విరులు దులుపకవే వెసదప్పించుకోకువే
సిరులనీ విభుడిట్టే సేసవెట్టీని

పెనగులాడకువే బిగువు చూపకువే
ఘన శ్రీవేంకటేశుడు కౌగిలించీని
అనుమానించకువే అలమేల్మంగవు నీవు
చనవిచ్చి నిన్నునేలె సమ్మతించీ యాతడు

ఇటువలె నుండవద్దా యిరవైన మోహము
తటుకన నీమీది తగులెంతోఁ గానీ

సొరిది నీ మోము సారెఁ జూచియిను తనియదు
తరుణి మాటలాడియుఁ తనియదు
సరసము లాడియాడి చాలునని తనియదు
అరుదైన మదిలోని యాస యం(యెం)తో కాని

ననుపుసేసుక చెలి నవ్వియును తనియదు
తనువుసోక పెనగియు తనియదు
మునుకొని చేతులెత్తి మొక్కియును తనియదు
యెనసి నీపై వలపింకా నెంతో కాని

రమణి నీ కాగిట రతిసేసి తనియదు
తమితో గుబ్బలనొత్తి తనియదు
జమళి శ్రీవేంకటేశ సన్నసేసి తనియదు
అమరిన సంతోసమది యెంతోకాని

అలర చంచలమైన ఆత్మలందుండ

నీ యలవాటు చేసె నీ వుయ్యాల |
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుం

డ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ||

ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన

వుడుమండలము మోచె నుయ్యాల |
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన

అఖిలంబు నిండె నీ వుయ్యాల ||

పదిలముగ వేదములు బంగారు

చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల |
వదలకిటు ధర్మదేవత పీఠమై

మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల ||

మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల

మెరుగునకు మెరుగాయె వుయ్యాల |
నీల శైలమువంటి నీ మేనికాంతికి

నిజమైన తొడవాయె వుయ్యాల ||

జో అచ్యుతానంద జోజో ముకుందా

రావె పరమానంనద , రామ గోవిందా జోజో జోజో

నందునింటనుజేరి నయముమీరంగా
చంద్రవదనలు నీకు సేవచేయంగా
అందముగ వారిండ్ల ఆడుచుండంగా
మందలకు దొంగ మా ముద్దురంగా జోజో జోజో

….
అంగజునిగన్న మాయన్నయిటు రారా
బంగారుగిన్నెలో పాలుపోసేరా
దొంగనీవని సతులు పొంగుచున్నరా
ముంగిటానాడరా మొహనాకారా జోజో జోజో
….
అంగుగా తాళ్ళాపాకనయ్య చాలా
శృంగార రచనగా చెప్పెనీ జోల
సంగతిగ సకల సంపదలు నీవేలా
మంగళము తిరుపట్ల మదనగోపాలా జోజో జోజో