అట్ల తద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొంటారు. “అట్లతద్దె ఆరట్లు ముద్దపప్పు మూడట్లు” అంటూ ఆడ పడుచులకు బంధువులకు ఇరుగు పొరుగులకు వాయినాలివ్వటం పరిపాటి. సాయం సమయమందు వాయినలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి, అటునుండి చెరువులలో కాలువలలో దీపాలను వదలి, చెట్లకు ఊయలలు కట్టి ఊగటం చేస్తుంటారు.
గౌరీదేవి శివుని పతిగా పొందాలనే కృత నిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు. ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్ది వ్రతం చేయమని నారదుడు సూచించాడు. ఆయన ప్రోద్బలంతో పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతద్ది. ఇది స్ర్తీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం కన్నెపిల్లలు పడచువాణ్ణి పతిగా పొందాలనుకుంటే తప్పక ఆచరించవలసిన వ్రతమిది.
‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూడట్లోయ్’ అంటూ ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగుపొరుగువారికి అట్లు వాయనంగా ఇవ్వటం ఆచారం. చెట్టుకు ఉయ్యాలలు కట్టి ఊగుతారు.
ఆశ్వయుజ బహుళ తదియనాడు చేసుకునే ఈ పూజ ప్రధానంగా చంద్రుని ఆరాధనకు సంబంధించినది. చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత స్ర్తీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రం చెబుతోంది.
ఈ నోములో అమ్మవారికి అట్లు నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం ఉంది. నవగ్రహాలలో ఒకడైన కుజునికి అట్లంటే ప్రీతి. వీటిని ఆయనకు నైవేద్యంగా పెడితే కుజుని వలన కలిగే దోషాలు పరిహారమై, సంసారసుఖంలో ఎటువంటి అడ్డంకులు రావనేది ఒక విశ్వాసం. అంతేకాక కుజుడు రజోదయానికి కూడా కారకుడు కనుక ఋతుచక్రం సరిగా ఉంచి ఋతుసమస్యలు రానివ్వకుండా కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలుండవు. మినుముల పిండి, బియ్యప్పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకి, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు పోవడం కోసం, గర్భస్రావం కాకుండా సుఖప్రసవం అయ్యేందుకు ముత్తయిదువులకు అట్లను వాయనంగా ఇస్తారు. అట్లతద్దిలో ఇంతటి వైద్యవిజ్ఞానం ఉంది.
ఈ రోజు తెల్లవారుఝామునే స్ర్తీలు మేల్కొని స్నానం చేయాలి. పగలంతా ఉపవాసం ఉండాలి. ఇంట్లో తూర్పుదిక్కున గౌరీదేవికి మంటపం ఏర్పాటు చేయాలి. ధూప, దీప, నైవేద్యాలు పెట్టి ముందుగా గణపతిపూజ చేయాలి. పిదప శాస్త్రోక్తంగా గౌరీదేవికి పూజచేసి, ఆ తరవాత గౌరీ స్తోత్రం, శ్లోకాలు చదవడంతో పాటు, పాటలు పాడాలి. సాయంత్రం చంద్రదర్శనం అయిన తరవాత శుచిగా స్నానం చేసి మళ్లీ గౌరీపూజ చేయాలి. 11 అట్లు నైవేద్యంగా పెట్టాలి. ముత్తయిదువులకు అలంకారం చేసి 11 అట్లు, 11 ఫలాలు వాయనంగా ఇచ్చి అట్లతద్ది నోము కథ చెప్పుకుని అక్షతలు వేసుకోవాలి.
పేరంటానికి వచ్చిన ముత్తయిదువులకు నల్లపూసలు, లక్కకోళ్లు, రవికలగుడ్డలు, దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనాలు పెట్టి, తామూ భోజనం చేయాలి. 11 రకాల ఫలాలను తినడం, 11 సార్లు తాంబూలం వేసుకోవడం, 11 సార్లు ఊయల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం, ఇందులో విశేషం. ఇవన్నీ చేయడం వలన గౌరీదేవి అనుగ్రహం లభిస్తుందని, కన్యలకు గుణవంతుడైన భర్త లభిస్తాడని, పెళ్లయిన వారికి పిల్లలు కలుగుతారని, ఐదవతనంతో పాటు పుణ్యం లభిస్తుందని తరతరాల నుంచి వస్తున్న నమ్మకం. ఈపండగనే ఉయ్యాలపండగ లేదా గోరింటాకు పండగ అని అంటారు.
అట్లతద్దినాడు పిల్లల హడావుడి అంతా ఇంతా కాదు. ముందు రోజు చేతులకి గోరింటాకు పెట్టుకుంటారు. మరుసటి రోజు ఉదయమే చద్దెన్నం తినాలి కనుక ముందురోజు రాత్రి అన్నం వండుకుంటారు. ఇంకా గోంగూర పచ్చడి, ఉల్లిపాయ పులుసు, నువ్వులపొడి, గడ్డపెరుగు సిద్ధం చేసుకుంటారు. అట్లతద్దె రోజున తెల్లవారు ఝామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని, ఇరుగుపొరుగు పిల్లల్ని నిద్ర లేపడానికి ముద్దపప్పోయ్, మూడట్లోయ్, పీట కింద పిడికెడు బియ్యం, పిల్లల్లారా, జెల్లల్లారా లేచి రండోయ్…’ అని పాడుకుంటూ వెడతారు. అందరూ కలిసి చె ట్లకి వేసిన పెద్దపెద్ద ఉయ్యాలలు ఊగుతారు. ఆ తరవాత ఇళ్లకి వచ్చి అన్నాలు తిని తాంబూలం వేసుకుంటారు. ఎవరి నోరు ఎరగ్రా పండితే వారికి అంత మంచి మొగుడొస్తాడని ఒకరితో ఒకరు పరాచికాలాడుకుంటారు. ఆ తరవాత స్నానాదులు చేసి అట్లు వేసి ఒకరికొకరు వాయనాలిచ్చుకున్న తరవాత తింటారు. ఇది కన్నెపిల్లలంతా ఎంతో సంతోషంగా చేసుకునే పండుగ. తెల్లవారు ఝామునే లేవటం, పిల్లలతో కలిసి ఆడుకోవటం, పేరంటం చేస్తూ అందరితో సరదాగా ఉండటం పిల్లలకు అలవాటవుతాయి.
మా చిన్నప్పుడు పొద్దున్నే చద్దన్నం తినడానికి ఒకటే పేచి. కాని కొంత వయసు వచ్చాక మాత్రం అట్లతద్ది అర్ధం తెలిసాక ఎప్పుడు నలుగావుతుందా అని చూసే వాళ్ళం.
చలికాలం దగ్గర పడే సమయం కావడంతో పొద్దున్నే లేవలేకపోతారు. ఈ పండగ కారణంగా ఉత్సాహం కొద్దీ ఉదయమే లేవడం అలవాటు చేసుకుంటారు. అలాగే చలి నుంచి శరీరానికి వేడి పుట్టే ఆహారం కూడా ఆ రోజున తీసుకోవడం వల్ల ఆరోగ్యపుష్టికి దోహదపడుతుంది. నువ్వులపొడి, గోంగూర పచ్చడి, పెరుగు వంటివి శరీరానికి వేడి చేస్తే ఉల్లిపాయపులుసు చలవ చేస్తుంది. అంతేకాక అన్నీ చద్దివి తినడం వల్ల అరగదనే భయం కూడా లేకుండా తాంబూల సేవనం కూడా జరుగుతుంది. ఈ పండుగ ఆనంద, ఆరోగ్యాలను కలుగచేస్తుంది. ఆటపాటల వల్ల పిల్లలకి మంచి వ్యాయామం కూడా అవుతుంది.
ఇంత చక్కని వ్రతాన్ని మీరుకూడా చేసుకుంటారు కదూ!
నేనెప్పుడూ ఈ పండగ గురించి వినలేదే ..? మా ప్రాంతం లో ఈ పండగ చేస్కోరేమో ? ప్రసిద్ధం కాదేమో ?
అవునా? మీది ఏ ప్రాంతం?
అమెరికా …హ్హి హ్హి హ్హి
అవునా! 🙂 🙂 🙂 🙂 😀 😆 😆
<>
ఇంత వైద్య అజ్ఞానం వుందా? 10గ్రా పారాసిటమాల్ తినండి.
what paracetamol ? why?
(దేహమును వదిలే) ఒక్క క్షణంఅంతటా వ్యాపించి వుంది సూక్ష్మము ఆకాశములోకి వెళ్లి బ్రహ్మసత్యమని నమ్మర
జీవో బ్రహ్మైవ నాపర:యని తెలియరఆత్మనిలుకడ చెందరనిజస్థితిని తెలియర చింతలులేని ఇల్లు శివాలయంబుర
కోర్కెలుడిగిన హృదయం కోవెలయని తెలియరఒక్క మాటలో చెప్పబడే “మనసు”లో అనేక భాగాలున్నాయి: మనస్సు; బుద్ధి; చిత్తం; హృదయం; అహంకారం. వీటన్నిటి కలగలుపే “మనస్సు”. కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని పనిచేయించేదీ, అదుపులో పెట్టేదీ ఈ మనసే; కష్టాల్ని, బాధల్ని అనుభవించేదీ మనసే; సుఖాల్ని, ఆనందాన్ని అనుభవించేదీ మనసే; కృంగిపోయేదీ మనసే; పొంగిపోయేదీ మనసే. మనసుకి ఎందుకీ వైవిధ్యం? మనస్సు నిశ్చలంగా, స్థిరంగా మనస్సునిలుకడ తెలియర, మనస్సు ఒకే విషయమందు లగ్నమై వుంటుంది. ఇక్కడ ఆలోచనలకు తావులేదు. స్థితి అయిన సమాధి స్థితిలో ఆలోచనలు వుండవు; స్పృహ వుండదు; మనస్సు నిశ్చలమై వుంటుంది; సమయం తెలియదు. ఇక్కడే సత్యాన్ని లేదా సత్య-స్థితిని పొందవచ్చు,మనస్సు ఆలోచనల స్థితిని దాటినప్పుడే సత్యం తెలుస్తుంది ఈ సమాధి స్థితిలోకి వెళ్ళిన తరువాతే సత్యాన్ని తెలుసుకోవటం జరుగవచ్చు సత్యాన్ని గురించి ఎవరూ, ఎవరికీ బోధించలేరు B. రత్నం గారికి,
బాలయ పల్లె గ్రామం
ఎస్. ఆర్ . పురం మండలం
నెల్లూరు
what is the meaning of your comments? i didn’t understand.
మానవజన్మే చాలా గొప్పది. దాంట్లో, మానవులనేకమంది ఉన్నారు, ముముక్షుత్వం అంటే మోక్షవాంఛ కలిగి ఉండడం చాలా అరుదు. ఈ రెండూ సిద్ధించవచ్చు కానీ మహాత్ములయొక్క అనుగ్రహమూ, వారియొక్క సందర్శనము, వారి ఉపదేశము మనకు ఎలా లభిస్తాయి? ఈ ప్రపంచంలో జరిగే అన్ని అన్యాయాలకు, అక్రమాలకు, అనర్ధాలకు మనస్సు ” మూలం. కనుక మానవుడు ముందుగా “జ్ఞానం” సంపాదించాలి.ప్రపంచానికీ క్షె[మంసత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి … కానీ ధ్యానం వగైరా సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం దైవ ( ఆత్మ )సాక్షాత్కారం అని ..గురువు ద్వారానే అతి సులభముగా పొందగలం. పరబ్రహ్మం, ఆత్మ, పరమాత్మ వంటి మనసు అంతర్ముఖమై సమాధి స్థితిని పొందాడు.ఎన్నో అపూర్వమైన అనుభవాలు కలిగాయి. ఆ విధం గా ఎంతో పూర్వ జన్మ పుణ్య ఫలం వుంటే గాని,ఎన్నో సంవత్సరములు కఠోర సాధన చేస్తే గాని లభ్యం కాని ఆత్మ సాక్షాత్కారం కలిగింది. కేవలం చూపులతో ఆత్మ సాక్షాత్కారం కలిగించిన ఈ సకల చరాచర సృష్టిలో ఏ జీవుల మధ్యా బేధం లేదు, అన్ని జీవులు ఆ పరమాత్మ నుండి పుట్టినవే, అన్నింటి లో వ్యాప్తమై వున్న ఆత్మ అని అంటారు” అని వైపు చూసి ” ఆత్మ సాక్షాత్కారం మౌనం గా కూర్చో నీకు కావలసింది వెంటనే దక్కుతుంది” సద్గురువు యొక్క పూజ, ధ్యానము ,అర్చనలు అన్నింటి కంటే మేలైనవి. ఆనితర సాధ్యమైన ఆత్మ సాక్షాత్కారం సద్గురువు కృప వలనే సాధ్యం. అధ్యాత్మికతకు కావల్సింది అచంచల భక్తి విశ్వాసాలు, నమ్మకం మాత్రమే ! ఏ మేరకు మనలో భక్తి ప్రవృత్తులు, విశ్వాసాలు చోటు చేసుకుం టాయొ, ఆ మేరకు ని సద్గురువుఅనుగ్రహం ఆత్మ సాక్షాత్కారం అతి గా లభిస్తుంది. ఇది సత్యం.సమాధిని రెండు రకాలుగా చెప్పారు. అంటే మనసు సర్వాత్మనా లీనమై పోవటం అన్నమాట. ఆ స్థితిలో ఉన్న వాళ్ళు కదలరు. ఒక స్థాణువులాగా, మొద్దులాగా ఉండిపోతారు. వేల సంవత్సరాలు అలాగే సమాధిలో ఉండిపోతారు మహాత్ములు. అటువంటి వాళ్ళల్లో ఎన్ని వేల సంవత్సరాలు అలా ఉండిపోయాడో మనకి తెలియదసలు. మనస్సు ప్రపంచాన్ని, వస్తువులను గుర్తిస్తోంది. మనస్సు అంతర్ముఖం కాగానే ఆత్మ సాక్షాత్కారం ఒక్కసారిగా ప్రవాహంగా వస్తుంది. దైవాన్ని పొందగలం. ఆత్మే పరమాత్మ’ అన్న సత్యం అవగతమవుతుంది. మనసుకు స్ధానం ఇంద్రియాలకు దగ్గరగా ఉండి . ఈ వెలుగు సహాయంతో ఇంద్రియాలకు మనసు ప్రకాశించుచు ప్రపంచమును చూస్తుంది. ఇంద్రియాలు మనసు శరీరం కాదు మనిషితనను తాను తెలుసుకొని అంటే ఆత్మ సాక్షాత్కారం పొంది దైవత్వం లోకి ప్రవేశించాలి. ఇదే ప్రకృతి నియమం. ఈనియమానికి విరుద్ధం గా మనిషి జీవితం సాగుతుంటే ముందు నీవు ఆత్మ సాక్షాత్కారాన్ని సాధించు. ఆత్మ నిన్ను పరమాత్మ సాక్షాత్కారం పొందటానికి సిద్ధం చేస్తుంది. అర్హత లభించగానే, సాక్షాత్ పరమేశ్వర స్వరూపులైన సద్గురువు వారంతట .. పరిశుద్ద ఆత్మ సాక్షాత్కారం ఏర్పడినప్పుడు ఆత్మకు వెనకాతల ఉన్న భగవంతుడిని, వాడి గుణములను తలిచి, అభ్యసిస్తే ఆ భగవంతుడిపై జ్ఞానం ఏర్పడినప్పుడు భగవంతుడిపై ప్రేమ ఏర్పడటానికి ఈ స్థితిని పొందటాన్నే ఆత్మ సాక్షాత్కారమనీ , సత్యదర్శనమనీ రకరకాలుగా చెబుతారు. … సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం దైవ ( ఆత్మ )సాక్షాత్కారం అని మానవ పరిణామ లో ఆత్మ సాక్షాత్కారం అత్యున్నతమైనదని, దీనిని … ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి తనలో తాను వెలిగి పోతుంటాడనీ, ఇదే దానికి .ఆత్మ సాక్షాత్కారమే అంతా అన్నట్లుగ మన మాటలు, చేష్టలు జరుగుతున్నాయి?’ఆత్మ సాక్షాత్కారం’ అనే భ్రమ లొ జీవిస్తున్నామా? లెదా, మనని మనమే ఇతరులతో వేరుగా గుర్తింప ఆత్మ రూపంలో వున్నాను. నిర్మల మనస్సుతో ఆత్మ సాక్షాత్కారం పొందు” చెప్పాడు ఇచ్చేయి ఇస్లాం, క్రైస్తవ మార్గాలలో కూడా సాధన చేసి ఆ మార్గాలలోకూడా ఫలితం పొందారు. అలా అన్నిమతాల సారాంశం ఒక్కటే అని అనుభవపూర్వకంగా ఒక్కడే భగవంతుడు, సర్వమత ఐకమత్యము. అన్నిమతాల సారాంశం ఒక్కటే.
మానవ జీవిత ము లో దాస్య కారకాలు కామము, స్వార్థము. కామకాంచనాలనుండి విడివడితే భగవంతున్ని పొందవచ్చు.
మానవసేవే మాధవసేవఒక గమ్యానికి ఎన్నోమార్గాలున్నట్లే భగవంతున్ని చేరడానికిB. రత్నం గారికి,
బాలయ పల్లె గ్రామం
ఎస్. ఆర్ . పురం మండలం
నెల్లూరు
మనస్సు నిలుకడపొంది, తానున్న చోటనే ఆత్మ తత్త్వం దర్శించాలి. ఆత్మనిష్ఠ చిక్కిన వానికి వేరే యాత్రలతో పనిలేదు. అన్ని యాత్రలు వారిలోనే దర్శించ గలరు. దైవ భావంతో గాంచినపుడు విగ్రహముగాని, మరెట్టి ప్రతిమగాని పరమాత్మ స్వరూపంగ భాసిల్లుతుంది. దేవుని రాతిగ మార్చుటకన్న, రాతిని దేవునిగ చేయుట మిన్న. ఇదియే విగ్రహారాధనలోని అమోఘ రహస్యమువిగ్రహారాధనలోని రహస్యము. మనసు ఊరికే ఉండ విగ్రహమును సజీవమూర్తియైన మనసునిలుపుకొని ఇదియే ఆత్మ విశ్వాసములోని బలము. వరములనిచ్చే బయటలేడు. మానవుని హృదయాంతరంగమున గలడు. అందులకే హృదయశుద్ధిగలవారు ధన్యులు. సత్యము. ఊరికే ఉండకుండ అనుభవసిద్ధికై, నేత్రానంద పరవశమునకై యాత్రలు చేయాలి. అందువల్ల దోషంలేదుగాని అంతటితో మా బాధ్యత తీరిందని భ్రమపడరాదు. నిజంగా ఆలోచిస్తే నిన్ను మించిన యాత్రలేదు. అట్టి నీవనగ ఎవరో ఉన్నది ఉన్నట్లుగ తెలుసుకో. సమస్త భగవంతులు నా ఆత్మ స్వరూపులేయనెటి ఈ అతీత భావనిష్ఠను పొందిననాడు అనంతవిశ్వం నీదిగ భాసిల్లుతుంది. అందులకే క్షుధ్ర వ్యక్తిత్వ హద్దులనుమీరి ఆత్మ అఖండ సమాధి నిమగ్నులు కావాలి. దర్శనాంతర్ధానములు సముద్రము మీది తరంగముల వంటివి. ఆత్మ వినాశం లేదు. శక్తి పూరించబడునది తగ్గేది కాదు. శక్తి నశించదు,ఆత్మ చావదు. ఆత్మ హెచ్చు తగ్గులు లేవు. ఆత్మ సాక్షాత్కారం వైపు పయనిస్తున్నంత సేపు అమృతం వైపు వెళతాడని చెప్పి యున్నారు ఆత్మ .నిండా గ్రహించగలరు. ప్రతివారు ఈ ఆత్మ స్ధితికి ఎదగాలి. ఆత్మ ఏకత్వము అనెటి భావము మానవ ఆత్మలో సదా ప్రచురితమయ్యే యున్నది. ప్రేమభావంతో ఆత్మయొక్క సత్య స్వరూపాన్ని దర్శించి విపులీకరించ వీలున్నది. మనము ఎవరిని ప్రేమించినప్పటికి వారిలో దర్శించేది ఉన్నత స్ధాయిలో మన ఆత్మయే. ఆత్మ మూలముననే సర్వం విశ్వాసపరిధిలో వర్ధిల్లుచున్నదని తెలియాలి. నీ ఆత్మయే గనుక మమాత్మా సర్వ భూతాంత ఆత్మఅంతర్దృష్టినిఆత్మసౌందర్యమే నిండుకుంటుంది. నిజముగ ఇతరులతో మనం ఐక్యత పొందటంలోనే పరిపూర్ణమైన ఆనందం గలదు. ఆత్మను తెలుసుకొనుట యే అమరత్వమునకు దారి. మానవుని నిరంతర కృషికి ఇదియే చేస్తుంది. ఆత్మ యొక్క సహాయంలేకుండ గమ్యాన్ని చేరుకోవడం అసాధ్యం. ఆత్మ తల్లిగర్భంలో ఉన్నపుడు తల్లి ప్రాణంతో ప్రాణాన్ని జోడించి జీవించునట్లు జీవాత్మ, పరమాత్మల సంబంధం అంతేనని తెలియాలి.మానవుని ఆత్మ పరమాత్మతో ఏకత్వమును సాధించినపుడే మానవుడు పరి పూర్ణుడు ఔతాడు. ఇట్టి ఆత్మ పరిజ్ఞానమే ఆతనిని అనంతస్ధితి వైపు నడిపిస్తుందిసమస్త సాధనల సారం ఇదియే. సర్వం ఆత్మే ఐనపుడు ఇక ఆత్మకు తావేది. నేను ఎక్కడ పుడుతుందో చూడటమే ఆత్మ విచారణ. ఆత్మకు శరీరంలో తావు హృదయం. ఆత్మ హృదయంలో ఉన్నదనుటకన్న హృదయమే ఆత్మయని, మనోనిగ్రహం గ్రహించవలసి యున్నది. హృదయం ప్రకాశిస్తుంది. హృదయమ్నుండి వస్తుంది. హృదయశుద్ధి గలవారు ధన్యులు. ఆంతర్యం గ్రహించండి. ఇది ఆత్మ దర్శనమునకు సూటి దారి ఆత్మ చైతన్యం ఒక్కటే క్షణం మార్గదర్శనం అవుతుంది.ఆత్మ విషయంలో అంచనాలు పనికి రావు. అనుభవం ముఖ్యం, అనుభూతి ప్రధానం. మనో మూలమైన ఆత్మను కున్నామా మనస్సు దానంతటదే అదృశ్య మౌతుంది.ఆత్మను కనుగొన్న తరువాత నిగ్రహించటానికి మనస్సే ఉండదు. జ్ఞానిలో మనస్సు పనిచేయ వచ్చు. చేయకపోవచ్చు. అతని దృష్టిలో ఆత్మ ఒక్కటే ఉంది.
ఎరుక దేవుడ
సద్గురు సన్నిధిలో శిష్యులుగ, పెద్దల సన్నిధిలో సేవకులుగ నిలువగలిగే అభ్యాసకులు అమృతత్వ సిద్ధిని ఈ జన్మలోనే పొందగలరు. సద్గురు సన్నిధిలో నిన్ను నీవు తెలుసుకోవడమే నీ నిజస్వరూపాన్ని చక్కగా అర్ధం చేసుకోవడమే అసలైన ఆధ్యాత్మిక విద్య.ఆత్మవిద్య అమరత్వాన్ని ప్రసాదిస్తుంది. నీవు ఎంత గొప్ప చదువు చదివి ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఎన్ని కోట్లు సంపాదించినా చివరకు మృత్యువాత పడక తప్పదుఆత్మ సాక్షాత్కారం సద్గురు సన్నిధిలో నీవు చక్కగా అర్ధంచేసుకొని, అర్ధవంతంగా, పదుగురికి ఆదర్శవంతంగా జీవించాలి. అప్పుడే మానవ జన్మ ఎత్తినందుకు సార్ధకత లభిస్తుంది. కన్న తల్లి, సద్గురు ఉన్న ఊరు, పుట్టిన దేశం రుణం తీర్చుకున్నవాళ్ళం ఔతాం.వేదాంతమంటే ముసలితనంలో నేర్చుకునే విద్య అసలే కాదు. శరీరంలోని అన్ని అంగాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, మనస్సు స్ధిరంగా, స్ధిమితంగా ఉంటుంది. అప్పుడే మన శరీరం ఆధ్యాత్మిక సాధనకు చక్కగా సహకరిస్తుంది. మనం తెలుసుకున్న విషయాలు హృదయసీమలో హత్తుకుని చక్కటి ఆచరణకు దోహదం చేస్తుంది. తద్వారా సత్ఫలితాలను సాధించడానికి చక్కగా సహకరిస్తుంది.ఆత్మ విషయంలో తెలుసుకోవటం, దర్శించటం ద్వైతం. ఆత్మ తానని గ్రహించటం అద్వైతం. తానైన ఆత్మయే సర్వ భూతాంతరాత్మ యనెటి ఆత్మౌపమ్య భావనిష్ట నొందుటయే కేవలాద్వైత పూర్ణ స్ధితి. ఇదియే వేదాంతసారం నిజస్ధితిని గ్రహించాలి. ముక్కుమూసు కొని అడవులలో సంవత్సరాలకొద్ది తపస్సు చేసేవారు. కాని ప్రస్తుతం సమాజంలో చాలామంది ధ్యానం, యోగం, వ్యాయామం లాంటి శరీరక, మానసిక ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొని, ఆచరించిదేవుడు, జీవుడు, ప్రపంచానికి మధ్య గల సంబంధాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. మానవ సేవయే మాధవ సేవ యని గ్రహించి మనిషిలో దైవాన్ని దర్శిస్తున్నారు. , గురువుద్వారా ఆత్మదర్శనం చేసుకొని నేను పాంచభౌతిక దేహమును కాదు, సాక్షాత్తు దైవ స్వరూపుడను అనే స్ధితికి రావడం నిజంగా సంతోషించదగ్గ శుభపరిణామం అని చెప్పవచ్చు. మనవంతు సాధన మనమూ చేసి, ఆత్మ బయటలేదు. అది నీతో నీలోనే తెలియబడాలి. ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది పరమాత్మలో లీనమౌదాం. బట్టబయలు గావింపబడినవి ఆత్మ సాక్షాత్కారా దేహం నేను కాదు, మనస్సు నేను కాదు , ఇంద్రియములు నేను కాదు.దేహానికి సంబంధించి ఏది నేను కాదు.నా స్వభావము సత్ చిత్ ఆనందం. అరణ్యములు తిరగటం, కొండగుహలలో పడియుండటం అడవులపాలై తిరిగినంత మాత్రమున లాభంలేదు అవసరంలేదు. ప్రతిదినము గురువుబోధనలను వీలున్నంత సమయంలో ఆత్మ విచారణ సర్వత్ర ఆత్మానుభూతి సర్వకాలాలకు చెందిన బ్రహ్మ. భావమే నిజముక్తి సిద్ధిస్తుంది. భ్రాంతిని వదలాలి. ఇది అసలైన ఆత్మ తత్త్వం దర్శించాలి. ఆత్మనిష్ఠ చిక్కిన వానికి వేరే యాత్రలతో పనిలేదు. అన్ని యాత్రలు వారిలోనే దర్శించ గలరు. బ్రహ్మ. భావంతో గాంచినపుడు విగ్రహముగాని, మరెట్టి ప్రతిమగాని పరమాత్మ స్వరూపంగ భాసిల్లుతుంది.