కావలసిన పదార్థాలు:
బొంబాయి రవ్వ: 1glass
ఉల్లిపాయ: 2
క్యారెట్: 1
టొమాటో: 1
బంగాళాదుంప: 1
బీన్స్: 1cup
కాలీఫ్లవర్ ముక్కలు: 1/4cup
పచ్చిమిర్చి: 4
ఆవాలు: 1tsp
శెనగపప్పు :1tsp
మినప్పుప్పు : 1tsp
మిరియాల పొడి :1tsp
అల్లం ముక్క : చిన్నది
కరివేపాకు : రెండు రెమ్మలు
నూనె: తగినంత
నెయ్యి :1tsp
ఉప్పు : రుచికి సరిపడా
నీరు: 2glasses
తయారు చేయు విధానం:
1. ముందు కూరగాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి చిన్ని గిన్నెలో వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాతన పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యక రవ్వను అందులో వేసి దోరగా, పచ్చివాసన పోయే వరకు వేయించాలి.
2. స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడిచేసి అందులో శెనగపప్పు, మినప్పుప్పు, ఆవాలు, కరివేపాకు వేయాలి.
3. వేగాక ఇప్పుడు ఉల్లిపాయ, అల్లం,టొమాటో, పచ్చిమిర్చి ముక్కలను ఒకదానిక తర్వాత ఒకటి వేసి దోరగా వేయించాలి. రంగు మారాక కూరగాయ ముక్కలను అందులో వేయాలి.
4. కూరగాయ ముక్కలు కొద్దిగా వేగాక నీరు, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. నీళ్లు మరుగుతుండగా ఉప్మా రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలపాలి. దగ్గరగా అయ్యాక దించేసుకోవాలి. అంతే వెజిటెబుల్ ఉప్మా రెడి. దీనికి పల్లీల చట్నీ లేదా నిమ్మకాయ ఊరగాయతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
వావ్!! చదువుతుంటేనే నోరూరిపోతోంది…రేపు మా ఇంట్లో టిఫిన్ ఇదే!!
bale unnayandi vantalu .cheera kattu adhirindhi
Good, but no need to boil the vegetables first, you can mix them alongwith tomato. try this , you wont feel bad. thanks.
వావ్ ఉప్మా కూడా తినని తెలుగు వాళ్ళు భూమ్మీద వున్నారంటేనే హాశ్చర్యం
ఉప్మానే కాదు అసలు రోజు ఏమి తినడానికి దొరకని వాళ్లుకూడ ఉన్నారండి! నా ఉప్మాని అలా తీసిపడేస్తారా! కూరలువేసి ఎలా చేస్తారో వివరిస్తే మరి ఇంతల్లానా!
మీ ఉప్మాకేమండి బాగుంది, తెలుగునాట ఉప్మాను రాష్ట్రీయ టిఫెంగా ప్రకటించాలి అని నా డిమాండ్. ఆ పైన ఎవరో మరీ మొగం వాచినట్టు వావ్ ఈరోజు ఉప్మా చేసుకుంటాము అని ఎగ్జైట్ ఐతేనూ అలా అనిపించింది. ఉప్మాతో పెసరట్టు తినేవారికి కనీసం 3నెల్ల కారాగారం విధించాలి. అది ఉప్మా రుచి పాడుచేసే దుశ్చర్య, కుట్ర అంటాను.