మెహంది డిజైన్స్ అట్లతద్ది సందర్భంగా

అట్లతద్ది రేపే తెలుసా?

అట్ల తద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొంటారు. “అట్లతద్దె ఆరట్లు ముద్దపప్పు మూడట్లు” అంటూ ఆడ పడుచులకు బంధువులకు ఇరుగు పొరుగులకు వాయినాలివ్వటం పరిపాటి. సాయం సమయమందు వాయినలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి, అటునుండి చెరువులలో కాలువలలో దీపాలను వదలి, చెట్లకు ఊయలలు కట్టి ఊగటం చేస్తుంటారు.

గౌరీదేవి శివుని పతిగా పొందాలనే కృత నిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు. ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్ది వ్రతం చేయమని నారదుడు సూచించాడు. ఆయన ప్రోద్బలంతో పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతద్ది. ఇది స్ర్తీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం కన్నెపిల్లలు పడచువాణ్ణి పతిగా పొందాలనుకుంటే తప్పక ఆచరించవలసిన వ్రతమిది.

‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూడట్లోయ్’ అంటూ ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగుపొరుగువారికి అట్లు వాయనంగా ఇవ్వటం ఆచారం. చెట్టుకు ఉయ్యాలలు కట్టి ఊగుతారు.

ఆశ్వయుజ బహుళ తదియనాడు చేసుకునే ఈ పూజ ప్రధానంగా చంద్రుని ఆరాధనకు సంబంధించినది. చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత స్ర్తీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రం చెబుతోంది.

ఈ నోములో అమ్మవారికి అట్లు నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం ఉంది. నవగ్రహాలలో ఒకడైన కుజునికి అట్లంటే ప్రీతి. వీటిని ఆయనకు నైవేద్యంగా పెడితే కుజుని వలన కలిగే దోషాలు పరిహారమై, సంసారసుఖంలో ఎటువంటి అడ్డంకులు రావనేది ఒక విశ్వాసం. అంతేకాక కుజుడు రజోదయానికి కూడా కారకుడు కనుక ఋతుచక్రం సరిగా ఉంచి ఋతుసమస్యలు రానివ్వకుండా కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలుండవు. మినుముల పిండి, బియ్యప్పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకి, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు పోవడం కోసం, గర్భస్రావం కాకుండా సుఖప్రసవం అయ్యేందుకు ముత్తయిదువులకు అట్లను వాయనంగా ఇస్తారు. అట్లతద్దిలో ఇంతటి వైద్యవిజ్ఞానం ఉంది.

ఈ రోజు తెల్లవారుఝామునే స్ర్తీలు మేల్కొని స్నానం చేయాలి. పగలంతా ఉపవాసం ఉండాలి. ఇంట్లో తూర్పుదిక్కున గౌరీదేవికి మంటపం ఏర్పాటు చేయాలి. ధూప, దీప, నైవేద్యాలు పెట్టి ముందుగా గణపతిపూజ చేయాలి. పిదప శాస్త్రోక్తంగా గౌరీదేవికి పూజచేసి, ఆ తరవాత గౌరీ స్తోత్రం, శ్లోకాలు చదవడంతో పాటు, పాటలు పాడాలి. సాయంత్రం చంద్రదర్శనం అయిన తరవాత శుచిగా స్నానం చేసి మళ్లీ గౌరీపూజ చేయాలి. 11 అట్లు నైవేద్యంగా పెట్టాలి. ముత్తయిదువులకు అలంకారం చేసి 11 అట్లు, 11 ఫలాలు వాయనంగా ఇచ్చి అట్లతద్ది నోము కథ చెప్పుకుని అక్షతలు వేసుకోవాలి.

పేరంటానికి వచ్చిన ముత్తయిదువులకు నల్లపూసలు, లక్కకోళ్లు, రవికలగుడ్డలు, దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనాలు పెట్టి, తామూ భోజనం చేయాలి. 11 రకాల ఫలాలను తినడం, 11 సార్లు తాంబూలం వేసుకోవడం, 11 సార్లు ఊయల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం, ఇందులో విశేషం. ఇవన్నీ చేయడం వలన గౌరీదేవి అనుగ్రహం లభిస్తుందని, కన్యలకు గుణవంతుడైన భర్త లభిస్తాడని, పెళ్లయిన వారికి పిల్లలు కలుగుతారని, ఐదవతనంతో పాటు పుణ్యం లభిస్తుందని తరతరాల నుంచి వస్తున్న నమ్మకం. ఈపండగనే ఉయ్యాలపండగ లేదా గోరింటాకు పండగ అని అంటారు.

అట్లతద్దినాడు పిల్లల హడావుడి అంతా ఇంతా కాదు. ముందు రోజు చేతులకి గోరింటాకు పెట్టుకుంటారు. మరుసటి రోజు ఉదయమే చద్దెన్నం తినాలి కనుక ముందురోజు రాత్రి అన్నం వండుకుంటారు. ఇంకా గోంగూర పచ్చడి, ఉల్లిపాయ పులుసు, నువ్వులపొడి, గడ్డపెరుగు సిద్ధం చేసుకుంటారు. అట్లతద్దె రోజున తెల్లవారు ఝామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని, ఇరుగుపొరుగు పిల్లల్ని నిద్ర లేపడానికి ముద్దపప్పోయ్, మూడట్లోయ్, పీట కింద పిడికెడు బియ్యం, పిల్లల్లారా, జెల్లల్లారా లేచి రండోయ్…’ అని పాడుకుంటూ వెడతారు. అందరూ కలిసి చె ట్లకి వేసిన పెద్దపెద్ద ఉయ్యాలలు ఊగుతారు. ఆ తరవాత ఇళ్లకి వచ్చి అన్నాలు తిని తాంబూలం వేసుకుంటారు. ఎవరి నోరు ఎరగ్రా పండితే వారికి అంత మంచి మొగుడొస్తాడని ఒకరితో ఒకరు పరాచికాలాడుకుంటారు. ఆ తరవాత స్నానాదులు చేసి అట్లు వేసి ఒకరికొకరు వాయనాలిచ్చుకున్న తరవాత తింటారు. ఇది కన్నెపిల్లలంతా ఎంతో సంతోషంగా చేసుకునే పండుగ. తెల్లవారు ఝామునే లేవటం, పిల్లలతో కలిసి ఆడుకోవటం, పేరంటం చేస్తూ అందరితో సరదాగా ఉండటం పిల్లలకు అలవాటవుతాయి.

మా చిన్నప్పుడు పొద్దున్నే చద్దన్నం తినడానికి ఒకటే పేచి. కాని కొంత వయసు వచ్చాక మాత్రం అట్లతద్ది అర్ధం తెలిసాక ఎప్పుడు నలుగావుతుందా అని చూసే వాళ్ళం.

చలికాలం దగ్గర పడే సమయం కావడంతో పొద్దున్నే లేవలేకపోతారు. ఈ పండగ కారణంగా ఉత్సాహం కొద్దీ ఉదయమే లేవడం అలవాటు చేసుకుంటారు. అలాగే చలి నుంచి శరీరానికి వేడి పుట్టే ఆహారం కూడా ఆ రోజున తీసుకోవడం వల్ల ఆరోగ్యపుష్టికి దోహదపడుతుంది. నువ్వులపొడి, గోంగూర పచ్చడి, పెరుగు వంటివి శరీరానికి వేడి చేస్తే ఉల్లిపాయపులుసు చలవ చేస్తుంది. అంతేకాక అన్నీ చద్దివి తినడం వల్ల అరగదనే భయం కూడా లేకుండా తాంబూల సేవనం కూడా జరుగుతుంది. ఈ పండుగ ఆనంద, ఆరోగ్యాలను కలుగచేస్తుంది. ఆటపాటల వల్ల పిల్లలకి మంచి వ్యాయామం కూడా అవుతుంది.

ఇంత చక్కని వ్రతాన్ని మీరుకూడా చేసుకుంటారు కదూ!

ఎలా download చేయాలో కాస్త చెప్తారా?

మా నాన్నగారికి సంగీతం అంటే బాగా ఇష్టమండి
Kunnakudi Vaidyanathan (http://www.raaga.com/channels/carnatic/singers/Kunnakudi_Vaidyanathan.html), U. Srinivas http://www.raaga.com/channels/carnatic/singers/U._Srinivas.html
మా నాన్నగారికి పండగ సందర్భముగా albums ఇద్దామని నా కోరిక. అవి ఎక్కడి నుంచి download చేసుకోవచ్చో కాస్త చెబుతారా? నాకు తెలిసున్నవాళ్ళని అడిగా, ఎవరు చెప్పలేక పోయారు. రాగా(raaga) లోంచి ఎలా download చేయాలో తెలిస్తే దయచేసి చెప్పండి
లేక ఎక్కడినుంచి అయిన సరే ఎలా download చేయాలో కాస్త చెప్తారా? or send me link please.

అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికా డంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీప్తికా చుంబిత దిగ్విభాగ శ్రుతిసూక్త వివిక్త నిజ ప్రభావ భా వాంబర వీధి విశ్రుత విహారి ననుం గృపఁచూడు భారతీ!

రేపు తేది: 13-10-2010 వారము బుధవారము తిధి: అశ్వీజ శుద్ద షష్టి(ములానక్షత్రం) అలంకరణ: సరస్వతీ దేవి

అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికా

డంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీప్తికా

చుంబిత దిగ్విభాగ శ్రుతిసూక్త వివిక్త నిజ ప్రభావ భా

వాంబర వీధి విశ్రుత విహారి ననుం గృపఁచూడు భారతీ!

సరస్వతి నమస్తుబ్యం వరదే కామ రూపిణి
విద్యారంబం కరిష్యామి సిద్ధిర్భవతు మే సద

పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణిని
నిత్యం పద్మాలయా దేవి సామాంపాతు సరస్వతి

యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వర దండ మణ్డిత కరా యా స్వేత పద్మస్థితా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రబృతిభిర్ దేవైస్సదా పూజితా
సా మాంపాతు సరస్వతీ భగవతీ నిస్సేష జాడ్యాపహా

గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురుదేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః

సర్వ మంగళ మాన్గాల్యే శివే సర్వార్దాసారకే
శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే

విష్ణు ప్రియే నమస్తుబ్యం నమస్తుబ్యం జగద్వదే
ఆర్తహంత్రి నమస్తుబ్యం నమస్తుబ్యం కురుమే సదా
నమో నమస్తే మాహం మాయే శ్రీ పీటే సురపూజితే
శంకు చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే.

This slideshow requires JavaScript.


రేపు మూలా నక్షత్రం కనుక మీ పిల్లలచేత సరస్వతి పూజ చేయించండి. మా చిన్నప్పుడు మా అమ్మ సరస్వతి పూజ చేయించేది.School లో కూడా మా చేత సరస్వతి పూజ చేయించేవారు. సాయంత్రం మళ్ళి గుళ్ళో కూడా చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు English studies పుణ్యమా అసలు పూజ అంటే ఏంటో కూడా పిల్లలకి తెలియట్లేదు.

మరి ఇలాగైతే ఎలాండి?

మొన్న పాడుతా తీయగా చూసారా? వందేమాతరం గీతాన్ని ఎవరు రాసారు అని బాలసుబ్రహ్మణ్యంగారు అడిగితే ఒక్కళ్ళు కూడా చెప్పలేక పోయారండి. ఇక వీళ్ళని ఏమనాలో తెలియట్లేదండి? ఇంతకీ రాసింది ఎవరో మీకన్నా తెలుసా? వద్దులెండి నేనే చెబుతాను బంకించంద్ర చటర్జీ.

సినిమా పాటల గురించి అడిగితె బానే చెబుతారు నేటి తరం. ఇలాంటివి అడిగామో మనమే మర్చిపోవాలి అంతే!

భోజనం తరువాత తప్పకుండా ఇవి పాటిస్తారు కదూ!

భోజనం తరువాత చేయకూడని ఆరు ముఖ్యమైన పనులు
1) DON’T SMOKE: ధూమపానము చేయరాదు. భోజనము చేసినతరువాత ఒక cigarette కాల్చితే పది cigarettesకు సమానము అని చెబుతున్నారు. కాన్సెర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయట.
2) DON’T EAT FRUITS: పళ్ళు తినకూడదు. భోజనము చేసిన తరువాత పళ్ళు తినడం వలన కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది. అందుకే పళ్ళు తినాలనుకునేవారు రెండు గంటలు ముందు కానీ తరువాతగాని తింటే మంచిది.
3) DON’T DRINK TEA: టీ తాగకూడదు. టీవలన పెద్దమొత్తంలో ఆసిడ్ విడుదల చేసి ఆహరం జీర్ణం అవ్వడం కష్టంఅవుతుంది.
4) DON’T LOOSEN YOUR BELT: బెల్టు లూస్ చేయకూడదు(పెట్టుకునే వారు) దీనివల లోపల ఎక్కడన్నా ఇరుక్కున్న ఆహరం సరిగ్గా జీర్ణం కాదు.
5) DON’T BATH: స్నానం చేయకూడదు. భోజనం చేసినవెంటనే స్నానం చేస్తే రక్తం అంతా చేతులకి కళ్ళకి మొత్తం ఒంటికి పాకి, పొట్ట దగ్గర రక్తం తగ్గిపోయి జీర్ణప్రక్రియని నెమ్మది చేస్తుంది. దీనివల జీర్ణ వ్యవస్థ సామర్ధ్యం తగ్గిపోతుంది.
6) DON’T SLEEP: నిద్ర పోకూడదు. భోజనం చేసిన వెంటనే పడుకుంటే ఆహరం సరిగ్గా జీర్ణం అవ్వక gastric & infection వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. మాములుగా భోజనం చేసిన వెంటనే ఎవరికైనా సరే నిద్ర వస్తుంది. తప్పకుండా పడుకోవాలి అంటే ఒక పదిహేను నుండి ఇరవైనిముషాలు కంటే ఎక్కువగా పడుకోకుండా ఉంటె మీ ఆరోగ్యానికి మంచిది అంటున్నారు డాక్టర్లు.

తప్పకుండా ఇవన్ని పాటిస్తారు కదూ!
TAKE CARE.