కావలసిన పదార్ధాలు:
పనీర్ ముక్కలు: 1cup
అల్లం వెల్లుల్లిపేస్ట్: 2tbsp
పచ్చిమిర్చి పేస్ట్: 1tbsp
పసుపు: చిటికెడు
కారం: 1tsp
ధనియా పౌడర్: 1tsp
టమోటో: 1
క్యాప్సికమ్: 2
మెంతి ఆకులు: 1
గరం మసాలా: 1
ఉప్పు: రుచికి సరిపడా
నెయ్యి: 1
కొత్తిమీర : గార్నిష్ కి సరిపడా
తయారు చేయు విధానము:
1. పాత్రలో నూనె వేడయ్యాక, పనీర్ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించి తీయాలి. గోరు వెచ్చని నీటిలో పనీర్ ముక్కలు వేసి 3నిమిషాలు వుంచి నీటిని వంపేయాలి.
2. అదే పాత్రలో అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా వేయించాలి తర్వాత అందులోనే దనియాల పొడి, కారం, పసుపు, క్యాప్సికమ్ ముక్కలు, ఒకదానితర్వాత ఒకటి వేసి బాగా వేయించాలి.
3. ఇప్పుడు టమోటా ముక్కలు కూడా అందులో వేసి కలిపి, మూత పెట్టి మరికొద్దిసేపు వేయించాలి.
4. పనీర్ ముక్కలు జత చేసి అయిదు నిమిషాలు వేయించాలి, గరం మసాలా, మెంతి వేసి కలిపి దింపేయాలి.
5. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడి చపాతీల్లోకి వడ్డిస్తే చాలా రుచి గా ఉంటుంది.
బాగనే చెప్పినారు. “కారం: 1tsp వేసి తెలుగోడి టచ్ కూడా ఇచ్చినారు”. అయితే మీరన్న మొదటి పాయింటొక్కసారి చూడండి.
**1. పాత్రలో నూనె వేడయ్యాక, పనీర్ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించి తీయాలి. గోరు వెచ్చని నీటిలో పనీర్ ముక్కలు వేసి 3నిమిషాలు వుంచి నీటిని వంపేయాలి.***
పనీర్ ముక్కల్ని నూనెలో వేయించింతర్వాత నీళ్ళలో వేయడం!!!???.
అవునండి బాగానే రాసాను కదా! వేయించడమువలన మంచి రుచి ఉడికించడమువలన చక్కగా ఉడుకుతుంది. దీనిలో ఎక్కువగా నీరు పోయము కదండీ. అందుకే ముందుగ ఉడికించమనేద. అర్ధంఅయ్యింది అనుకుంటాను.
మీరు చేసుకుని తిన్న తరువాత రుచి ఎలా వుందో చెప్తారు కదూ!
nenu kuda superrr ani chapanu why because nenu enka chayaladu chasathanu