వీటికి సమాధానము ఇవ్వగలరా?

పచ్చని గుడిలో ఎర్రని రత్నాలు?

పుట్టినా కదలనిది ఏది?

బొట్టు కాని బొట్టు ఏమి బొట్టు?

భయం కాని భయం?

మల్లపు గుర్రానికి ఒళ్ళంతా రంధ్రాలు?

మాతాత ఏటి అవతలికి వెళ్ళి మూడెడ్లను తెచ్చాడు. ఒకటి కరిగేది, ఒకటి తేలేది, ఒకటి మునిగేది?

మనతో వస్తుంది, మనకు చెప్పకుండానే వెళ్తుంది?

బిళ్ళ కాని బిళ్ళ, లోకం కోరే బిళ్ళ?

బారుగాని బారు! ఏమి బారు?

బడి గాని బడి! ఏమిబడి?

బంగారు చెంబులో, వెండి గచ్చకాయ?

జవాబులు రేపటి టపాలో వ్రాస్తాను.

రవ్వ భక్ష్యాలు

కావలసిన పదార్ధాలు:
బొంబాయి రవ్వ: 1cup
పంచదార: 1cup
నీరు: 2cup
పాలు: 1cup
యాలకులు పొడి: 1tsp
జీడిపప్పు: 10
మైదా: 100grms
నెయ్యి: 100grms
ఆయిల్: 2tbsp

తయారు చేయు విధానము:
1. మైదాను తగినంత నీటితో ఓలిగలకు(బొబ్బట్లు) కలిపినట్లుగానే కలిపి పక్కన పెట్టుకోవాలి.
2. పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసి జీడిపప్పును వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో రవ్వను కూడా వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
3. ఒక గిన్నెలో నీటిని, పాలను వేసి అవి మరిగాక వేయించి ఉంచిన రవ్వను వేసి కలుపుతూ ఉడికించాలి.
4. మిశ్రమం గట్టి పడిన తర్వాత ఏలకుల పొడి, పంచదార, వేసి కలుపుతూ ఉడికించి చివరగా జీడిపప్పు వేసి దించాలి.(ఫుడ్ కలర్ వేయకుండా కేసరి చేసినట్లుగా చేయాలి)
5. మైదాను చిన్న చిన్న పూరీలు గా చేసి అందులో కొద్దిగా రవ్వ మిశ్రమాన్ని పెట్టి ఓలిగలు(బొబ్బట్లు) వత్తినట్టే చేత్తో వత్తి పెనం మీద నూనె వేస్తూ దోరగా కాల్చాలి. అంతే రవ్వ భక్ష్యాలు రెడీ.

మ్యాంగో కేక్

కావలసిన పదార్ధాలు:
మైదా పిండి: 2 cups
మామిడిపండు ముక్కలు: 1cup
పంచదార: 1cup
నీళ్ళు:1/4cup
బేకింగ్ పౌడర్: 1tsp
వెనిల్లా ఎసెన్స్: 1tsp
పెరుగు: 2tbsp
వాల్ నట్స్: 1/2cup

తయారు చేయు విధానము:
1. మైదా పిండిన ఆయిల్ లేకుండానే రెండు నిమిషాలు పాటు, పచ్చివాసన పోయే వరకూ వేయించాలి.
2. 1/4cup నీళ్ళలో
పంచదార వేయాలి. బాగా కరిగిన తర్వాత అందులో బేకింగ్ పౌడర్, వెనిల్లా ఎసెన్స్, మామిడి పండు గుజ్జు, పెరుగు, వాల్ నట్స్ ముక్కలు వేసి బాగా కలపాలి.
3. తర్వాత పిండిని కొద్దికొద్దిగా అందులో వేస్తూ ముద్దలా కలుపుకోవాలి.
4. ఈ మిశ్రమాన్ని మైక్రో ఓవెన్ లో కానీ, కేక్ చేసే పాత్రలో కానీ వేసి ఉడికించాలి. ఫైనల్ గా క్రీమ్ తో గార్నిష్ చేసుకోవాలి అంతే మంచి రంగు, రుచికరమైనటువంటి మ్యాంగో కేక్ రెడీ.

బి.పి నివారణ కు స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీలలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మెదడు, నరాల రుగ్మతలు వచ్చే అవకాశాలను సమర్థవంతంగా నిరోధిస్తుంది. రక్తశుద్ధి చేస్తుంది. రక్తంలోని హానికర విష పదార్థాలను తొలగిస్తాయి            స్ట్రాబెర్రీలు.

ప్రతిరోజూ స్ట్రాబెర్రీలను తినడం వల్ల కాలేయ రోగాలు, కంటిచూపు మందగింపు, వాతరోగం, కీళ్లవాతం, మలబద్దకం, అధిక రక్తపోటు, మెదడు పనితీరు క్షీణించడం, చర్మ క్యాన్సర్ వంటి ఎన్నో రోగాలను దూరంగా ఉంచవచ్చు. స్పష్టమయిన ఆరోగ్య ప్రయోజనాల సంగతి అలా ఉంచితే, రోజూ 8 నుంచి 10 స్ట్రాబెర్రీలను తినడం వల్ల రక్తపోటు గణనీయంగా తగ్గుతుంది.

భవిష్యత్‌లో గుండెపోటు వచ్చే ప్రమాదం బాగా తగ్గుతుందని ఇటీవల అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అతిసార, వాతరోగం, జీర్ణక్రియ సమస్యలు స్ట్రాబెర్రీ ఆకులు, వేరులు తినడం వలన నయమవుతాయి.

స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున అల్జీమర్స్ (జ్ఞాపక శక్తి తగ్గడం) మెదడు పనితీరు క్షీణించడం వంటి వ్యాధులు వస్తే తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.

woman చూసి నవ్వుకోండి

మహిళని కిన్చపరచాడనికి కాదు just for joke

And Finally! last one

Have you ever wondered how a woman’s brain works?
Well….it’s finally explained here in one, easy-to-understand illustration:


ఆహా ఎంత బాగా వున్నాయో ఇవన్ని చేతులతో చేసినవే

అమితభ్ బచన్ ఎలా ఆరోగ మరారంటే ఇది చుడండి.


ఇంక అస్సలు తగ్గవంటార?

ఇలా అయితే ఇంక ఎలాగండి నాలాగ నగలు కొనుక్కోవాలనుకునే వాళ్ళ సరదా ఎప్పుడు తీరుతుంది. అసలు ధరలు దిగి రావని ఇంక పెరిగిపోతాయని మా ఆఫీసులో పొద్దునించి మీటింగ్ లే మీటింగ్లు. సారంశం   వింటుంటే బాధగా వుందండి. ఇంక అస్సలు తగ్గవంటార?
అంటే నేను ఏదో చాల కోనేద్దామని కాదు కాని ఏదో ఆశ తగ్గుతాయని ఏమంటారు? ఈ వార్తలు చదువుతుంటే నే బాధ వచేస్తోంది.

యూరో సంక్షోభం: మరింత పెరగనున్న బంగారం ధర!

యూరప్ దేశాల్లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా దేశీయంగా పసిడి ధరలు మరింత ప్రియం కానున్నాయి. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర 19 వేల రూపాయలు పలుకుతోంది. యూరో సంక్షోభంతో పాటు దేశంలో పెళ్లిళ్ల సీజన్ ఆరంభంకావడంతో బంగారం ధరలకు మరింత రెక్కలు రానున్నాయి. మున్ముందు పది గ్రాముల బంగారం ధర 20 వేల రూపాయలకు చేరవచ్చని పసిడి వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.

యూరో ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా పెట్టుబడిదారులు తమ నగదు రక్షణకు భరోసా ఉండే ప్రాంతంలో పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వాటిలో బంగారం కొనుగోలుపై వారు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఇటీవలి కాలంలో దేశ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైన విషయం తెల్సిందే.

దీంతో అనేక మంది షేర్ హోల్డర్లు, పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లో తమ నగదును ఉపసంహరించుకుని బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. వచ్చే 15 రోజుల పాటు పది గ్రాము బంగారం ధర రూ.18000-19000 మధ్యలో ఉండవచ్చని ఎస్ఎంసి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ జైన్ తెలిపారు. అయితే, యూరో జోన్‌లో పరిస్థితి చక్కబడని పక్షంలో వీటి ధర రూ.20 వేలకు చేరవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.