స్త్రీ అందానికి ప్రతి రూపం. ఆ అందం నాజూకైన చర్మంతో మరింత ఇనుమడిస్తుంది. చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉండటమే కాకుండా శుభ్రంగాను ఉంచుకునేందుకు ప్రయత్నించాల్సి వుంటుంది. కాని నేటి ఆధునిక కాలంలో చాలామంది మహిళలు, తమ చర్మసౌందర్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచలేక పోతున్నామని తెగ ఆందోళన పడుతుంటారు. అలాంటి వారు కాసింత సమయం కేటాయించి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి….
చర్మాన్ని రోజుకు 2-3సార్లు శుభ్రపరుస్తుండాలి. దీంతో ముఖంపైనున్న స్వేదగ్రంధులు శుభ్రమై మరింత నిగారింపును సంతరించుకుంటుంది. రాత్రి పడుకునే ముందు ముఖాన్ని క్లీనర్స్‌తో శుభ్రపరచుకోండి.
ముఖంపై మొటిమలుంటే వాటిని గోళ్ళతో గిల్లకండి. రాత్రి పడుకునే ముందు క్రమం తప్పకుండా యాంటీ బ్లెమిశ్ సొల్యూషన్ లేదా యాంటీసెప్టిక్ క్రీమ్ వాడండి.
వయసుకు తగ్గట్టు ప్రత్యేక శ్రద్ధ :
ప్రతి మహిళ 25 సంవత్సరాల తర్వాత శరీర చర్మంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాల్సివుంటుంది. చర్మంలో ప్రకృతిపరంగానున్న నిగారింపు తగ్గుతుంది. దీంతో అప్పుడే వయసు పైబడినట్లు చాలామంది ఆందోళన చెందుతుంటారు. దీనికి క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్‌ను వాడాలి. స్వేదరంద్రాలు శుభ్రంగా ఉండేందుకు ఎసంట్రజెంట్ లోషన్ ముఖానికి అప్లై చేస్తుండాలి. దీంతో చర్మం ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది.
నలభై సంవత్సరాల వయసు వచ్చే సరికి చర్మంలో నిగారింపు తగ్గడంతోపాటు చర్మంలో ఇదివరకున్న నూనె శాతం తగ్గిపోతుంది. దీంతో చర్మం పొడిబారినట్టు కనబడుతుంది. కాబట్టి ముఖాన్ని ఫేస్ వాష్‌తో శుభ్రపరుస్తు ఉండాలి. ఆ తర్వాత విటమిన్ ఈతో కూడుకున్న క్రీమును ప్రతిరోజు ముఖానికి మాలిష్ చేయాల్సివుంటుంది. ప్రతి 15 రోజులకోసారి ఫేషియల్ చేయాల్సివుంటుంది. దీంతో చర్మం నిగారింపును సంతరించుకుని ఆరోగ్యంగా తయారవుతుంది.
యాభై సంవత్సరాల తర్వాత చర్మంలో పటుత్వం కోల్పోతుంది. దీంతో చర్మంపై ముడతలు ఏర్పడటం ప్రారంభమౌతుంది. కాబట్టి చర్మాన్ని క్లీజింగ్ జెల్‌తో శుభ్రపరుస్తూవుండాలి. నియమానుసారం టోనింగ్తోపాటు చర్మంపై క్రీముతో మాలిష్ చేస్తుండాలి.
ఆయిల్ థెరపీః
నెలకు ఒకసారి ఆయిల్ థెరపీ చేసుకోవాలి. ఆయిల్ థెరపీ కొరకు 2 చెంచాల బాదం నూనె, 2 చెంచాల కొబ్బరి నూనెను కలుపుకుని వేడి చేసుకోవాలి. పత్తితో మీ మూఖాకృతిని తయారు చేసుకోండి. గోరువెచ్చగావున్న ఈ మిశ్రమాన్ని ముఖాకృతిని తయారు చేసుకున్న పత్తిని తడపండి. నూనెలో తడిపిన పత్తిని ముఖంపై మెల్లగా పెట్టుకోండి. పత్తి చల్లగా తయారయ్యేంత వరకు మీ ముఖంపై అలాగే ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటిలో ముంచిన పత్తిని ముఖంపై ఉంచండి. దీంతో మీ ముఖారవిందం మరింత నిగారింపును తెస్తుందనడంలో సందేహం లేదు.
విపరీతమేన ఎండలో తిరిగితే చర్మానికి చాలా ప్రమాదం. కాబట్టి మీ శరీర చర్మాన్ని ఎండ నుంచి కాపాడుకునేందుకు సన్ స్క్రీన్ లోషన్‌ను పూయండి. చర్మంలో నాజూకుదనంతోపాటు నిగారింపు ఉంటుంది.
U r web site is so nice.