తొలిచూపు, తొలి సిగ్గుల నవ్వు, తొలి స్పర్శ, తొలి కౌగిలి… వీటిని మరిచి పోవడం సాధ్యమేనా…?! అసలు ఈ ప్రశ్న తలెత్తే అవకాశం ఎందుకు వస్తుందీ… అని చాలామంది ప్రేమికులు అనుకుంటారు. కానీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిని లేదా ప్రియుడిని తప్పనిసరి పరిస్థితుల్లో వదిలి వేరే వ్యక్తితో పెళ్లి చేసుకోవలసిన పరిస్థితి తలెత్తితే… ఏమిటి పరిస్థితి..?
ఇలా విడిపోయిన ప్రేమికుల్లో నూటికి 40 నుంచి 50 శాతం తొలిప్రేమనాటి తాలూకు జ్ఞాపకాలను వదలలేక వాటిని గుర్తు తెచ్చుకుంటూ తృప్తి చెందుతుంటారని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. అసలు తొలిప్రేమ, తొలి స్పర్శకు ఎందుకంత ప్రాముఖ్యం అని పరిశోధకులు లోతుగా అధ్యయనం చేసినపుడు పలు ఆసక్తికర అంశాలు వెలికి వచ్చాయి.

తొలిప్రేమతో దగ్గరైన ప్రేమ జంట మధ్య జరిగే శారీరక స్పర్శలను ఆయా వ్యక్తుల జ్ఞానతంత్రులు ఎన్నటికీ విడిచిపెట్టవు. దీంతో నాటి స్పర్శా ముద్రలు ప్రేయసీప్రియులను పట్టుకుని అనుక్షణం వేధిస్తాయి. తొలిప్రేమనాటి ఆలోచనలతో మనస్సును ఆక్రమించేస్తాయి. అందుకే ఒక్కసారి ప్రేమలో పడితే.. ఇక వారి ముందు మరొక అందమైన వ్యక్తిని తీసుక వచ్చి కూర్చుండబెట్టినా మలిప్రేమ పుట్టే ఛాన్సేలేదు. పరిశోధకులు. ఒకవేళ అలా రెండో వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తున్నట్లయితే అతడు/ఆమె యొక్క తొలిప్రేమ నిజమైనది కాదని అంటాను. కనుక తొలిప్రేమ చాలా దృఢమైనదన్నమాట.
తొలిప్రేమ కి నంబర్ 1 రాంకు ఇచ్చేద్దాం…తొలి ప్రేమ కే కాదు తొలి అనుభవానికి దేనికైనా..
కానీ తొలిప్రేమ తరువాత విడిపోయి ఓ ఐదేళ్ళ తరువాత మలిప్రేమ పుడితే, ఈ మలిప్రేమ “ప్రేమ కాకుండా ఎందుకవ్వుతుందో అర్ధం కాలా”. బహుశా ప్రేమ అంటే ఒకటే, అది అన్నిటికన్నా బలీయమైన భావ తీవ్రత కలిగి ఉండాలి అని మీరు అనుకుంటున్నారనుకొంటా….
అంతే కదండీ మరి
సెన్సిటివ్ గా వుండే వాళ్ళకు గానీ..ఎక్కడకక్కడ దుకాణాలు పెట్టే వాళ్ళకు ఇలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవండీ….
baaga chepparandi
correct ga chepparandi. modati prema nizamite eppatiki rendo prema puttadu.
toli prema, toli tuch, toli anubhavam gurunchi meeru cheppinavi correct is very nice
thank you