ఆడవాళ్ళకు చీరలోనే అసలైన అందం

చీరకట్టు ఎరగని భారతీయులుగానీ, చీరకట్టు అంటే ముచ్చటపడని విదేశీయులుగానీ లేరనడంలో సందేహం లేదు. ప్రతినిత్యం ఏదో ఓ కొత్తదనం కోసం పాకులాడుటం మానవనైజం. అవి కట్టు, బొట్టు విషయంలోకావచ్చు, వేరే ఏ ఇతర విషయాలలోనైనా కావచ్చు. చూస్తున్న ప్రతిసారి ఏదో కొత్త సొంపు, సోయగం, హుందాతనం కలిగి, మరుగునపడడం కాదు. కనీసం తెరమరుగున పడటం అంటే కూడా ఎరగని సిసలైన సాంప్రదాయక సౌందర్యం చీరదే. మన డిజైనర్లు కూడా చీరపై ఉన్న మక్కువతో, దాదాపు ప్రతి ప్యాషన్‌షోలోనూ ఒక మోడల్‌తోనో, సినీతారతోనో చీరతో క్యాట్‌వాక్‌ చేయిస్తున్నారు. డిజైనర్ల దాకా ఎందుకు. చీరలపై తమకు గల మక్కువను నాటి నుండి నేటి దాకా ఎందరో కవులు తేటతెల్లం చేసిన సంగతి అందరికీ విదితమే ”చీరగట్టి సింగారించి చెంగావి రంగుచీర, సరికొత్త చీర ఊహించినాను అంటాం. ఈ చీర పాటలు అందరి మనసులను అలరించాయి, కిన్నెరసాని వలపు చూడాలన్నా ఎంకి కడియం మెలగాలన్నా అది చీరకే సాధ్యం మరి.

ప్రాణమొచ్చిన బొమ్మకైనా కులుకు చెప్పే బొమ్మకైనా నిండుదనం చేకూర్చది చీరే. ఈ చీర గురించి చెప్పాలంటే మాటలేదు, చదవాలంటే భాషలేదు. ఎంత చెప్పినా ‘ఇంతేనా’ అనిపించే చరిత్ర మన చీరకుంది. నారచీర నుండి పట్టుచీర వరకూ దేని అందం దానిదే. దేని సోయగం దానిదే. పాశ్చాత్య నాగరికత మోజులో చీరకట్టుకోవడం కూడా చేతకాదంటూ అమాయకంగా ముఖం పెడుతోంది నేటియువత. పాపం వారిపై జాలితోనో లేక మన సంప్రదాయక సౌందర్యాన్ని ఎక్కడ మిస్‌ చేసుకోంటోరో అనే బాధతోనో తెలియదు కానీ మామూలు డ్రస్సులా, రెడీమేడ్‌గా చీరను ”తొడుక్కునే” విధంగా కూడా డిజైన్‌ చేశారు మన డిజైనర్లు. ప్రపంచ దేశాల్లో ఫ్యాషన్‌ రారాజుగా వెలుగొందుతున్న ప్యారిస్‌లో కూడా ఈ చీర కట్టుకు అభిమానులున్నారు.

భారతీయులమై కనీసం చీర కుట్టకోవడం నేర్చుకోవడం మన బాధ్యత. కాబట్టి అమ్మాయిలు చీర కట్టుకోవడం రాదని మాత్రం చెప్పకండీ. విదేశీయులు వింటే నవ్విపోతారు. చీర, చీర అంటున్నాం, అసలేంటీ చీర అంటే, దీర్ఘ చతురస్రాకారంలో ఉండే ఒక వస్త్రం మాత్రమే. ఐదు నుండి ఆరు గజాల పొడువుండి ఎటువంటి శరీరాకృతి కలవా రికైనా సరిపోయే గుణం దీనికుంది. చీరల రంగు, టెక్చర్‌, ప్రింట్స్‌, వర్క్స్‌ వీటిని బట్టి అవి ఏప్రాంతానివో ఇట్టే చెప్పొచ్చు. ఈ చీరను ఎన్నో రకాలుగా ధరించొచ్చు. చీర ధరించిన విధానాన్ని బట్టి ఆయా వ్యక్తుల హోదా, వయస్సు ఎన్నో అంచనా వేయొచ్చు.

చీరలు కొనడం నుండి, కట్టుకోవడం వరకు

హెవీ పర్సనాలిటీ ఉన్నవారు షిఫాన్‌, జార్జెట్‌ల్లో చీరలు ఎంపిక చేసుకొండి. హెవీ మైసూర్‌ శారీస్‌లో అందంగా, స్లిమ్‌గా కనబడతారు.

తక్కువ హైట్‌ ఉన్నవారు సన్నని బోర్డర్స్‌ ప్రిఫర్‌ చేసే మంచిది. అసలు బోర్డర్‌లేని చీరలు కూడా బాగుంటాయి. అలా కాకుండా హెవీ బోర్డర్స్‌ తీసుకుంటే ఉన్న దానికంటే స్మార్ట్‌గా కనబడతారు. కాబట్టి హెవీ బోర్డర్స్‌ తీసుకోపోవడం మం

సన్నటి వారు ఆర్గాన్‌జా, టిష్యూ, కాటన్‌, టస్సర్‌ శారీస్‌లో నిండుగా కనబడతారు.

ఫంక్షన్‌ వెళ్లాలనుకున్నప్పుడు ఒంటిపొరను పిన్‌ చేసి స్టైల్‌గా చేతిపై నుండి పట్టుకుంటే చాలా ఎలిగెంట్‌గా ఉంటుంది.

ఉద్యోగం చేసేవారు ఇలాంటి ప్రయోగాలు చేయకుండా ఫ్రిల్స్‌సెట్‌ చేసి పిన్‌ పెట్టడం మంచిది. ఆఫీసులో ఎలాంటి అన్‌యిజీ లేకుండా ఉండటమేకాకుండా సింపుల్‌గా, అందంగా ఉంటుంది.

శారీపై ఫ్రిల్స్‌ఉన్న పెట్టీకోట్‌ వాడకూడదు.

కాటన్‌ శారీ ధరించాలనుకునే వారు స్టార్చ్‌ పెట్టటం, ఐరన్‌ చేయటం మరిచిపోవద్దు, ఇలా చేస్తే కాటన్‌ చీర అందం పెరుగుతుంది. కట్టుకున్న వారికి హుందాతనం వస్తుంది.
చీరకట్టు తెలిసిన వారైతే ఈ చిన్నచిన్న సలహాలు పాటించి అందాన్ని పెంచుకోవచ్చు.

వెజిటేబుల్ కర్డ్ రైస్ విత్ మామిడి పండు కాంబినేషన్

కావలసిన పదార్ధాలు:
క్యారెట్: 1cup
కీరకాయ: 1cup
క్యాప్సికమ్: 1/2 cup
బీన్స్: 1/2 cup
పాలు: 1 cup
పెరుగు: 1cup
ఆవాలు: 1/2 tsp
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 4
అల్లం ముక్కలు: 1tsp
కరివేపాకు: 2 రెమ్మలు
ఆయిల్: 2tsp
ఇంగువ: చిటికెడు
మిరియాల పొడి: 1 tsp
అన్నం: 1cup
ఉప్పు: రుచికి సరిపడా
మామిడు పండ్లు

తయారు చేయు విధానము:
1. మొదటగా క్యారెట్, కీరకాయ, బీన్స్, క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ప్రక్కన పెట్టుకోవాలి.
2. ఒక కప్పు బియ్యం ను నీళ్లు పోసి శుభ్రం చేసి ఒక కప్పు నీళ్ళు, ఒక కప్పు పాలు పోసి కుక్కర్ లో రెండు విజల్ కు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. దీనిని ఒక బౌల్ లోనికి తీసుకొని స్సూన్ తో మొత్తాన్ని బాగా కలిపి పక్కన చల్లార పెట్టుకోవాలి.
3. తర్వాత స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడయ్యాక అందులో ఆవాలు, కట్ చేసి పెట్టుకొన్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని తీసి ఆరపెట్టుకొన్న అన్నంలో కలపాలి.
4. అదే పాన్ లో మరికొద్దిగా ఆయిల్ వేసి అందులో క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, అల్లం, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత కొద్దిగా పాలు పోసి 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఇంగువ, మిరియాల పొడి, ఉప్పు వేసి కలిపి పక్కకు దింపుకోవాలి.
5. ఉడికించిన మిశ్రమంలో 1 కప్పు పెరుగు వేసి బాగా కలిపి ముందుగా సిద్దం చేసుకొన్న అన్నం లో వేసి బాగా అన్ని ఐటమ్స్ మిక్స్ అయ్యే విధంగా కలపాలి. అంతే వెజిటబుల్ కర్డ్ రైస్ రెడీ. దీనికి మామిడి పండు మంచి కాంబినేషన్.

వెజిటేబుల్ బర్గర్

కావలసిన పదార్ధాలు:
పొటాటో(బంగాళదుంప): 3
క్యారెట్: 1cup(తురిమినది)
క్యాబేజ్: 1cup(చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినది)
బీన్స్: 1cup(చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినది)
బఠానీ: 1/2cup
పల్లీలు: 1/4cup(పొడి)
కొత్తిమీర:1/2 cup(కట్ చేసినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
కారం: 1tsp
మిరియాల పొడి: 1tsp
టమోట: 2
కీరకాయ: 1
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: కావలసినంత

తయారు చేయు విధానము:
1. పొటాటాలను ఉడికించి చిదిమి ప్రక్కన పెట్టుకోవాలి.
2. చిదిమిన పొటాటాని ఒక బౌల్ లోనికి తీసుకొని అందులో క్యారెట్ తురుము, క్యాబేజ్, కొత్తిమీర, పల్లీల పొడి, ఉడికించి పచ్చిబఠానీలు, బీన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మిరియాలపొడి, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా మిక్స్ అయ్యేలా కలిపి పెట్టుకోవాలి.
3. ఇలా కలిపిపెట్టుకొన్న మిశ్రమం నుండి కొద్ది కొద్దిగా తీసుకొని బాల్ లా తయారు చేసుకొని వాటి (రౌండ్ కట్ లెట్స్) వడలు లాగా తట్టుకోవాలి.
4. పాన్ స్టౌ పై పెట్టి వేడయ్యాక కొద్దిగా ఆయిల్ రాసి రెండు లేక మూడు కట్ లెట్స్ పాన్ మీద అమర్చి వేడిచేయాలి. తర్వాత రెండో వైపుకూడ త్రిప్పి వేడిచేయాలి.
5. ఇప్పుడు బ్రౌన్ గా వేడి చేసిన కట్ లెట్ ఒకదానిని తీసుకొని దాని పై కీరకాయ, టమోటా స్లైస్ ను పెట్టి దాని మీద కూడా ఒక కట్ లెట్ పెట్టాలి తర్వాత రెండు వైపులా(పైన, క్రింద) టోస్టెడ్ బర్గర్ బన్స్ పెట్టాలి అంతే వేడి వెజిటేబుల్ బర్గర్స్ రెడీ. దీనిని టమోటో సాస్ తో వేడిగా సర్వ్ చేయండి.

అందమైన్, నాజూకైన చర్మసౌందర్యం కోసం!!

స్త్రీ అందానికి ప్రతి రూపం. ఆ అందం నాజూకైన చర్మంతో మరింత ఇనుమడిస్తుంది. చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉండటమే కాకుండా శుభ్రంగాను ఉంచుకునేందుకు ప్రయత్నించాల్సి వుంటుంది. కాని నేటి ఆధునిక కాలంలో చాలామంది మహిళలు, తమ చర్మసౌందర్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచలేక పోతున్నామని తెగ ఆందోళన పడుతుంటారు. అలాంటి వారు కాసింత సమయం కేటాయించి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి….

చర్మాన్ని రోజుకు 2-3సార్లు శుభ్రపరుస్తుండాలి. దీంతో ముఖంపైనున్న స్వేదగ్రంధులు శుభ్రమై మరింత నిగారింపును సంతరించుకుంటుంది. రాత్రి పడుకునే ముందు ముఖాన్ని క్లీనర్స్‌తో శుభ్రపరచుకోండి.

ముఖంపై మొటిమలుంటే వాటిని గోళ్ళతో గిల్లకండి. రాత్రి పడుకునే ముందు క్రమం తప్పకుండా యాంటీ బ్లెమిశ్ సొల్యూషన్ లేదా యాంటీసెప్టిక్ క్రీమ్ వాడండి.

వయసుకు తగ్గట్టు ప్రత్యేక శ్రద్ధ :
ప్రతి మహిళ 25 సంవత్సరాల తర్వాత శరీర చర్మంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాల్సివుంటుంది. చర్మంలో ప్రకృతిపరంగానున్న నిగారింపు తగ్గుతుంది. దీంతో అప్పుడే వయసు పైబడినట్లు చాలామంది ఆందోళన చెందుతుంటారు. దీనికి క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్‌ను వాడాలి. స్వేదరంద్రాలు శుభ్రంగా ఉండేందుకు ఎసంట్రజెంట్ లోషన్ ముఖానికి అప్లై చేస్తుండాలి. దీంతో చర్మం ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది.

నలభై సంవత్సరాల వయసు వచ్చే సరికి చర్మంలో నిగారింపు తగ్గడంతోపాటు చర్మంలో ఇదివరకున్న నూనె శాతం తగ్గిపోతుంది. దీంతో చర్మం పొడిబారినట్టు కనబడుతుంది. కాబట్టి ముఖాన్ని ఫేస్ వాష్‌తో శుభ్రపరుస్తు ఉండాలి. ఆ తర్వాత విటమిన్ ఈ‌తో కూడుకున్న క్రీమును ప్రతిరోజు ముఖానికి మాలిష్ చేయాల్సివుంటుంది. ప్రతి 15 రోజులకోసారి ఫేషియల్ చేయాల్సివుంటుంది. దీంతో చర్మం నిగారింపును సంతరించుకుని ఆరోగ్యంగా తయారవుతుంది.

యాభై సంవత్సరాల తర్వాత చర్మంలో పటుత్వం కోల్పోతుంది. దీంతో చర్మంపై ముడతలు ఏర్పడటం ప్రారంభమౌతుంది. కాబట్టి చర్మాన్ని క్లీజింగ్ జెల్‌తో శుభ్రపరుస్తూవుండాలి. నియమానుసారం టోనింగ్‌తోపాటు చర్మంపై క్రీముతో మాలిష్ చేస్తుండాలి.

ఆయిల్ థెరపీః
నెలకు ఒకసారి ఆయిల్ థెరపీ చేసుకోవాలి. ఆయిల్ థెరపీ కొరకు 2 చెంచాల బాదం నూనె, 2 చెంచాల కొబ్బరి నూనెను కలుపుకుని వేడి చేసుకోవాలి. పత్తితో మీ మూఖాకృతిని తయారు చేసుకోండి. గోరువెచ్చగావున్న ఈ మిశ్రమాన్ని ముఖాకృతిని తయారు చేసుకున్న పత్తిని తడపండి. నూనెలో తడిపిన పత్తిని ముఖంపై మెల్లగా పెట్టుకోండి. పత్తి చల్లగా తయారయ్యేంత వరకు మీ ముఖంపై అలాగే ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటిలో ముంచిన పత్తిని ముఖంపై ఉంచండి. దీంతో మీ ముఖారవిందం మరింత నిగారింపును తెస్తుందనడంలో సందేహం లేదు.

విపరీతమేన ఎండలో తిరిగితే చర్మానికి చాలా ప్రమాదం. కాబట్టి మీ శరీర చర్మాన్ని ఎండ నుంచి కాపాడుకునేందుకు సన్ స్క్రీన్ లోషన్‌ను పూయండి. చర్మంలో నాజూకుదనంతోపాటు నిగారింపు ఉంటుంది.

జీర్ణ కోశ సమస్యలకు “టొమోటో”లతో చెక్..!!

ప్రకృతి సహజంగా లభించే తాజా పండ్లు, ఆకు కూరలు, కూరగాయలను తీసుకోవటంవల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రొటీన్లు తగిన మోతాదులో అందుతాయి. కూరగాయలలో ఒకటైన టొమోటోలను క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే.. జీర్ణాశయంలో అధికంగా తయారయ్యే ఆసిడ్లను నివారిస్తాయి. తద్వారా జీర్ణకోశ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

విటమిన్ సీ పరిమాణం అధికంగా ఉన్న టొమోటోలను ఆహారంలో భాగంగా తీసుకోవటంవల్ల అజీర్తి సమస్యలను అరికట్టవచ్చు. అలాగే వీటిలో ఎక్కువగా లభించే ఏ, సీ విటమిన్లు కంటిచూపును మెరుగుపరచటంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాగే టొమోటోలు దంతాలను దృఢపరచటంలో కూడా ఉపయోగపడతాయి.

టొమోటోలలో క్యాల్షియం, పాస్ఫరస్ లాంటి ఏడురకాల లవణాలు ఉన్నాయి. ఇవి రక్తాన్ని శుభ్రపరచటంలో, రక్తంలోని వ్యర్థ పదార్థాలను తొలగించటంలో కీలకపాత్ర పోషిస్తాయి. శరీరానికి శక్తినిచ్చే పిండి పదార్థాలు సైతం టొమోటోలలో అధికంగా లభిస్తాయి. ఈ పిండి పదార్థలలోని విటమిన్లు కాలేయాన్ని శుభ్రపరచటంలోనూ, కాలేయంలోని క్రిములను నిర్మూలించటంలోనూ శక్తివంతంగా పనిచేస్తాయి.

మాంసకృత్తులు, ఐరన్, పొటాషియం, సోడియం, సల్ఫర్, మెగ్నీషియం, క్లోరిన్, కాపర్‌లతోపాటు ఫోలిక్ ఆసిడ్, నియాసిన్, ఆక్సాలిక్ ఆసిడ్ లాంటి విటమిన్లు కూడా కలిగిన టొమోటోలు తిన్న రెండు గంటలలోపే జీర్ణమవుతాయి. వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేయటంలోనూ, పురుషుల్లో ప్రొస్టేట్ గ్రంథికి క్యాన్సర్ సోకకుండా ఆపటంలోనూ టొమోటోలు చక్కగా పనిచేస్తాయి.

పాలకూర మతిమరపును నివారించే మంచి ఔషదం!

మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజూ ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా పాలకూర. పోషకాహార నిధి అయిన పాలకూరలో లభించే ఫ్లేవనాయిడ్స్ వయసుతోపాటు వచ్చే మతిమరపును దూరం చేస్తాయి. పాలకూరలో పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్‌లు ఉన్నాయి. ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేస్తాయి.

పాలకూరలో లభించే విటమిన్ సి, ఏలు మరియు మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్లు క్యాన్సర్‌ను నివారించటంలో తోడ్పడతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్‌ను అదుపు చేయటంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. ఈ కూరలో ఇంకా క్యాల్షియం, సోడియం, క్లోరిన్, ఫాస్ఫరస్, ఇనుము, ఖనిజ లవణాలు, ప్రొటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ సీ‌ తదితరాలుంటాయి.

పాలకూరను ఆహారంలో ఎక్కువగా తీసుకునే వారికి ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని ఇటీవలి పరిశోధనల్లో సైతం వెల్లడయ్యింది. శరీరానికి అవసరమైన ఇనుము పుష్కళంగా ఉండే
పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది, జ్వరం, పిత్త, వాయు శ్వాస సంబంధిత రోగాలను కూడా పాలకూర దూరం చేస్తుంది. పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం కూడా అధికంగా ఉంది.

స్త్రీల సౌందర్యానికి కూడా పాలకూర ఎంతగానో తోడ్పడుతుంది. పాలకూరను వెజిటబుల్ సూప్‌లోనూ, చపాతీలు చేసుకునే పిండిలోనూ, పకోడీల పిండిలోనూ, పన్నీర్‌తో కలిపి వండే కూరల్లోనూ.. అనేక రకాలుగా వాడుకోవచ్చు. ఇతర ఆకుకూరల్లాగా పాలకూరను కూరలాగా, వేపుడు చేసుకుని కూడా తినవచ్చు. ఎలాగైనా సరే ప్రతిరోజూ తినే ఆహార పదార్థాలలో పాలకూరను భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

తొలిప్రేమ – తొలి ముద్దు – తొలి కౌగిలి మరువగలరా…?

తొలిచూపు, తొలి సిగ్గుల నవ్వు, తొలి స్పర్శ, తొలి కౌగిలి… వీటిని మరిచి పోవడం సాధ్యమేనా…?! అసలు ఈ ప్రశ్న తలెత్తే అవకాశం ఎందుకు వస్తుందీ… అని చాలామంది ప్రేమికులు అనుకుంటారు. కానీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిని లేదా ప్రియుడిని తప్పనిసరి పరిస్థితుల్లో వదిలి వేరే వ్యక్తితో పెళ్లి చేసుకోవలసిన పరిస్థితి తలెత్తితే… ఏమిటి పరిస్థితి..?
ఇలా విడిపోయిన ప్రేమికుల్లో నూటికి 40 నుంచి 50 శాతం తొలిప్రేమనాటి తాలూకు జ్ఞాపకాలను వదలలేక వాటిని గుర్తు తెచ్చుకుంటూ తృప్తి చెందుతుంటారని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. అసలు తొలిప్రేమ, తొలి స్పర్శకు ఎందుకంత ప్రాముఖ్యం అని పరిశోధకులు లోతుగా అధ్యయనం చేసినపుడు పలు ఆసక్తికర అంశాలు వెలికి వచ్చాయి.
తొలిప్రేమతో దగ్గరైన ప్రేమ జంట మధ్య జరిగే శారీరక స్పర్శలను ఆయా వ్యక్తుల జ్ఞానతంత్రులు ఎన్నటికీ విడిచిపెట్టవు. దీంతో నాటి స్పర్శా ముద్రలు ప్రేయసీప్రియులను పట్టుకుని అనుక్షణం వేధిస్తాయి. తొలిప్రేమనాటి ఆలోచనలతో మనస్సును ఆక్రమించేస్తాయి. అందుకే ఒక్కసారి ప్రేమలో పడితే.. ఇక వారి ముందు మరొక అందమైన వ్యక్తిని తీసుక వచ్చి కూర్చుండబెట్టినా మలిప్రేమ పుట్టే ఛాన్సేలేదు. పరిశోధకులు. ఒకవేళ అలా రెండో వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తున్నట్లయితే అతడు/ఆమె యొక్క తొలిప్రేమ నిజమైనది కాదని అంటాను. కనుక తొలిప్రేమ చాలా దృఢమైనదన్నమాట.

మీ చర్మపు నునుపుదనం తగ్గిపోతుందా

ఒక టీస్పూన్ తేనెకు గుడ్డులోని తెల్లసొన, గ్లిజరిన్‌ రెండు టీస్పూన్ల చొప్పున కలిపి.. చివరగా దానికి శెనగపిండి చేర్చి బాగా కలపాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌ వేసుకున్న పదిహేను నిమిషాల తర్వాత తొలగించి శుభ్రం చేసుకోవాలి. అలాగే గుడ్డులోని తెల్లసొనను ముఖానికి పట్టించండి. ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేస్తే.. వదులైన చర్మం గట్టిపడి, మృదువుగా మారుతుంది. అరకప్పు పుల్లటి పెరుగును చర్మానికి రాసుకుని మర్దనా చేయండి. ఇరవై నిమిషాల తరువాత వేడినీటితో కడిగేయాలి.

ఇలా చేస్తే ముఖం కోల్పోయిన తేమను పొందుతుంది. పొడిబారిన చర్మతత్వానికి ఇది చక్కగా పనిచేస్తుంది. తేనె రాసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. తేనె చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. అరకప్పు ద్రాక్షపండ్ల గుజ్జుకు మూడు టీస్పూన్ల నిమ్మరసం, ఒక టీస్పూన్ యాపిల్‌గుజ్జు, పావు కప్పు గుడ్డులోని తెల్లసొన కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాలయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

ఈ ప్యాక్‌ జిడ్డుచర్మతత్వానికి చక్కగా పనిచేస్తుంది. అలాగే గింజల్లేని టమోటా గుజ్జు పావు కప్పు, కీరదోస గుజ్జు ఒక టీస్పూన్, ఓట్‌మీల్‌ పొడి 4 టీస్పూన్లు, పుదీనా మిశ్రమం ఒక టీస్పూన్ తీసుకుని బాగా కలిపి ప్యాక్‌ వేసినా ఫలితం ఉంటుంది. ఇలా చేస్తే చర్మంపై ఉండే జిడ్డు తొలగిపోయి కాంతివంతం అవుతుంది.

ఇంట్లో ఉండే “పెరుగు” పెంచుతుంది మీ సౌందర్యాన్ని!!

ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకునే పెరుగు, మజ్జిగలో ఎన్నో రకాల పోషక విలువలు దాగున్నాయి. అవి ఆరోగ్యంతోపాటు అందాన్నికూడా ఇస్తాయి. అందుకనే పెరుగులో నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఓ 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగితే శరీరం, చర్మం మృదువుగా మారి కాంతివంతం అవుతాయి.

తలస్నానం చేసేందుకు ఓ గంట ముందుగా తలకు పెరుగును బాగా పట్టించి తలస్నానం చేసినట్లయితే.. మళ్లీ విడిగా కండీషనర్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. అలాగే పెరుగులో తేనెను కలిపి పూసినా చక్కని కండీషనర్‌లా ఉపయోగపడుతుంది. పెరుగులో శనగపిండిని కలిపి, నలుగుపిండిలా శరీరానికి పట్టిస్తే.. చర్మం, ముఖం మీదనున్న మృతకణాలు తొలగిపోతాయి.

ముల్తానీ మట్టిలో పెరుగును కలిపి, శరీరమంతటా అప్లై చేస్తే అది క్లెన్సింగ్ ఏజెంటులా పనిచేస్తుంది. పెరుగులో కాస్తంత చక్కెరగానీ లేదా ఉప్మా రవ్వగానీ వేసి బాగా కలిపి.. ముఖానికి పట్టించి మసాజ్ చేస్తే డెడ్ స్కిన్ తొలగిపోతుంది. పెరుగులో కాస్త పచ్చి పసుపును వేసి కళ్లచుట్టూ ఉండే నల్లటి వలయాలపై రాస్తే నలుపుదనం తగ్గుతుంది. ఎండలోంచి నీడలోకి వెళ్లగానే పెరుగులో ఐస్‌క్యూబ్‌లు వేసి ఆ మిశ్రమంతో ముఖానికి మసాజ్ చేస్తే ఎండకు కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది.