మారుతీ సుజుకీ సంస్థ మారిన ఆటోమొబైల్ ప్రమాణాల ప్రకారం భారత్ స్టేజ్-IV నిబంధనలకు అనుగునంగా సరికొత్త మారుతీ సుజుకీ ఆల్టో కారును విడుదల చేసింది. ఇంజన్ లో ఏ మార్పులూ చోటు చేసుకోని ఈ కారు769 సిసి ఇంజన్ సామర్థ్యంతో రూపొందింది. ఇంతకు ముందు వెర్షన్ కారులాగే ఈ కారు కూడా LX, LXI మరియు STD మోడళ్లలో లభ్యం అవుతుంది.
ఇక ఈ కారులో మార్పులు చేసుకున్నా కారు ధర మాత్రం పెరగకపోవడం విశేషం. ఈ కారు మునుపటిలాగే రూ 2.2 లక్షల నుండీ రూ 2.7 లక్షల మధ్యలో అందుబాటులో వుంటుంది.