వేసవి కాలం వస్తుందంటే చాలామందికి భయం వేసవిలో ఎండదెబ్బని అందరు తట్టుకోలేరు. ఎండదెబ్బకు చాలామంది బయటకు వెళ్లేందుకు వెనుకంజ వేస్తారు. చర్మం దెబ్బతింటుందనో, ముఖం కమిలిపోతుందనో భయం.. అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఎండను ధైర్యం ఎదుర్కొనవచ్చు. అందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. వ్యాయామం. తినే ఆహారం, వాడే కాస్మోటిక్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు భగభగ మండుతున్న ఎండలను సైతం ఎదుర్కొనవచ్చు. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వేసవి కాలంలో అందంగా, ఆరోగ్యంగా ఉండాలనుకునే యువతి యువకులు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో హాయిగా ఉండొచ్చు. దీనికోసం పెద్దగా శ్రామించాల్సిన అవసరం లేదు. వ్యాయామం. తినే ఆహారం, వాడే కాస్మెటిక్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వేసవి కాలంలోను కూల్‌గా, ప్రశాంతంగా గడపచ్చు.
వేసవిలో మంచినీరు ఎక్కువగా తాగాలి. ప్రతిరోజు భోజనానికి,మధ్యలో నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్దాలు, పండ్లు తీసుకోవాలి. దీనివల్ల దాహర్తి తీరడమే కాకుండా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా పండ్ల రసాలు వేసవి ఎండ తాపాన్ని తీరుస్తాయి. వేసవి కాలంలో సీజనల్ ప్రూట్స్గా పుచ్చకాయ, ద్రాక్ష మామిడి పండ్లు ఆపిల్, పైనాపిల్‌తో తయారు చేసే జ్యూస్‌లు తాగటం మంచిది. వేసవి కాలంలో కూడా మన బాడి ఫిట్నెస్ కోల్పోకుండా ఉండాలంటే శరీరంలో ఎప్పుడు తగినంత నీరు ఉండాలి. మంచినీళ్లు ఎక్కువగా తాగటమే కాకుండా పండ్ల రసాలు, నీటి శాతం అధికందా ఉండే పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుందని వేసవిలో పుచ్చకాయ అరగించడం ఉత్తమం. అలాగే కర్బూజా పుచ్చకాయలు, రెండు కూడా శరీరానికి మంచినీటిని అందించే పండ్లు ఇలాంటి ప్రూట్స్ వేసవిలో తీసుకోవడం ద్వారా శరీరంలో నీటి శాతాన్ని పెంచుకోవచ్చును. దీనివల్ల ప్రతిరోజు వ్యాయామం. ఎరోబిక్స్ డ్యాన్స్‌లాంటివి చేసినప్పటికి అలిసిపోయే అవకాశం ఉండదని ఆయన పేర్కొన్నారు. సూర్యుని ప్రతాపంతో ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో అందమైన యువతి యువకులు నిండుగా ఉన్న తమ శరీరాకృతిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అమ్మాయిలు, అబ్బాయిలు. ఈ పరిస్థితిని గమనించి అందుకు అనుగుణంగా ఆహార పదార్దాలు సమయ పాలనతో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకోని ప్రతి ఒక్కరు ఆహార పదార్దాలను ఓ క్రమపద్దతిలో తీసుకుంటే ఆరోగ్య రీత్యా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నందున ఎక్సర్సైజులు చాలా వరకు తగ్గిస్తే మంచిది. మరీ ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని నీరు ఆవిరైపోతుంది. దీంతో శరీరంలోని నీటి శాతం తగ్గే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకోని కొద్దిపాటి వ్యాయామం చేయాలి.
తద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు వేసవి తాపం నుంచి తప్పించుకోవచ్చు. వేసవిలో నడపడం. యోగా మెడిటేషన్ లాంటివి చేయడం మంచిది. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవడమే శ్రేయస్కరము.
చిన్నపాటి వ్యాయామాలు…
ప్రతిరోజు ఉదయం చల్లని వేళ వ్యాయామం చేయాలి. మధ్యాహ్నం పూట వ్యాయామం చేయకూడదు. కాళ్లు చేతులు, ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. వ్యాయామం చేసేప్పుడు ఒకేసారి ఎక్కువసేపు చేయకూడదు. మధ్యలో విరామం ఇస్తుండాలి బాగా అలిసిపోయేలా వ్యాయామం చేయవద్దు. మానసిక ప్రశాంతతకు, మంచి శరీరాకృతికి ఆరోగ్యానికి వాకింగ్ జాగింగ్, స్విమ్మింగ్, ఎంతో ఉపయుక్తం, వేసవిలో చెమటను పీల్చే దుస్తులను ధరిస్తే మంచిది.
గుర్తుంచుకోవాల్సిన అంశాలు
సూర్యరశ్మి నుంచి చర్మ రక్షణకు మంచి సన్ స్క్రీన్లోషన్ వాడాలి ఎండలో తిరిగేటప్పుడు తలకు, ముఖానికి ఎండ తగలకుండా చూసుకోవాలి.
వేసవి నుంచి రక్షణకు..
నీటి శాతం అదికంగా ఉండే పండ్లు బాగా తినాలి. సాధ్యమైనంత ఎక్కువ నీరు తాగాలి. వేసవిలో శరీరానికి శక్తినందించే నిమ్మరసం, కొబ్బరి నీరు ఎక్కువగా తాగాలి. గంటకో గ్యాస్ నీటిని తీసుకోవాలి. ఫాస్ట్ పుడ్స్ తినటం మానేస్తే మంచిది. ఆల్కహల్, కాఫీ లాంటివి కూడా తగ్గించడం మంచిది.