జకార్తా: ఇండోనేషియా దీవిలోని సుమత్రాను బుధవారం భారీ భూకంపం తాకింది. రిక్టర్ స్కేలుపై అది 7.8గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో ప్రాణ నష్టమేమైనా సంభవించిందా అనే విషయం వెంటనే తెలియడం లేదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. భూకంపం వచ్చిన వెంటనే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
సిబోల్గాకు 204 కిలోమీటర్ల దూరంలో 46 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు కేంద్రీకృతమైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం తర్వాత మూడు సార్లు ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సునామీ ప్రమాదం లేదని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. స్థానికంగా మాత్రమే సునామీ ప్రభావం ఉంటుందని చెప్పింది.