పండ్ల రారాజు మామిడి పండు

నూజివీడు అనగానే ఎవరికైనా మొదట గుర్తుకొచ్చేది మామిడి పండు. తింటేనే తెలిసేది, వర్ణించటానికలవికానిది, అద్భుతమైనది ఈ పండు రుచి. మండు వేసవి ఎండ మంటలను సైతము పారద్రోలి మనసును, శరీరాన్ని ఆహ్లాదపరిచే అద్భుత శక్తి  ఈ మామిడి పండు ప్రత్యేకత.

అసలు ఈ పండుకి ఇంత విశిష్టమైన రుచి కలగటానికి కారణాలు ఏమిటి? బహుశ ఇక్కడి గాలిలోనూ, నీటిలోనూ, నేలలోనూ ఆ మహత్తు ఉందేమో? లేకపోతే నూజివీడు వాళ్ళందరూ ఇంత మంచి వాళ్ళు, చక్కని వాళ్ళు ఎందుకు అవుతారు? అంత వరుకు బాగానే ఉంది కానీ ఈ అమృత తుల్యమైన రుచి ఎలా వచ్చింది? దేవతాపుంగవుడెవరో తప్పక ఆశీర్వదించి ఉంటాడు.

ఇది ఉష్ణదేశపు పండ్ల చెట్టు. తొంభై (90) నుండి నూట ఇరవై (120) అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ముప్పై(30) అడుగుల వ్యాసం వరకు విస్తరించి కిరీటం ఆకారంలో ఉంటుంది. ఆకులు పది (15) నుండి (35) సెంటి మీటర్ల పొడవు ఆరు (6) నుండి పది (10) సెంటి మీటర్ల వెడల్పు ఉండి ఎప్పడూ పచ్చగా ఉంటాయి. చిగుర్లు లేత తేనె రంగు నుండి ముదురు కాఫీ రంగు మారి చివరిగా ముదురు ఆకుపచ్చ రంగుకి వస్తాయి. పూలు గుత్తులు పది (10) నుండి నలభై (40) సెంటి మీటర్ల పొడవు ఉంటాయి. పూవు చిన్నదిగా ఐదు (5) నుండి (10) మిల్లి మీటర్లు పొడవు ఐదు (5) రెక్కలు కలిగి లేలేత సువాసనతో ఉంటాయి. పుష్పించడం పూర్తి ఐన తరవాత కాయలు రూపు దిద్దుకొని మూడు (3) నుండి ఆరు (6) మాసాలలో పక్వానికి వస్తాయి.


పక్వానికి వచ్చిన పండ్లు పొడవాటి కాడలతో కిందకు వేలాడుతూ ఉంటాయి. ఇవి సూర్యరశ్మి తగిలేవైపు కొంచం లేత ఎరుపు రంగుతోను ఇంకొక వైపు పసుపు రంగుతోను ఉంటాయి.ఇవి తియ్యని సువాసనతో ఉంటాయి. ఏడు (7) నుండి (12) సెంటి మీటర్ల వ్యాసం పది (10) నుండి ఇరవైఐదు (25) సెంటి మీటర్ల పొడవు కలిగి ఉంటాయి. రెండున్నర (2.5) కిలోగ్రాముల వరకు బరువు కలిగి ఉంటాయి. పండు మద్యలో పీచు తోను పీచు లేకుండాను ధృడమైన ముట్టె ఉంటుంది. అది ఒకటి(1)నుండి(2) మిల్లీమీటర్లు మందంతో, పల్చటికాగితం లాంటి పొర ఉన్నవిత్తనంతో (జీడి) ఉంటుంది. విత్తనం నాలుగు (4) నుండి ఏడు (7) సెంటి మీటర్ల పొడవు మూడు (3) నుండి నాలుగు (4) సెంటి మీటర్ల వెడల్పుఒక (1) సెంటీమీటర్ మందం కలిగి ఉంటుంది.

మామిడి ఉపయోగాలు
ప్రపంచం అంతటా ఇప్పుడు మామిడి పండు తినడం పట్ల మక్కువ పెరిగింది. ఇప్పుడు ఈ పంటను సమశీతోష్ణ పరిస్థితిలో కూడా పండిస్తూ ఉన్నారు భారత ద్వీపకల్పం అంతటా, కరేబియన్(क्रिब्बीयन), మధ్య అమెరికా, మధ్య ఆసియా, దక్షిణ తూర్పు అసియా, మధ్య మరియు దక్షిణ ఆఫ్రికా దేశాలలోను పండిస్తున్నారు. దీనిని ఎక్కవగా తాజాగానే తింటారు. ఇంకా పంటగా వేయని దక్షిణ ఫ్లోరిడాలో కూడా మామిడిచెట్టుని ఇంటి పెరటిలో చూడవచ్చు.

మామిడిపండ్లు ప్రపంచమంతా ఇష్టమైన ఆహారమే
అయినా రైతులు తక్కువ ప్రతిఫలం పొందుచున్నారు. అందువలన ఇవి అందరికి అందుబాటులో ఉంటాయి. తాజా మామిడి పండులో పదిహేను శాతం(15%) చక్కెర, ఒక శాతం(1%) మాంసకృత్తులు మరియు గుర్తించ తగిన మోతాదులో ఎ,బి,సి(आ,ब,सी) విటమిన్లు ఉంటాయి. మామిడిపండు ఎక్కవగా తియ్యగా ఉన్నా కొన్నిజాతుల పండు కొంచంపుల్లగా ఉంటుంది, ముఖ్యంగా చిలక ముక్కు(బెంగళూర్) మామిడి ఈ కోవకు చెందినదే. అందువలనే భారతదేశంలో వీటిని చిన్నచిన్న వ్యాపారులు బండి మీద వీటిని సన్నని పోడవైన ముక్కలుగా కోసి ఉప్పుకారం చల్లి అమ్ముతూ ఉంటారు. చాలామందికి నోరూరించే ఆహారం. కొన్ని పండ్లు పీచు ఎక్కువ రసంతో ఉంటాయి. వీటిని రసాలు అంటారు. కొన్ని కరకరలాడే కండతో ఉంటాయి వీటిని మల్ గోవా మామిడి అంటారు. బంగినపల్లి ఎక్కువ తీయగా మెత్తటి కండ కలిగి ఉంటాయి. నీటిశాతం ఎక్కువ కనుక రసభరితంగా ఉంటాయి. కాయలతో దీర్ఘకాలం నిలవ ఉండే పచ్చళ్ళు(ఊరగాయలు)చేస్తారు.

ఉత్తర భారతంలో పుల్లని మామిడి ముక్కలను పొడిచేసి ప్యాక్ చేసి అమ్ముతారు. దీనిని వారు విరివిగా వంటలలో వాడుతుంటారు. దీనిని వారు ఆమ్ చూర్ (మామిడి పొడి) అంటారు. ఆంధ్రులు కూడా కొన్ని ప్రదేశాలలోఇళ్ళలో ఎండపెట్టిన మామిడి ముక్కలను సంవత్సరం అంతా వాడే అలవాటు ఉంది. పచ్చి మామిడి కాయని వివిద రూపాలలో వంటలలో వాడుతుంటారు. సున్నపుశక్తి(కాల్షియమ్) విటమిన్ బి పుష్కలంగా ఉంది కనుక అమెరికన్స్ వీటిని చెక్కుతో చేర్చి తింటారు. పడమటి దేశాలలో పండ్లతో తియ్యటి చట్నీ చేస్తారు. ఫిలిప్పైన్ లో మామిడి కాయలను ష్రిమ్ప్ అనే చేపల గుజ్జుతో చేర్చి తింటారు. ష్రిమ్ప్ అనే చేపల గుజ్జుతో అక్కడ తీపి, ఉప్పు, మసాలా రుచులను చేర్చి ఇతర వంటల లో వాడుతుంటారు. పీచేస్‌పై అనే ఆహారాన్ని ఇప్పుడు మాంగో పై చేస్తున్నారు. తాయ్ లాండ్ లో భోజనానంతర ఆహారం(డిసర్ట్)తో చేర్చి అందిస్తారు.
మామిడి.. క్యాన్సర్‌ నివారిణి

మామిడి రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అరికడుతుందని మామిడి పండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్‌లో క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అరికట్టే గుణం ఉన్నట్టు నిపుణులు కనుగొన్నారు. ఐదు రకాల మామిడి పండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్‌ను.. రొమ్ము, పెద్దపేగు, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్‌, రక్త క్యాన్సర్ల బాధితులకు ఇచ్చి పరీక్షించారు. క్యాన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకోవటమే కాదు, ఇది రెండు క్యాన్సర్‌ కణాలను చనిపోయే స్థితికీ తెచ్చినట్టు గుర్తించారు.
ఇతర వ్యాపారాలలో మామిడి

భారతదేశంలో మామిడి తాండ్ర ను చేసి చిన్నచిన్న బండ్ల మీద అమ్ముతూ ఉంటారు. ఇలాంటిదే పెద్దఎత్తున కొన్ని వ్యాపారసంస్తలు దేశం అంతటా విక్రయిస్తున్నాయి. మామిడి రసాన్నిబాటిల్స్, మరియు, ప్యాక్ ల రూపంలో వ్యాపార సంస్తలు దేశం అంతటా విక్రయిస్తున్నాయి. మిల్క్ షేక్,లస్సీపండ్ల రసాల అంగడి లో అమ్ముతుంటారు. మామిడికాయలతో చేసే ఊరగాయలు ఆంధ్రులద్వారా ప్రపంచం అంతటా లభిస్తున్నాయి. ఐస్ క్రీం లో మామిడి గుజ్జును, ఫ్రూట్ సలాడ్ లో మామిడి ముక్కలను వేస్తారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s