గుప్పెడన్నం గొప్పమేలు:

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు మన పెద్దలు. వారన్నందుకే కాదు నిజానికి పోషకాల విషయంలోనూ అన్నం ప్రత్యేకతే వేరు. అందుకే ఎన్ని వెరైటీలు తిన్నా చివరికి ఒక ముద్ద పెరుగన్నం తినందే తృప్తిగా ఉండదు చాలా మందికి. నిజానికి అది మంచి అలవాటు కూడా ఎందుకంటే బియ్యంలో అధికంగా ఉండే గంజిశరీరానికి చలువచేస్తుంది. చలికాలంలో ఎక్కువగా సూప్స్ తాగడానికి ఇష్టపడే వాళ్ళు ఎండాకాలంలో గంజిలో మజ్జిగ కలుపుకొని తాగుతుంటారు.
గోధుమలు ఇతర ధాన్యాలతో పోలిస్తే బియ్యంలో ఎక్కువ ప్రొటీన్లు దాదాపు 7 శాతం ఉంటాయి. విటమిన్ బి, (ధయామిన్) ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ పాలిష్ చేసిన, కడిగిన బియ్యాన్ని వండేటప్పుడు దాదాపు 75 శాతం ధయామిన్ తగ్గిపోతుంది. దీనివల్ల శరీరంలో విటమిన్ బి లోపిస్తుంది. అందుకని పాలిష్ ఎక్కువగా పట్టించకుండానే బియ్యం వాడాలి. సోయాబీన్ లేదా ఇతర పప్పుధాన్యాలతో కలిపి వండిన అన్నం మంచి బలవర్థకమైన ఆహారం.

సుగుణాలివి!
అధిక కార్బోహైడ్రేట్లు
కొవ్వు శాతం తక్కువ
ఉప్పు, చక్కెర పరిమాణాలు స్వల్పం
పీచు శాతం అధికం
గుండెజబ్బుతో బాధపడే వారు బియ్యంతో చేసిన పదార్థాలను ఆనందంగా తీసుకోవచ్చు. ఇందులో ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. దంపుడు బియ్యంలో పీచు ఎక్కువగా ఉంటుంది. తక్కువ మోతాదులో బ్రాన్ నూనె కూడా ఉంటుంది. తవుడు నుంచి తయారైన నూనెలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి.
అందుకే కేవలం అన్నంగా కాకుండా బియ్యాన్ని ఇతర రూపాల్లో కూడా వినియోగించడానికి ప్రయత్నించాలి. పిల్లలకు బియ్యంతో పాయసం చేసి పెట్టవచ్చు. బియ్యప్పిండి, బియ్యపురవ్వలతో పిండి వంటలు చేసి వారికి చిరుతిండిగా పెట్టవచ్చు. కొనిపెట్టే ఫాస్ట్‌ఫుడ్‌లకంటే ఇవి ఎంతో మేలు కదా!

అంటారు మన పెద్దలు. వారన్నందుకే కాదు నిజానికి పోషకాల విషయంలోనూ అన్నం ప్రత్యేకతే వేరు. అందుకే ఎన్ని వెరైటీలు తిన్నా చివరికి ఒక ముద్ద పెరుగన్నం తినందే తృప్తిగా ఉండదు చాలా మందికి. నిజానికి అది మంచి అలవాటు కూడా ఎందుకంటే బియ్యంలో అధికంగా ఉండే గంజిశరీరానికి చలువచేస్తుంది. చలికాలంలో ఎక్కువగా సూప్స్ తాగడానికి ఇష్టపడే వాళ్ళు ఎండాకాలంలో గంజిలో మజ్జిగ కలుపుకొని తాగుతుంటారు.
గోధుమలు ఇతర ధాన్యాలతో పోలిస్తే బియ్యంలో ఎక్కువ ప్రొటీన్లు దాదాపు 7 శాతం ఉంటాయి. విటమిన్ బి, (ధయామిన్) ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ పాలిష్ చేసిన, కడిగిన బియ్యాన్ని వండేటప్పుడు దాదాపు 75 శాతం ధయామిన్ తగ్గిపోతుంది. దీనివల్ల శరీరంలో విటమిన్ బి లోపిస్తుంది. అందుకని పాలిష్ ఎక్కువగా పట్టించకుండానే బియ్యం వాడాలి. సోయాబీన్ లేదా ఇతర పప్పుధాన్యాలతో కలిపి వండిన అన్నం మంచి బలవర్థకమైన ఆహారం.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s