2010-11 సంవత్సరంలో సిమెంటు పరిశ్రమ పరిస్థితి 2009-10 సంవత్సరం అంత సాఫీగా ఉండకపోవచ్చు. ఉత్పత్తి వ్యయం పెరగడం, డిమాండు కంటే సరఫరా ఎక్కువ కావడం వల్ల సిమెంటు పరిశ్రమ కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. వర్షాకాలం ప్రారంభం కాగానే సిమెంటు వినియోగం తగ్గుతుంది. అప్పటి నుంచి సిమెంటు కంపెనీల మార్జిన్లు తగ్గే ప్రమాదం ఉంది. ఇన్పుట్ ఖర్చు పెరగడం, రవాణా ఛార్జీలు పెరగడం వల్ల ఇటీవలి కాలంలో 50 కేజీల సిమెంటు బస్తా ఉత్పత్తి చేయడానికి ఖర్చు రూ.20 పెరిగింది. అయితే మార్కెట్లో సిమెంటు పుష్కలంగా ఉండటం వల్ల ఈ రూ.20 అదనపు భారాన్ని కొనుగోలుదారులపై నెట్టడం సాధ్యంకావడం లేదు. 2010 సంవత్సరంలో ఇండియాలో అదనంగా 50 మిలియన్ టన్నుల సిమెంటు ఉత్పత్తికి కెపాసిటీ ఏర్పాటు అవుతున్నది. దీనితో 300 మిలియన్ టన్నుల కెపాసిటీ ఏర్పడింది.
అందులో 75 శాతం సిమెంటు మాత్రమే ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. 2009-10 సంవత్సరంలో సిమెంటు కంపెనీలు పది శాతం మించి వృద్ధిని నమోదు చేసుకున్నాయి. ఆదిత్యాబిర్లా గ్రూపు 15 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. 2008-09లో ఇండియాలో 178.2 మిలియన్ టన్నుల సిమెంటు అమ్ముడయింది.
అయితే మళ్ళీ సిమెంట్ ధరలు పెరుగుతాయాంటారా?