వేసవితో దేశమంతటా విద్యుత్ కొరత వచ్చినప్పటికీ కార్పొరేట్ సంస్థలు తమ ఎయిర్ కండిషనర్లను ఎయిర్ కూలర్లను విక్రయించడానికి వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. అలాగే శీతలపానీయాల కంపెనీలు, ఐస్‌క్రిమ్ కంపెనీలు తమ ఉత్పత్తులను భారీగా పెంచుకోవ డానికి వ్యూహాలు రచిస్తున్నాయి. ఇండియాలో ఇటీవల కాలంలో ఈ ఉత్పత్తులకు మార్కెట్ బాగా పెరిగింది. ప్రజల తలసరి ఆదాయం పెరగడం, వేతన సంఘాల సిఫారసులను అమలు చేయడం, బడ్జెట్లో ఆదాయపు పన్ను రాయితీల ద్వారా రూ.21వేల కోట్లను ప్రజల జేబులో ఉండేలా చూడటంతో ఈ అమ్మకాలు బాగా పెరగనున్నా యని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
శీతలపానీయాలు తయారు చేసే కోకోకోలా, పెప్సీకో, పార్లేఆగ్రో ఇప్పటికే ఎలక్ట్రానిక్ ఛానెల్స్‌లో తమ ప్రచారాన్ని ముమ్మరం చేసాయి. దానితో పాటు స్టోర్సులో తమ ఉత్పత్తుల మీద ప్రజల దృష్టిపడేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. పెప్సీ ఎంగిస్తాన్ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నది. కోకోకోలా మినిట్ మెయిడ్ రేంజ్ పండ్ల రసాల మార్కెటింగ్‌ను ఉధిృతం చేస్తున్నది. అలాగే ఐస్ క్రిమ్ విక్రయించే అమూల్, హిందుస్తాన్ యూనిలివర్, ఇండ్లలో తమ ఉత్పత్తుల వినియోగం ఎక్కువైలా శద్ధ్ర తీసుకుంటున్నాయి. ఇందుకోసం ప్రత్యేక ధరలను ఆఫర్ చేస్తున్నాయి.
కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అమ్మకాలు బాగా పెరగ డంతో వేసవిలోని ఈ డ్యూరబుల్స్ విక్రయించే కంపెనీలు పండగా చేసుకుంటున్నాయి.కొన్ని కంపెనీలు తమ టెక్నాలజీకి ఎక్కువ ప్రచారం ఇస్తే మరికొన్ని కంపెనీలు వినియోగదారుల ఇతర అవసరాలకు ప్రచారం ఇస్తున్నాయి. వోల్టాస్ తన వ్యాపార ప్రకటనల వ్యయాన్ని ఈ సీజన్లో 66 శాతం పెంచింది. గోద్రెజ్ అప్లయన్స్స్ తమ ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారికి టైమెక్స్ వాచీని ఉచితంగా ఇస్తున్నది. అలాగే ప్రతిఉత్పత్తి విద్యుత్‌ను తక్కువ వినియోగిస్తుందన్న ప్రచారాన్ని ఎక్కువ కల్పిస్తున్నారు.అలాగే దుస్తులు విక్రయించే వ్యాన్ హూసెన్ తన ఎకో ఫ్రెండ్లీ షర్టుల గురించి ప్రత్యేక ప్రచారం చేస్తున్నది. సేంద్రియ పత్తి నుంచి తయారు చేసిన నూలుతో ఈ దస్తులను తయారు చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. ఇండియాలో ప్రస్తుతం శీతలపానీయాల వ్యాపారం రూ.8,500 కోట్ల స్థానంలో ఉంది.
అలాగే ఐస్క్రీము వ్యాపారం రెండువేల కోట్ల రూపాయల స్థానంలో ఉంది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రూ.30వేల కోట్లు, దుస్తుల వ్యాపారం రూ.35వేల కోట్లల స్థానంలో ఉంది. కోకోకోలా నింబూ ఫ్రెష్, మినిట్ మెయిడ్ బ్రాండ్ పేరుతో విజయం సాధించి ఆపిల్ ప్లేవర్లను, మిక్స్డ్ ఫ్రూట్ ప్లేవర్లను ప్రవేశపెట్టాలని చూస్తున్నది. వినియోగదారులు శీతలపానీయా లకు, పండ్ల రసాలకు ఎంతవరకు ధర చెల్లించ డానికి ఇష్టపడుతారో అన్న అంశాన్ని అవగాహన చేసుకోవడానికి పెప్సీ,కోకోకోలా, పార్లేఆగ్రో విశ్వప్రయత్నం చేస్తున్నాయి. పార్లేఆగ్రో ఫ్రూటీ పాకేట్లను ఐదురూపాయలకు, 110 ఎమ్ఎల్ విక్రయించే మార్కెట్ వ్యూహాన్ని గత సంవత్సరం అనుసరించింది. దానివల్ల అమ్మకాలు బాగా పెరిగాయి.
గ్రామీణ ప్రాంతాల్లోనూ, తక్కువ ఆదా య వర్గాల్లో వీటి అమ్మకాలు బాగా పెరిగాయి. ఇప్పుడు ఫ్రూటీ, అపిక్లాసిక్ ఎల్ఎమ్ఎన్ పానీయాలను లీటరు పాక్‌లో ప్రవేశపెట్టాలని ఇండ్లలో వినియోగానికి అనుకూలంగా దీనిని మార్కెట్ చేయాలని కంపెనీ చూస్తున్నది.ఇండియాలో ఐస్క్రిములకు మార్కెట్ ఇంకా విస్తరి స్తుందని కంపెనీలు గుర్తించాయి. అనేక ఫ్లేవర్లలో వీటిని విడుదల చేస్తున్నాయి. హిందుస్తాన్ యూనిలీవర్, అమూల్ ఈ మార్కెట్లో గట్టిగా పోటీపడుతున్నాయి. పది రూపాయలకు, 15 రూపాయలకు, ట్విస్టర్ నింజారెయిన్బో పేరుతో యువతీయువకుల కోసం హిందుస్తాన్ యూనిలివర్ కొత్త ప్లేవర్లను ప్రవేశపెట్టింది. అలాగే అమూల్ పది నుంచి రూ.20 మధ్య ధరల్లో అనేక ఫ్లేవర్లలో ఐస్క్రీము కోణ్లు, కప్పులు, స్టిక్‌లను ప్రవేశపెట్టింది.
కరెంట్ ఒకటి సరీగ్గా ఇచ్చి చావరుగానీ.. మనవాళ్లకి …ఈ సోకులకి తక్కువలేదు…రోజంతా ఇదే tension సార్…ఎప్పుడు కరెంట్ కట్ చేసేస్తాడో అనీ??