క్రైస్తవుల మహా పర్వదినం ఈస్టర్‌

క్రైస్తవ సోదరులకు ముఖ్యమైన పండుగల్లో ఈస్టర్‌ ఒకటి. ఆరోజు క్రైస్తవులకు మహా పర్వదినం. ఆనందించదగ్గ సుదినం. ఎందుకంటే – గుడ్‌ఫ్రైడే నాడు శిలువవేయబడ్డ ఏసుక్ర్తీసు తిరిగి జన్మించింది ఈరోజే కనుక!

బైబిల్‌ ప్రకారం – గుడ్‌ఫ్రైడే నాడు జెరూసలెంలో ఏసుక్ర్తీసును శిలువ వేయడం జరిగింది. తాను దేవునిబిడ్డగా ప్రచారం చేసుకుంటున్నాడని చక్రవర్తికి పన్నులు కట్టాల్సిన పనిలేదని ప్రజలకు నూరిపోస్తున్నాడని – ఇలా వివిధ ఆరోపణలతో ఏసుక్రీస్తును యూదులు శిలువ వేశారు. తలపై ముళ్ల కంపలతో, కొరడాదెబ్బలతో ఆయన శరీరం రక్తసిక్తమైంది. శిలువపై ఆయన్ని మేకులతో కొట్టడంతో తుదిశ్వాస విడిచాడు. గుడ్‌ఫ్రైడే నాడు ్యమధాహ్నం సరిగ్గా మూడు గంటలకు ఏసు మరణించడంతో శిలువ నుంచి ఏసుక్రీస్తు శవాన్ని జోసెఫ్‌ అనే వ్యక్తి కిందకు దించాడు.

ఆ మృతదేహాన్ని ఓ సన్నని షీట్‌లో భద్రపరిచి సమాధి చేశాడు. అయితే ఆ సమాధిలో ఏసు మృతదేహంపై ఎలాంటి సుగంధ ద్రవ్యాల్ని వేసిన దాఖలాలు లేవు. ఈ విషయాన్ని గలిలీ నుంచి వచ్చిన కొంతమంది స్త్రీలు గమనించారు. దాంతో వారు ఇంటికి వెళ్లి కొన్ని సుగంధద్రవ్యాల్ని, పెరఫ్్యూమ్‌లను తయారుచేశారు. ఆ మర్నాడు సబ్బతో (శనివారం) కాబట్టి వారు విశ్రాంతి తీసుకున్నారు. (యూదు చట్టం ప్రకారం) ఆదివారం ఉదయం పొద్దున్నే – ఆ స్త్రీలు సమాధి దగ్గరకు సుగంధ ద్రవ్యాల్ని తీసుకు వెళ్లారు.

అక్కడ వారు చూసిన దృశ్యం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ సమాధి పక్కనే ఉన్న ఒకరాయి పక్కకు దొర్లినట్లు కనిపించింది. లోపల ఏసు మృతదేహం లేకపోవడం ఇంకా ఆశ్చర్యం. ఒక్కసారిగా మెరిసిపోయే ధవళ వస్త్రాలలో ఇద్దరు ఆ స్త్రీల చుట్టూ ఉండడం కనిపించింది. వారెవరో కాదు దేవతలు…

సమాధి నుంచి బయటకు వచ్చి – బతికి ఉన్న వ్యక్తి కోసం ఎందుకు సమాధిలో ఇంకా వెతుక్కుంటారు. వ్యర్ధంగా అని ఆ దేవతలు ఆ స్త్రీలను ప్రశ్నించారు. ఆ స్త్రీల ఆనందానికి అంతులేదు. గబగబ ఇళ్లకు వెళ్లారు. అందరికీ ఈ ఆనందకర వార్తను చెప్పారు. క్షణాల్లో ఈ విషయం అందరికీ పాకిపోయింది. దేవుని బిడ్డ తిరిగి బతకడంతో తమ జీవితాల్లో వెలుగులు నింపుతాడని భావించి వారి ఆనందానికి అవధుల్లేవు, పట్టపగ్గాల్లేవు. ఆదివారంనాడు ఏసుప్రభువు పునరుజ్జీవితుడయ్యాడు. కాబట్టి ఆ రోజు వారు ఈస్టర్‌ పండగ జరుపుకున్నారు. ఈస్టర్‌ అనే పదం పుట్టుక చాలా మందికి తెలీదు. ఆంగ్లో-స్క్సాన్‌ ట్యుటోనిక్‌లో శరదృతువుకు, ఫలత్వానికి దేవతకు – ఈస్టర్‌ అనే పదంతో సంబంధం ఉన్నట్లు చెబుతారు. ఈ దేవతను పూజించేందుకు ఏప్రిల్‌ మాస్నాని అంకితం చేశారు.

ఈస్టర్‌కు గల మరో పేరు – పాస్ట్. ఈ పదం – యూదుల పండుగ అయిన పేసో పండగ కు చెందిందని చెబుతారు. నిజానికి చాలా లక్షల సంవత్సరాల కిందట క్రైస్తవుల్లో చాలా మంది యూదు వంశానికి చెందిన వారు. వారు ఈస్టర్‌ను కొత్త అనుభూతిగా ఆహ్వానించారు. ఈస్టర్‌ వారంలో అనేక ఉత్సవాలు జరుపుకోవడం రివాజు. వసంత రుతువును ఆహ్వానిస్తూ సూర్యోదయపు తొలికిరణాల్ని స్వాగతించడం ఓ ఉత్సవం. బాప్టిస్టులకు ఈస్టర్‌ రాత్రి ఓ మధురానుభూతి బ్టాపిజం తీసుకునే కొత్తవారు – మరణానికి చిహ్నమైన రాత్రి చీకట్లను పారదోలడం ప్రముఖంగా సాగే చర్చ. రాత్రివేళ జరిగే ఈ ఉత్సవం – నూతన జీవిత్నాని పొందేందుకు వెలుగును ప్రసాదించడం విశేషం. దీనికి గుర్తుగా వారు ఆ చీకటి వేళ కొవ్వోత్తుల్ని వెలిగిస్తారు. దీన్ని నైట్‌ ఆఫ్‌ ఇల్యుమినేషన్‌ అని పిలుస్తారు. కొవ్వొత్తుల్ని వెలిగించే సంప్రదాయం ప్రారంభమైంది. ఈ ఉత్సవం నుంచే!

ఈస్టర్‌ ఆదివారంనాడు – క్రైస్తవులు చర్చిల్లో కొవ్వొత్తులు వెలిగిస్తారు. ఈస్టర్‌ నాడు – క్రైస్తవులు కొవ్వొత్తులు వెలిగించుకుని వాటిని చేతబట్టుకుని నగరమంతా పర్యటిస్తారు. దీన్ని ఈస్టర్‌ పెరేడ్‌ అంటారు. ఈ ఉత్సవం కూడా కొత్తగా బాప్టిజం తీసుకుని క్రైస్తవ మతంలోకి వెళ్ళేవారి కోసం ఏర్పాటైనది. కొత్త బట్టలు కట్టుకుని, క్రైస్తవ సోదరులందరి ఇళ్లకూ వెళ్లి బహుమతులు పంచుకోవడం జరుగుతుంది.

అంతేకాదు – ఈస్టర్‌ రోజున క్రైస్తవ సోదరులు అందంగా అలంకరించిన కోడిగుడ్లను పరస్పరం పంచుకుంటారు. ఈ కోడిగుడ్డు – నూతన జీవితానికి హ్నం. పై నున్న బలమైన పెంకును దూసుకుని బయటకు జీవి వ్చనట్లు – పునర్జన్మకు ఇది సంకేతం. గుడ్‌ఫ్రైడే నాడు సమాధి కాబడిన ఏసుప్రభువు – ఈస్టర్‌ సండేనాడు సమాధి నుంచి బయటకు వచ్చాడు. కోడిగుడ్డు లోంచి కోడిపిల్ల బయటకు వచ్చినట్లుగా జరిగిన ఆ సంఘటనకు గుర్తుగా – ఈస్టర్‌నాడు క్రైస్తవులు కోడిగుడ్లను పంచుకోవడం జరుగుతుంది. ఈస్టర్‌ నాటి కుందేలుకు కూడా ప్రాధాన్యం ఉంది. ఇది ఫలదీకరణకు, ఫలవంతానికి ప్రతీక. ఇది వసంత రుతువును ప్రతిబింబిస్తుంది.

3 thoughts on “క్రైస్తవుల మహా పర్వదినం ఈస్టర్‌

  1. *గుడ్‌ఫ్రైడే నాడు సమాధి కాబడిన ఏసుప్రభువు – ఈస్టర్‌ సండేనాడు సమాధి నుంచి బయటకు వచ్చాడు. *

    చని పోయిన వారు బయటికి రావటం అనేది నిజమైతే మా తాత కూడా ఇప్పుడు తిరిగి బతకాలి. అలాగే అందరి విషయం లో జరగాలి. మీరు ఈ క్రైస్తవ మిషనరీల ప్రచారాన్ని బాగా నమ్మినట్లు ఉన్నారు. మాకు ఇంగిత జానం ఉంది కాబట్టి బతికి పోయాం లేక పోతె ఇటువంటి కథల తో మా జీవితాలను అజ్ఞానం లోకి నెట్టి మానెత్తిన ఈ చెత్తను రుద్ది, మీరు మీ పోప్ సర్వపాపలను చేస్తు (మిషనరీలలో పని చేసే వారు మూగ పిల్లలను మీద లైంగిక అత్యాచారాలు చేస్తూ ), ప్రభువు పేరు చెప్పుకొని రాజ భొగాలను అనుభవిస్తారా.

  2. పగలు పన్నెండు గంటలు(యోహాను11:9)ప్రవక్త అయిన యోనా ను గురించిన సూచకక్రియ ఒక్కటే మనకు ఆయన ఇచ్చాడు.దానిప్రకారం మూడు రాత్రులు మూడుపగళ్ళు (72 గంటలు)ఆయన సమాధిలో ఉండాలి.(మత్తయి12:38-41).శుక్రవారం సాయంత్రం నుండి లెక్క గడితే ఈస్టర్ సోమవారం వస్తుంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s