‘కింగ్స్‌’ జోరు..!!

కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ ఎట్టకేలకు ఆదివారం మళ్లీ విజయాన్ని నమోదు చేసింది. సిరీస్‌ ప్రారంభం నుంచి వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి చెంది హ్యాట్రిక్‌ కొట్టిన పంజాబ్‌ మార్చి 21న చెన్నైపై సూపర్‌ ఓవర్‌తో భోణీ కొట్టింది. తర్వాత మళ్లీ తన పాతకథనే పునరావతం చేసి ఓటముల పరంపరను కొనసాగించిన పంజాబ్‌ ఎట్టకేలకు ఆదివారం కోల్‌కతాపై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటి వరకు సిరీస్‌లో మొత్తం 9 మ్యాచ్‌లాడిన కింగ్స్‌ ఏడు పరాజయాలు మూటగట్టుకొని రెండు విజయాలను నమోదు చేసింది. ఈ విజయం పంజాబ్‌కు మేలు చేస్తుందా? లేక మరో జట్టుకు కీడు చేస్తుందా వేచి చూడాల్సి ఉంది.

ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. ఓపెనర్లు గంగూలీ, క్రిస్‌ గేల్‌లు శుభారంభం చేసి 7.2 ఓవర్లలో తొలి వికెట్‌కు 56 పరుగులు జత చేశారు. ఈ క్రమంలో గంగూలీ (36) బొపార బౌలింగ్‌లో పెవీలియన్‌కు చేరాడు. అనంతరం తివారీతో జత కలిసిన గేల్‌ రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేశాడు. 42 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 88 పరుగులు చేసి థిరన్‌కు దొరికిపోయాడు.157 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయిన రైడర్స్‌కు తివారీ (35), మ్యాథ్యూస్‌ (17 నాటౌట్‌), హస్సీ (11 నాటౌట్‌) సమర్ధవంతగా ఆడి ప్రత్యర్థి ముందు 201 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచారు.

భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కకు కార్తిక్‌ ప్రారంభంలోనే చెక్‌ పెట్టి బిస్లా (18)ను పెవీలియన్‌కు చేర్చాడు. అయితే సిరీస్‌లో ఇప్పటి వరకు ఆశించిన మేర రాణించడంలో ప్రతి మ్యాచ్‌లో విఫలమవుతూ వస్తున్న మరో ఓపెనర్‌ జయవర్ధనే కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడి బంతిని మైదానం నలుమూలలా పరుగులు పెట్టించాడు.

తాను ఎదుర్కొన్న 59 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 110 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇతనికి తోడు కెప్టెన్‌ సంగక్కర (38), యువరాజ్‌ (33)లు రాణించడంతో 18.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్‌ 204 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సెంచరీ చేసి జట్టు విజయాన్నందించిన జయవర్థణేకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

స్కోరు బోర్డు : కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌ : గంగూలీ సి బి బోపారా 36, గేలె సి బో పారా బి తెరాన్‌ 88, తివారీ సి సబ్‌ (కైఫ్‌) బి పఠాన్‌ 35, మాథ్యూస్‌ నాటౌట్‌ 17, హస్సీ నాటౌట్‌ 11, అదనం 13, మొత్తం 3 వికెట్ల నష్టానికి 200.
వికెట్ల పతనం : 1-56 గంగూలీ, 2-157 గేలె, 3-182 తివారీ.
బౌలింగ్‌ : పఠాన్‌ 4-0-36-1, పోవార్‌ 4-0-23-0, శ్రీవాత్సవ 3-0-35-0, తె రాన్‌ 4-0-36-1, బోపారా 3-0-43-1, చావ్లా 2-0-26-0.

కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌ : బిస్లా బి కార్తిక్‌ 18, జయవర్ధనే నాటౌట్‌ 110, సంగ క్కర సి హస్సీ బి బాండ్‌ 38, యువరాజ్‌ సింగ్‌ నాటౌట్‌ 33, అదనం 5, మొత్తం 18.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 204.
వికెట్ల పతనం : 1-51 బిస్లా, 2-149 సంగక్కర.
బౌలింగ్‌ : బాండ్‌ 4-0-32-1, ఉనాడ్కట్‌ 2.2-0-32-0. కార్తీక్‌ 4-0- 41-1, గేలె 1-0-16-0, మాథ్యూస్‌ 3-0-32-0, అగార్కర్‌ 3-0-35-0, హస్సీ 1-0-13-0.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s