మణిరత్నం తాజా చిత్రం రావణ్ లో నాలుగు క్లైమాక్స్ లు తీసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే హిందీ, తమిళ భాషలను దృష్టిలో పెట్టుకుని ఏ క్లైమాక్స్ ని ఇస్తారనేది ఇంకా నిర్ణయించుకోలేదంటున్నారు. అలాగే హిందీకో ఎండింగ్, తమిళ్ కో ఎండింగ్ ఉండే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇక మొదట క్లైమాక్స్ ప్రకారం రావణ్(అభిషేక్ బచ్చన్)..సీత(ఐశ్వర్య)నుగెలుచుకోవటంతో ముగుస్తుంది. ఇక సెకెండ్ ఎండింగ్ ప్రకారం సీత.. రాముడు(విక్రమ్) ని కోరుకుంటే..రావణుడు ఓకే చేస్తాడు. ఇక మూడో ఎండింగ్ లో రాముడు, రావణుడు ఇద్దరూ చనిపోతే సీత తిరిగి తన పాత వైభవాన్ని పొంది పాలకురాలు అవుతుంది. ఇవి బాలీవుడ్ లో వినపడుతున్న క్లైమాక్స్ రీతులు. మణిరత్నం రామాయణాన్ని అనుసరించకుండా ఈ కథను ఊహించని ట్విస్ట్ లతో అందించనున్నారని తెలుస్తోంది. అందుకే ఎవరూ ఊహించని రీతిలో క్లైమాక్స్ ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు. స్త్రీ మొగవాడి కబంధ హస్తాలనుంచి వచ్చి తనకు తానుగా నిలబడే విధంగా కథను రూపొందించాడని చెప్తున్నారు. ఇక రావణుడు పాత్రను హైలెట్ గా చేసాడని కూడా తెలుస్తోంది.
ఐశ్వర్య రాయ్ అంటే అభిమానించే వానిగా ఒక సలహా> ఇంకా ఈ సినిమాలు ఏమిటికమ్మా? ఇంకా సాధించెది ఏముంది? 37 సం వచ్చినాయి. ఇంకా పిల్లలుకనకపోతే ఇంకెప్పుడు కంటావమ్మా? ఇంక కుదురుగా సంసారం చేసుకుంటె మంచిది.
4 climaxలు తీసినారా? ఇంకా 4 సంవత్సరంలు తీయి మణిరత్నము. ఎందుకయ్యా ఇట్లా పీక్కుతింటారు? ఈ లోపల ra.one అనే సినిమా తీస్తున్నాడంట పాచివెధవ షారుఖ్.