రైడర్స్‌ను గెలిపించిన గంగూలీ..!!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ డక్కన్ చార్జర్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 24 పరుగుల తేడాతో గెలుపొందింది. 182 పరుగుల భారీ స్కోరును ఛేదించడానికి చార్జర్స్ బ్యాట్స్‌మన్ తొలుత ప్రయత్నించినా, ఆతర్వాత వికెట్లు చేతిలో ఉన్నప్పటికీ మితిమీరిన రక్షణాత్మక ఆటతో ఓటమిని కొనితెచ్చుకున్నారు. పరుగుల వేటను కొనసాగించలేక ఈ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులకు పరిమితమైంది. నైట్ రైడర్స్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 88 పరుగులు సాధించి తన జట్టు విజయంలో కీలక పాత్రను పోషించాడు.

‘దాదా’ సూపర్ ఇన్నింగ్స్..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నైట్ రైడర్స్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. క్రిస్ గేల్ (4), చటేశ్వర్ పూజారా (17), మనోజ్ తివారీ (5) తక్కువ స్కోర్లకే వెనుదిరిగినప్పటికీ, గంగూలీ క్రీజ్‌లో పాతుకుపోయి పరుగులు రాబట్టాడు. అతను 54 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఐదు భారీ సిక్సర్లతో 88 పరుగులు చేసి ప్రజ్ఞాన్ ఒజా బౌలింగ్‌లో రోహిత్ శర్మకు చిక్కడంతో ఒక అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనకు తెరపడింది. గంగూలీ వికెట్ కూలిన తర్వాత డేవిడ్ హస్సీ (31) కొంత వరకు చార్జర్స్ బౌలింగ్‌ను ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. అయితే, అతను 31 పరుగుల స్కోరువద్ద జస్‌కరన్ సింగ్ బఔలింగ్‌లో గిబ్స్‌కు దొరికిపోయాడు. అంతకు ముందు అదే ఓవర్ మొదటి బంతిలో గిబ్స్‌కే క్యాచ్ ఇచ్చిన మాథ్యూస్ (4) పెవిలియన్ చేరాడు. నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 181 పరుగులు సాధించగా, అప్పటికి వృద్ధిమాన్ సాహా 10, అజిత్ అగార్కర్ 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. చార్జర్స్ బౌలర్లలో జస్‌కరన్ సింగ్, సైమండ్స్, ప్రజ్ఞాన్ ఒజా తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు.

నైట్ రైడర్స్ సాధించిన 181 పరుగులకు సమాధానంగా బరిలోకి దిగిన చార్జర్స్ జట్టు 31 పరుగుల స్కోరువద్ద కెప్టెన్ గిల్‌క్రిస్ట్‌ను చేజార్చుకుంది. అతను ఐదు బంతుల్లో, రెండు ఫోర్లతో తొమ్మిది పరుగులు చేసి అగార్కర్ బౌలింగ్‌లో పూజారాకు తేలికైన క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఓపెనర్ గిబ్స్‌తో కలిసి రెండో వికెట్‌కు 46 పరుగుల భాగ్వామ్యాన్ని అందించిన మనీష్ మిశ్రా 16 బంతుల్లో 29 పరుగులు చేసి మాథ్యూస్ బౌలింగ్‌లో తివారీకి దొరికాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు నైట్ రైడర్స్ బౌలర్లకు దడపుట్టించిన ఓపెనర్ హెర్చల్ గిబ్స్ 45 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో అర్థ సెంచరీ పూర్తిచేసి, షేన్ బాండ్ బౌలింగ్‌లో డేవిడ్ హస్సీ క్యాచ్ అందుకోవడంతో వెనుదిరిగాడు. సైమండ్స్‌తో కలిసి మూడో వికెట్‌కు 44 పరుగులు జత చేసిన అతను అవుటయ్యే సమయానికి చార్జర్స్ స్కోరు 121 పరుగులు. ఆదుకుంటాడని ఆశించిన రోహిత్ శర్మ కేవలం రెండు పరుగులే చేసి మురళీ కార్తిక్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌల్డ్‌కావడంతో చార్జర్స్ కష్టాల్లో పడింది. పరుగుల వేటలో విఫలమై, చివరి ఓవర్ నాలుగో బంతికి సైమండ్స్ వికెట్‌ను కూడా కోల్పోయింది. అతను 37 బంతుల్లో 45 పరుగులు చేసి, గేల్ బౌలింగ్‌లో మురళీ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 20 ఓవర్లలో చార్జర్స్ ఐదు వికెట్లకు 157 పరుగులు చేసి, 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s