విద్యాహక్కు చట్టం గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. దీని కింద 6 నుంచి14 ఏళ్ల వయసున్న పిల్లలకు ఉచిత,నిర్బంధ విద్యను అందిస్తారు. ఇందుకు సహాయపడవలసిందిగా ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. విద్యాహక్కు కింద రాష్ట్ర ప్రభుత్వాలు,స్థానిక సంస్థలు ప్రతి పిల్లడికి తప్పనిసరిగా విద్యను అందించవలసి ఉంటుంది.విద్యాహక్కు అమల్లోకి రావడం వల్ల ప్రస్తుతం పాఠశాలలకు వెళ్లని కోటి మంది పిల్లలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ సందర్భంగా ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగిస్తూ పిల్లలందిరికీ విద్యను అందజేసే విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
విద్యాహక్కు చట్టం అమలుకు ఆర్థిక ఇబ్బందుల మూలంగా ఆటంకాలు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన చెప్పారు.విద్యను ప్రాథమిక హక్కుగా పరిగణించేందుకు చేసిన 86 వ రాజ్యాంగ సవరణరు 2002 లో పార్లమెంట్ ఆమోదించింది.విద్యాహక్కు చట్టాన్ని గత సంవత్సరం పార్లమెంట్ ఆమోదించింది.రాజ్యాంగ సవరణతో పాటు విద్యాహక్కుచట్టం గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి.
విద్య ప్రాధాన్యతను వివరిస్తూ మన్మోహన్ సింగ్ తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకొన్నారు. పేద కుటుంబంలో పుట్టిన వారు పాఠశాలకు వెళ్లాలంటే చాలా దూరం నడవవలసి వచ్చేదని ఆయన చెప్పారు.తాను గుడ్డి లాంతరు వెలుగులో చదువుకొన్నానని ఆయన అన్నారు.ఈ రోజు తానీ స్థితికి రావడానికి విద్యయే కారణమని ఆయన తెలిపారు.భారతీయులకు విద్యాహక్కు ఇవ్వాలని 100 ఏళ్ల క్రితం గోపాల కృష్ణ గోఖులే బ్రిటిష్ అసెంబ్లీని కోరారని ప్రధాని గుర్తుచేశారు.90 ఏళ్ల అనంతరం విద్యాహక్కును ప్రాథమిక హక్కుగా పరిగణిస్తూ రాజ్యాంగ సవరణ జరిగిందని ఆయన చెప్పారు.
పిల్లలందరికీ ప్రాథమిక విద్య అందజేయడానికి తమ ప్రభుత్వం ముందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. విద్యాహక్కు చట్టంకింద ఎన్నడూ పాఠశాలలకు వెళ్ళని పిల్లలతో పాటు మధ్యలో చదువు మానేసిన పిల్లలను పాఠశాలల్లో చేర్చుకుంటారు.విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థల్లో బలహీనవర్గాలకు చెందిన పిల్లలకు 25 శాతం మేరకు రిజర్వేషన్ కల్పించవలసి ఉంటుంది.విద్యాహక్కు చట్టం అమలుకు కేంద్ర ప్రభుత్వం,రాష్ట్రప్రభుత్వాలు,జిల్లా,గ్రామీణ స్థాయి అధికారులు కలిసికట్టుగా పనిచేయవలసి ఉంటుందని ప్రధాని అన్నారు.
ఉత్తమ విద్యను అందించడం ఉపాధ్యాయుల సామర్ధ్యంపై అధారపడి ఉందని ఆయన చెప్పారు. విద్యాహక్కు చట్టాన్ని అమలుకు బాలికలు, దళితులు, ఆదివాసిలు, మైనార్టీలపై దృష్టిసారించవలసిన అవసరముందని ఆయన అన్నారు.ప్రస్తుతం 6 నుంచి 14 ఏళ్ళ వయస్సున్న పిల్లలు 22 కోట్ల మంది ఉన్నారు.వీరిలో 4.6 శాతం మంది పిల్లలు పాఠశాలలకు వెళ్లడం లేదని ఒక అధికారి చెప్పారు.విద్యాహక్కు చట్టం అమలు పట్ల కాంగ్రెస్ హర్షం వెలిబుచ్చింది.
సైన్స్‌తోనే ప్రగతి : ప్రధాని
పర్యావరణ మార్పులు, ఇంధన పారిశుద్ధ్యం, సానుకూల సాంకే తిక విజ్ఞానం, నీటి వనరుల యాజమాన్యం, ఆరోగ్యపరిరక్షణ, ఆహార భద్రత, జీవ సాంకేతిక విజ్ఞానం వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో మన సత్తాను నిర్ణ యించేది మన విజ్ఞానశాస్త్ర సామర్ధ్యాలే అని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అన్నారు.జాతీయ రసాయన ప్రయోగశాల(ఎన్సిఎల్) వజ్రోత్సవాల సందర్భంగా ఆయన నేడిక్కడ ప్రసంగిస్తూ 2010-2020 దశాబ్దాన్ని నూతనావిష్కరణల దశాబ్దంగా ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. కొత్త ప్రయోగాలపై యువతలో స్ఫూర్తిని కలిగించవలసి ఉందన్నారు.
సమగ్రమైన సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధ నకు కషి చేయాలని పిలుపునిచ్చారు. సమస్యలకు పరిష్కారాలు నిర్ణీతవ్య వథిలో ఉండాలనీ.ప్రయోగ ఫలితాలతో వీలైనంత్వరగా పరిష్కారాలు కనుగొ నాలనీ ఆయన సూచించారు.ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ క్యాంపస్‌లో సిఎస్ఐఆర్ పరిశోధనా సముదాయాన్ని స్థాపించాలన్న ప్రతిపాదన ఉండని ప్రధాని తెలిపారు. భారత విజ్ఞానశాస్త్ర, విద్యా, పరిశోధనా సంస్థ(ఐఐఎస్‌ఇ ఆర్) నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
చిత్తశుద్ధితో చేస్తే మంచి ప్రయోగమే కావచ్చేమో
ప్రమోట్ తెలుగు ఎలా? *ప్రమోట్ని* తెలూగీకరిస్తే బాగుంటుందేమో కదా?
To Promote (v. a.)
వృద్ధి చేసుట, పొడిగించుట, హెచ్చించుట. the king *d him రాజు అతణ్ని ముందుకు తెచ్చినాడు.
Promoted (adj.)
అభివృద్ధియైన.
Promoter (n. s.)
అభివృద్ధిచేసే వాడు, వృద్ధి పొందించే వాడు.