తిరుపతి-కాళహస్తి మధ్య మెట్రో రైలు ..!

తిరుపతి ఎంపీ చింతా మోహన్ గత రైల్వే బడ్జెట్ లో తిరుపతికి అనేక కొత్త సర్వీసులు వచ్చేలా చేయగలిగారు. ఆయన చొరవ మేరకు ఇప్పుడు తిరుపతి-శ్రీకాళహస్తి మధ్య మెట్రోరైలు సర్వీసును ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. తిరుపతిలో ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే 50 మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులను జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ద్వారా మంజూరు చేసింది. ఇవి ప్రస్తుతం ట్రయల్‌ రన్‌ కింద నగరం చుట్టుపక్కల తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రజా రవాణా వ్యవస్థ మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం మెట్రోరైలు ఏర్పాటుకు ప్రాథమిక సన్నాహాలు ప్రారంభించింది.

మెట్రోరైలు ఏర్పాటుకు రూ.2700 కోట్లు ఖర్చు అవుతుందని రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశంలో అంచనాకు వచ్చారు. ప్రధానంగా తిరుపతి-శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాల మధ్య ఉన్న ప్రాంతాలను కలుపుతూ మెట్రోరైలు ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినట్టు తెలిసింది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు, అమలుకు సంబంధించిన వ్యవహారాలను తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చూస్తోంది. తుడ పరిధి విస్తరించినందున శ్రీకాళహస్తి వరకు ప్రజా రవాణా వ్యవస్థను విస్తృతంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి.

1 thought on “తిరుపతి-కాళహస్తి మధ్య మెట్రో రైలు ..!

  1. Wow.. great to know….మా ఊరు కూడా అభివృద్ధి చెందుతుందన్న మాట 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s