భారీ వాహనాలను రూపొందించడంలో దిట్ట అనిపించుకున్న జనరల్ మోటార్స్ రూటు మార్చి చిన్న కార్లను రూపొందించడమే కాదు అందులో ఎలక్ట్రిక్ కార్లను కూడా రూపొందిస్తోంది. తాజాగా జనరల్ మోటార్స్ చెవ్రోలెట్ వారు విడుదల చేసిన, మంచి ఆదరణ పొందిన స్పార్క్ కారుకు ఎలక్ట్రిక్ వెర్షన్ ను రూపొందిస్తోంది. ఎలక్ట్రిక్ కార్లను రూపొందించడంలో అందెవేసిన చెయ్యిగా అనిపించుకున్న రేవా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఈ కారును రూపొందిస్తోంది.
ఇక ఈ కారు భారతీయ మార్కెట్ లోకి ఈ ఏడాది చివరికల్లా విడుదల కానుంది. ఇక ఈ కారు ధర పెట్రోల్ వెర్షన్ కారు కంటే ఖరీదు ఎక్కువ అని తెలుస్తోంది. ఈ కారు ధర సుమారు రూ. 3,50000 గా వుండనుందని సమాచారం. ఇక జనరల్ మోటార్స్ సంస్థ ఏవియో కారును భారతీయ మార్కెట్ కు పంపిణీని నిలిపివేయాలనే ఆలోచనలో వున్నట్టు సమాచారం. వీటితో పాటు చైనాకు చెందిన SIAC అనే సంస్థతో కలిసి ఓ చిన్న కారును రూపొందించేందుకు కూడా జనరల్ మోటార్స్ సన్నాహాలు చేస్తోందట.