బూస్టీ-చాలా టేస్టీ

కావలసిన పదార్ధాలు:
మైదా: 1/2 kg
డాల్డా: 250 grms
పంచదార: 1/2 kg
బూస్ట్: 50 grms
పాలు: 1/2 ltr
యాలకుల పొడి: 1tsp
ఉప్పు: 1/4 tsp
అమ్మోనియం బై కార్బొనేట్: 1/2 tsp
సోడా: 1/2 tsp

తయారు చేయు విధానము:
1. మొదటగా డాల్డా, పంచదార పొడి, బూస్ట్ కలిపి క్రీమ్ లా చేయాలి. వీటికి మైదా, పాలు, యాలకుల పొడి, అమ్మోనియం బై కార్బోనేట్, సోడా, ఉప్పు చేర్చి ముద్దలా కలిపి కాసేపు గాటి చొరబడకుండా మూత పెట్టి ఉంచాలి.
2. అరగంట తర్వాత పిండిని తీసుకొని చపాతీలా అరంగుళం మందంగా చేసి పలుచటి స్టీలు చాకుతో కావలసిన ఆకారంలో కట్ చేసి నెయ్యిరాసిన ప్లాస్టిక్ ట్రేలో ఉంచి ఒవెన్ లో 15 నిమిషాల పాటు 300 డిగ్రీల ఫారన్ హీట్ వద్ద బేక్ చేయాలి.
(ఒవెన్ లేకపోతే కుక్కర్ లో గానీ, మూత ఉన్న మంద పాటి పాత్రలో గానీ ఇసుక పోసి స్టౌ మీద పెట్టి పదినిమిషాలు ఉంచాలి. కుక్కర్ లో పెట్టేటట్లైతే గాస్ కట్ తీసేయాలి) ఇసుక వేడెక్కిన తర్వాత బిస్కెట్స్ ప్లేట్ పెట్టాలి. ప్లేట్ మందంగా లోతుగా ఉండేటట్లు చూసుకోవాలి. పది నిమిషాల తర్వాత తీసి చూస్తే బూస్టీ టేస్టీ బిస్కెట్స్ రెడీ.

రాగి లడ్డు

కావలసిన పదార్ధాలు:
రాగిపిండి: 1cup
బెల్లం తురుము: 1cup
పల్లీలు: 1cup
నెయ్యి: 1cup
జీడిపప్పు: 8
నువ్వులు: 1cup
బాదం పప్పు: 1/2cup
యాలకల పొడి: 1tsp
ద్రాక్ష: 8

తయారు చేయు విధానము:
1. మొదటగా స్టౌవ్ పై కడాయి పెట్టి అందులో విడివిడిగా పల్లీలు, నువ్వులు, బాదం పప్పు, జీడిపప్పు, రాగి పిండి వేయించి పెట్టుకోవాలి.
2. మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకొన్న పల్లీలు, నువ్వులు, బాదం పప్పు, జీడిపప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
3. ఈ తర్వాత ఈ మిశ్రమానికి పైన వేయించి పెట్టుకున్న రాగిపిండి కలిపి, దాంతో పాటు ఒక కప్పు బెల్లం తురుము, ఒక కప్పు నెయ్యి, యాలకల పొడి వేసి బాగా కలిపి లడ్డుగా చేసుకుని పైన జీడిపప్పు, ద్రాక్షతో గార్నిష్ గా అలంకరిస్తే రాగి లడ్డు రెడీ. (రాగి పిండి మరీ పొడిగా ఉంటే కొద్దిగా పాలు కలిపి లడ్డులా చేసుకోవచ్చు)

మార్కెట్ లోకి సరికొత్త మారుతీ సుజుకీ ఆల్టో కారు

మారుతీ సుజుకీ సంస్థ మారిన ఆటోమొబైల్ ప్రమాణాల ప్రకారం భారత్ స్టేజ్-IV నిబంధనలకు అనుగునంగా సరికొత్త మారుతీ సుజుకీ ఆల్టో కారును విడుదల చేసింది. ఇంజన్ లో ఏ మార్పులూ చోటు చేసుకోని ఈ కారు769 సిసి ఇంజన్ సామర్థ్యంతో రూపొందింది. ఇంతకు ముందు వెర్షన్ కారులాగే ఈ కారు కూడా LX, LXI మరియు STD మోడళ్లలో లభ్యం అవుతుంది.

ఇక ఈ కారులో మార్పులు చేసుకున్నా కారు ధర మాత్రం పెరగకపోవడం విశేషం. ఈ కారు మునుపటిలాగే రూ 2.2 లక్షల నుండీ రూ 2.7 లక్షల మధ్యలో అందుబాటులో వుంటుంది.

మ్యాంగో ఫ్రైడ్ రైస్

కావలసిన పదార్ధాలు:
అన్నం: 4cups
మామిడి తురుము: 2cups
కొబ్బరి తురుము: 2cups
మొలకెత్తిన పెసళ్లు: 2cups
మినపప్పు: 3tsp
నువ్వులు: 3tsp
కొత్తిమీర తరుగు: 3tsp
జీడిపప్పు: 50grms
శెనగపప్పు: 2tsp
మినప్పప్పు: 2tsp
పోపుదినుసులు: 2tsp
పసుపు: 1/4tsp
ఆయిల్: తగినంత
ఉప్పు రుచికి సరిపడా

తయారు చేయు విధానము:
1. మొదటగా నువ్వులు, మినప్పప్పులను వేయించి పొడిచేసి పెట్టుకోవాలి.
2. ఇప్పుడు పొడి పొడిగా వార్చిన అన్నంలో నువ్వులు, మినప్పప్పు పొడితోపాటు మామిడి, కొబ్బరి తురుము, పసుపులను వేసి బాగా కలియబెట్టాలి.
3. తర్వాత మొలకెత్తిన పెసళ్లను ఉడికించి ఉంచి పెట్టుకోవాలి.
4. ఇప్పుడు బాణలిలో కాస్త నూనె వేసి జీడిపప్పు, శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా వేయించాలి.
5 అందులోనే క్యాప్సికం, క్యారెట్ తరుగు, పెసళ్లను వేసి మరికాసేపు వేయించాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలపాలి. చివర్లో కొత్తిమీర తరుగు పైన చల్లాలి. అంతే రుచికరమైన మ్యాంగో ఫ్రైడ్‌రైస్ రెడీ.

చెమటకు “కరివేపాకు”తో చెక్

అధిక చెమటతో తడిసి ముద్దయ్యేవారు పెరటి మొక్క “కరివేపాకు” ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే ఫలితం ఉంటుంది. కరివేపాకు శరీరంలో వేడిని తగ్గించటమేగాకుండా, అధిక చెమట బారినుంచి రక్షిస్తుంది. అలాగే చెమట చెడువాసను కూడా తగ్గిస్తుంది. దీనిని వివిధ రకాల ఆహార పదార్థాలతోపాటు తీసుకోవచ్చు లేదా పొడి చేసుకుని వాడుకోవచ్చు.

ఎన్నో ఔషధ గుణాలున్న ఈ కరివేపాకు చెట్టు పెరట్లో ఉండటం చాలా మంచిది. ఎందుకంటే దీనినుంచే వీచే గాలి కూడా ఆరోగ్యకరమైనదే కాబట్టి. వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉన్నచోట్ల కరివేపాకు చెట్లను నాటినట్లయితే గాలి శుభ్రపడుతుంది. విషప్రభావం కలిగించే వాయువులు ఈ మొక్క ద్వారా శుద్ధి అవుతాయి.

కరివేపాకు చెట్టులోని ఆకులు, బెరడు, వేరు, గింజలు, పువ్వులు.. అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినట్టివే. వగరుగా ఉన్నప్పటికీ సువాసనాభరితంగా ఉన్న కరివేపాకులో ఐరన్ పుష్కళంగా లభిస్తుంది. ఇది శరీరానికి మంచి బలాన్నిస్తుంది. ముఖ్యంగా అనీమియా (రక్తహీనత) వ్యాధితో బాధపడేవారు కరివేపాకును ఆహారంలో ఎక్కువగా తీసుకున్నట్లయితే చక్కని ఫలితం పొందవచ్చు.

కరివేపాకు పేగులకు, కడుపుకు బలాన్ని ఇవ్వటమే కాకుండా.. శరీరానికి మంచి రంగును, కాంతిని ఇస్తుంది. అజీర్ణాన్ని అరికట్టి ఆకలి పుట్టిస్తుంది. న్యూమోనియా, ఫ్లూ.. లాంటి ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సలో కూడా కరివేపాకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. అదే విధంగా మలబద్ధకంతో బాధపడేవారికి, మొలల సమస్యతో సతమతం అయ్యేవారికి కూడా కరివేపాకు దివ్యౌషధమనే చెప్పవచ్చు.

పాదాల పగుళ్ళ నివారణ

పాదాల పగుళ్ళు సాదారణము గా పొడి చర్మము ఉన్న వాళ్ళకి , మధుమేహ వ్యాధి గల వారికి ఎక్కువగా బాధపెడతాయి .

కారణాలు :

* శరీరములో అధిక వేడి ,
* పొడి చర్మము ,
* ఎక్కువ సేపు నిలబడి పనిచేయువారికి ,
* కటిన నేలపై నడవడం ,
* ఎత్తైన చెప్పులు ధరించి నడవడం ,
* అధిక బరువు కలిగిఉండడం ,
* పోషకాహార లోపము ,
* మధుమేహ వ్యాది ,

పరిష్కార మార్గాలు >

* రొజూ నిద్రించటానికి ముందు కాళ్ళను శుభ్రపరుచుకుని తడుచుకోవాలి .
* పగుల్లపై కొబ్బరి నునే తో మృదువుగా మర్దన చేసి మందం గా ఉండే సాక్సులు ధరించాలి .
* ప్రతిరోజూ ఉదయం పాత బ్రష్ తో రుద్ది గోరువెచ్చని నీటిలో కడిగితే మురికి , మ్రుతకనలు పోయి నున్నగా తయారవుతాయి .
* అరటిపండును ముద్దగా చేసుకొని పగుళ్ళ పై రాసి పదినిముసాలు వుంచి తరువాత నీటితో శుభ్రపరచుకుంటే పాదాలు మెట్టబడతాయి .
* గోరువెచ్చని నీటిలో కొంచెము నిమ్మరసం వేసి అందులో పదాలను వుంచి పది నిముషాలు తరువాత మామూలు నీటితో శుభ్రపరచుకునే పగుళ్ళ ఉండే నొప్పి తగ్గుతుంది .
* ప్రతి రోజు సాయంత్రం రోజ్ వాటర్ ను పళ్ళెం లో వేసి పది నిముషాలు పాదాలు ముంచి ఉంచితే మృదువు గా తయారవుతాయి .
* నిమ్మరసము వ్యాజ్ లైన్ వేసిన గోఫువేచ్చని సబ్బుద్రావనం లో పాదాలను పెట్టి 10 నిముషాలు అయ్యాక పొడి వస్త్రం తో తుడిచి నాణ్యమైన మాయిశ్చరైజర్ రాయాలి .
* ఉదయం ఆవన్ర్న్ర్ తో కాళ్ళను మర్దన చేసుకుంటే పగుళ్ళు మెత్తబడి కొద్దిరోజులకు తగ్గిపోతాయి .
* రోజు మంచి పోషకాహారము తీసుకోవాలి .

ఆరోగ్యానికి మంచి ఔషధం: పుదినా

అచ్చమైన పెరటి ఔషధం పుదీనా. ఆరోగ్యానికి ఎంతగానో మేలుచేసే పుదీనా వేసవితాపంతో వేడక్కిన శరీరంలో వేడిని తగ్గించి, చల్లదనాన్ని ఇస్తుంది. ఇందుకోసం శుభ్రమైన తాజా పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి, శరీరానికి పట్టించి ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత చల్లటి నీటితో స్నానం చేస్తే వేసవిలో శరీరంలో పెరిగిన వేడి మటుమాయం అవుతుంది. ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే, మజ్జిగలో పుదీనా ఆకులను కలిపి తాగాలి.

కడుపులో వికారంగా అనిపించినప్పుడు పుదీనా వాసనను చూస్తే, వికారం మటుమాయం అవుతుంది. వాంతులతో బాధపడేవారు సైతం పుదీనా పచ్చడి తినటంవల్ల కోలుకుంటారు. గర్భిణిలలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పుదీనా పచ్చడి ఔషధంగా పనిచేస్తుంది. అదేవిధంగా తలనొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను ముద్దగా చేసి నుదుటిపై ఉంచితే ఉపశమనం లభిస్తుంది. అపస్మారక స్థితిలో వెళ్లినవారికి రెండు చుక్కల పుదీనా రసం ముక్కులో వేస్తే కోలుకుంటారు.

చిన్న పిల్లలు కడుపునొప్పి, కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటే గోరువేచ్చని నీటిలో ఐదారు చుక్కల పుదీనా రసం కాచి తాగించడం వలన ఉపశమనం కలుగుతుంది. చిన్న పిల్లలకు జలుబు చేస్తే పుదీనా నుండి తయారయ్యే మెంథాల్ ముద్ద, కర్పూరం, కొబ్బరి నూనెలతో మిశ్రమం చేసి ఛాతికీ వీపునకు రాస్తే జలుబు తగ్గుతుందని ఆయుర్వేదం సూచిస్తోంది. నోటి దుర్వాసనతో ఇబ్బందిపడేవారు పుదీనా రసాన్ని నీటిలో కలిపి పుక్కిలించడం ద్వారా క్రిములను దూరంగా ఉంచి దుర్వాసనను పోగొట్టవచ్చు.

గొంతు నొప్పితో బాధపడేవారు పుదీనా కషాయంలో ఉప్పు కలిపి పుక్కిలిస్తే సమస్య తొలగుతుంది. దంత వ్యాధులతో బాధపడేవారు సైతం ప్రతిరోజూ పుదీనా ఆకులను నమిలితే ఫలితం ఉంటుంది. గర్భిణిలలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పుదీనా పచ్చడి ఔషధంగా పనిచేస్తుంది. పుదీనా రసం తాగటంవల్ల తరచుగా వచ్చే వెక్కిళ్లను కూడా తగ్గించవచ్చు. జలుబు చేసినప్పుడు మరిగే నీటిలో కాస్త పసుపు మెంథాల్ వేసి ఆవిరిపడితే జలుబు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు తరచూ పుదీనా తింటే ఎంతో మంచిది.

సమ్మర్ స్సెషల్ టమోటో ప్రెష్ జ్యూస్

కావలసిన పదార్ధాలు:
హైబ్రీడ్ టమోటో: 200 grm
క్యారెట్ ముక్కలు: 1 cup
పంచదార: 1 cup
నిమ్మరసం: 2 tsp
యాలకల పొడి: 1/2 tsp
మిరియాల పొడి: 1/2 tsp
ఐస్ క్యూబ్స్: 4
నీళ్లు: 1/2 ltr

తయారు చేయు విధానము:
మిక్సీ జార్ లో టొమోటో, క్యారెట్ ముక్కలు, ఐస్ క్యూబ్స్, పంచదార, యాలకుల పొడి, మిరియాల పొడి, నిమ్మరసం, నీళ్లు, అన్నింటినీ వేసి మెత్తగా గ్రైండ్ చేసి టొమోటో జ్యూస్ రెడీ.

వడదెబ్బకు దివ్యౌషధం “పచ్చి మామిడి”

వేసవితాపం భరించలేక వడదెబ్బకు గురయ్యేవారు పచ్చి మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక గ్లాసు నీటిలో వేసి.. దాంట్లోనే కాస్త చక్కెర వేసి బాగా కలపాలి. కాసేపటి తరువాత ఈ ద్రవాన్ని తాగినట్లయితే వడదెబ్బ బారినుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే పచ్చి మామిడి ముక్కలపై కాస్త ఉప్పు వేసి తినటంవల్ల అధిక దాహాన్ని అరికట్టడమేగాకుండా.. చెమట ద్వారా శరీరంలోని లవణాలు, రక్తంలోని ఐరన్ తదితరాలు బయటకు పోకుండా ఆపుతుంది.

వేసవిలో సంభవించే డయేరియా, రక్త విరేచనాలు, పైల్స్, వికారం, అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యలకు టెంక పూర్తిగా ఏర్పడని పచ్చి మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటికి ఉప్పు, తేనెను కలిపి తింటే అద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తుంది. ఇంకా.. పచ్చి మామిడికి మిరియాలు, తేనె కలిపి తిన్నట్లయితే.. జాండీస్ (పచ్చ కామెర్లు) వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. అంతేగాకుండా మామిడి గుండెకు మంచి టానిక్‌లాగా పనిచేస్తుంది.

పచ్చి మామిడికాయలో విటమిన్ సీ పుష్కళంగా లభిస్తుంది. గుండె కండరాలను బిగుతుగా చేసే శక్తి మామిడికి ఉంది. అలాగే చర్మాన్ని మిలమిలా మెరిసేలా చేసే శక్తి కూడా దీనికి అధికంగా ఉంది. అయితే అతి అనేది అన్ని వేళలా సరికాదు కాబట్టి.. ఎక్కువ మోతాదులో పచ్చిమామిడిని తినకూడదు. అలా తిన్నట్లయితే ఆర్ధరైటిస్, కీళ్లవాతం, సైనసైటిస్, గొంతునొప్పి, అసిడిటీ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మామిడిని పరిమితంగా తినటం మంచి పద్ధతి.

లంచ్ బాక్స్లు బావున్నాయి కదా!

This slideshow requires JavaScript.

లంచ్ బాక్స్లు బావున్నాయి కదా! మీ పిల్లలికి కూడా ఇలాగె సద్ది ఇవ్వండి రోజు వదిలేయకుండా తినేస్తారు.