పత్తి నూలుకు మంచిరోజులు

టెక్స్‌టైల్‌ మిల్లులు పత్తినూలు సరఫరాను ఆపివేయడంతో వీవింగ్‌ దుస్తుల తయారీ రంగంలో ఉండే కంపెనీలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఒక తిరు పూర్‌లోనే ప్రతి నెలా 27 నుంచి 30 మిలియన్‌ కేజీల పత్తినూలు అవసరం ఉంటుంది. అంత ర్జాతీయంగా పత్తి ధర పెరగడం వల్ల నూలు ఇంకా మంచి ధర వస్తుందని, నూలు మిల్లులు తమ సరఫరాలను ఆపివేస్తున్నట్లు తెలుస్తున్నది. ఏప్రిల్‌ నెల నుంచి నూలు ధరలు పెరుగు తాయన్న అభిప్రాయంతో నూలు తయారీ దారులు తమ నూలును నిల్వ ఉంచుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 40 కౌంట్‌ నూలు ధర 2009 ఆగస్టులో కిలో రూ.139 ఉండేది.

ఇప్పుడు అది రూ.170కి అమ్ముడవుతుంది. ఈ సీజన్‌లో పత్తి ధర బాగా పెరగడం వల్ల కూలీ రేట్లు పెరగడం వల్ల విద్యుత్‌ కొరత ఎక్కువ కావడం వల్ల జన్‌సెట్లు వినియోగించడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుందని, అందువల్ల నూలు ధర పెంచకతప్పడం లేదని నూలు మిల్లులు పేర్కొంటున్నాయి. గతంలో రోజువారీ కూలీ రూ.100 నుంచి 120 ఉంటే ప్రస్తుతం అది రూ. 170కి పెరిగింది. ఈ రేటు ఇచ్చినప్పటికీ కూలీలు దొరకడం లేదు. ఇది ఇలావుండగా ఆంధ్రప్రదేశ్‌లో వారంలో 50 నుంచి 60 గంటలు విద్యుత్‌ కొరత ఉంటుంది.తమిళనాడులో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. అయితే జనవరిలో యూనిట్‌ ఏడు రూపాయలకు సరఫరా చేసిన తమిళనాడు విద్యుత్‌ బోర్డు ఫిబ్రవరిలో ఆ ధరకు సరఫరా చేయలేకపోయింది.

అలాగే పత్తి ధర 355 కేజీలు రూ. 25,700 జనవరి నెలలో ఉంటే ప్రస్తుతం అది రూ. 27,900 స్థాయిలో ఉన్నది. సీజన్‌ ముగిసేలోగా అది రూ. 30వేల స్థాయికి దాటుతుందని అంచనా. ఇదే సమయంలో పత్తి ఎగుమతులు పెరుగుతున్నాయి. మొత్తం ఈ సంవత్సరం 55 లక్షల బేళ్ల పత్తి ఎగుమతి జరుగుతుందని అంచనా.ఈ సీజన్‌ మొదటి ఐదు నెలల్లో ఇప్పటికే 40 లక్షల బేళ్ల పత్తిని ఎగుమతి చేసారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి మంచి ధర లభించడం వల్ల పత్తి వ్యాపారులు ఎగుమతికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

సకాలంలో చెల్లింపులు చేసిన వారికి నూలును వెంటనే సరఫరా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని మిల్లు యజమానుల సంఘం మాజీ ఛైర్మన్‌ మాణిక్యం రామస్వామి చెబుతున్నారు. ప్రస్తుతం నూలు సరఫరా చేసిన తర్వాత 60 నుంచి 90 రోజుల వరకు చెల్లింపులు జరగడం లేదు. తమకు 30 రోజుల్లో చెల్లింపులు కావాలని మిల్లులు డిమాండు చేస్తున్నాయి. తాము పత్తి కొనుగోలుకు నగదు చెల్లించాల్సి వస్తున్నదని, తాము విక్రయించే నూలు చెల్లింపుల కోసం 60 నుంచి 90 రోజులు ఎదురు చూడాల్సి వస్తుందని వారు చెబుతున్నారు.చైనా, బంగ్లాదేశ్‌, టర్కీలలో ఈ సంవత్సరం నూలుకు మంచి గిరాకీ ఏర్పడింది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s