పురాతన కాలంగా వస్తున్న భారతీయ సాంప్రదాయాల్లో తిలకధారణ ఒకటి. ఆలనాటి మహిళలు నుదుటన తిలకాన్ని దిద్దుకునేవారు. నేటి ఆధునిక యుగంలో తిలకధారణ స్థానంలో స్టిక్కర్లు చోటుచేసుకున్నాయి.
పలు రకాలుగా అందుబాటులో ఉన్న స్టిక్కర్లు నేటి యువతరాన్ని పెద్దఎత్తున ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం స్టిక్కర్లు ప్లాస్టీక్లో మాత్రమే కాకుండా ప్లాటినం, బంగారు, వెండి వంటి ఖరీధైన వస్తువులతో తయారవుతున్నాయి. ఆధునిక యువతలు అధికంగా వాడేవి మెరిసే స్టోన్స్ పొదిగిన స్టిక్కర్లే.
రంగు రంగుల స్టోన్స్ పొదిగిన స్టిక్కర్లలో వంగ పూత, నెమలి, పాము, హంస అంటూ తదితర ఆకృతులలో మిలమిలమెరిసే స్టిక్కర్ బొట్లు మార్కెట్లో విరివిగా లభ్యమవుతున్నాయి. రాత్రి పూట పార్టీలకు వెళ్ళే స్త్రీలు చెమ్కీలు, చిన్న చిన్న గజ్జెలు పొదిగిన స్టిక్కర్లను పెట్టుకునేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు.
so nice,but edi kaka a face ki a bottu saripotundo teliyacheste baguntundi.