ఈశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు పద్మాసనంలో ద్యానయోగంలో ఉన్నట్లుపురాణాలలో వర్ణించబడి ఉంది.లక్ష్మీదేవి ఎప్పుడు పద్మాసినియే,మహా విష్ణువు నిద్రను యోగనిద్రగా వర్ణించ బడినది.తాపసులు తమ తపసును పద్మాసనంలో అనేకంగా చేసినట్లు పురాణ వర్ణన.ఇంకా లెక్కకు మిక్కిలి ఉదాహరణలు హిందూ సంప్రదాయంలో చోటు చేసుకున్నాయి.బుద్ధ సంప్రదాయంలో,జైన సంప్రదాయంలోను ,సన్యాస శిక్షణలోను యోగా ప్రధాన పాత్ర పోషిస్తుంది.సింధు నాగరికత కుద్య చిత్రాల ఆధారంగా యోగా వారి నాగరికతలో భాగంగా విశ్వసిస్తున్నారు.
భగవద్గీతలో యోగములు:
భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయానికి “యోగము” అనే పేరు ఉంది. ఇక్కడ “యోగం” అనే పదం సామాన్య యోగాభ్యాసం కంటే విస్తృతమైన అర్ధంలో, జ్ఞాన బోధ లేదా మార్గం అనే సూచకంగా వాడబడింది.
* అర్జునవిషాద యోగము: యుద్ధ భూమిలో తాతలు తండ్రులు, సోదరులు, గురువులు,మేనమామలు మొదలైన ఆప్తులను శత్రు సేనలో చూసిన అర్జునుడు వారిని వధించవలసి వచ్చినందుకు అర్జుని కమ్ముకున్న విషాదము గురించిన వర్ణన.
* సాంఖ్య యోగము:- ఆత్మ స్వరూపము గుణగణాల వర్ణన.
* కర్మ యోగము:- కర్మ చేయడంలో నేర్పు,దానిని యోగములా మార్చుకోవడం ఎలా అని చెప్పే యోగము.
* జ్ఞాన యోగము:- నర,నారాయణూల జన్మలు,భగవంతుని జన్మలోని శ్రేష్టమైన గుణాలు.జ్ఞాన సముపార్జన మార్గాల వివరణ.
* కర్మసన్యాస యోగము:- కర్మలను ఫలితాలను సన్యసించి భగవంతునికి అర్పించి ఆయన ఇచ్చిన దానిని ప్రసాదంగా స్వీకరించడం ఎలా అన్న వివరణ.
* ఆత్మసంయమ యోగము:- ధ్యానము,ఏకాగ్రతల ద్వారా మనోనిగ్రహము సాధించడము,ఆహారనియమాలు,సాధనా ప్రదేశము ఏర్పాటు వర్ణన.యోగి గుణగాణాల వర్ణన,భగవంతుని సర్వవ్యాఇత్వము,యోగభ్రష్టత ఫలితాల వర్ణన.
* జ్ఞానవిజ్ఞాన యోగము:- భగవంతుని,ఉనికి,గుణగనాలు,ప్రకృతి,మాయని జయించడము.మోక్షగామి గుణగణాల వర్ణన.
* అక్షరపరబ్రహ్మ యోగము:- బ్రహ్మతత్వము,ఆధ్యాతకత,కర్మతత్వము,ఆది దైవతము,ఆది భూతముల వర్ణన.జీవుని జన్మలు,జీవ ఆవిర్భావము,అంతము,పుణ్యలోక ప్రాప్తి,అత్యకాలములో భగవన్నామస్మరణ ఫలం.
* రాజవిద్యారాజగుహ్య యోగము:- మోక్ష ప్రాప్తి వివరణ.భగవతత్వము,స్వర్గలోకప్రాప్తి,దేవతారాధనా వాటిఫలము,భక్తుల గుణగణాల వర్ణన.
* విభూతి యోగము:-భగవంతుని చేరే మార్గము.భగవంతుని విశ్వ వ్యాపికత్వము వర్ణన.
* విశ్వరూపసందర్శన యోగము:- విశ్వరూపము గురించిన విస్తారమైన వర్ణన.
* భక్తి యోగము:- భక్తి యోగ వర్ణన.భగవంతుని ప్రియము పొందలిగిన భక్తుని గుణగణాల వర్ణన.
* క్షేత్ర క్షేత్రజ్ఞవిభాగ యోగము:- ప్రకృతి పురుషులు,క్షేత్రము క్షేత్రజ్ఞుల గురించిన జ్ఞానము తెలిపేది.
* గుణత్రయవిభాగ యోగము:- సత్వగుణము,రజోగుణము,తామసగుణము వివరణ,వారి ఆహారవ్యవహారాల వర్ణన.
* పురుషోత్తమప్రాప్తి యోగము:- భగవంతుని స్వరూపము తత్వము పురుషోత్తముని చేరే మార్గము వివరణ.
* దైవాసురసంపద్విభాగ యోగము:- దైవీగుణసంపద,అసురీగుణసంపద కవారి ప్రవృత్తి,ప్రవర్తన ఆలోచనాదుల వర్ణన.
* శ్రద్దాత్రయవిభాగ యోగము:- సత్వ,రాజసిక,తామసికములనబడే మూడు విధములుగా గుర్తించిన శ్రద్ధలను గురించిన వివరణ.
* మోక్షసన్యాస యోగము:- మోక్ష ప్రాప్తికి కావలసిన జ్ఞానము,సన్యాసము గురించిన వర్ణన.
గురువుద్వారా ఆత్మ జ్ఞానాన్ని స్వీకరించి, మౌనమే ఆత్మకు మారుపేరు.కొన్నివందల ఉపన్యాసాలు,గ్రంథాలు చేయలేని పనిని జ్ఞాని కొన్ని క్షణాల మౌనం ద్వార సాధకునిలో వివేకాన్ని నింపగలడు.ఎన్ని శాస్త్రాలభ్యసించినా,ఎన్ని సాధనలు ,పుణ్యకర్మలు ఆచరించినా ఒక మహాజ్ఞాని చూపుకు సాటిరావు.జ్ఞానితో సాహచర్యం సాథనలోకెల్లా గొప్పసాధన. తనను తాను తెలుసుకోవడమే జీవితాశయం,ఈ విషయం మర్చిపోవడమే మాయ.ఆత్మ జ్ఞానానికి మనసులో ఉండే వాసనలు.ఇవి నిరంతర ప్రయత్నపూర్వకంగా,గురువు గ్రహంతోను దూరమవుతాయి.గురువుగ్రహం వలనే ఎవరికైనా . తనను తాను తెలుసుకోవడమే జీవితాశయం తెలుసుకోవాలనే వాంచ పుడుతుంది.భగవంతునికి,అనుగ్రహానికి,ఆత్మకు తేడాలేదు.అంతా ఒకటే. అగ్నినుండి వేదాంత సారమంతా ఒక్కమాటలో చెప్పాలంటే భగవంతుడు మనిషితో అంటున్నాడు.ఓ మానవుడా నేను నీ హృదయంలోనే వున్నాను.నీవెవరివో తెలుసుకో’’
మనస్సు చంద్రుని లాంటిది , ఆత్మ సూర్యుని లాంటిది.ఆత్మనుండి వచ్చిన వెలుగుతో మనసు ప్రపంచాన్ని చూస్తుంది,వ్యవహరిస్తుంది.జీవితంలో సాధన చేయాల్సిందంతా మనస్సును స్వాధీనం చేసుకోవడంలోనే ఉంది.మనసు ఆడించి నట్లు మనిషి ఆడకుండా దానిని ఆధీనం చేసుకోవడంలోనే మనిషి లక్ష్యం.దురభ్యాసాలు,పూర్వజన్మ వాసనలు,మధ్యలో వచ్చే ఆటంకాలు …వీటిని ఎదుర్కోవడానికి పురుష ప్రయత్నం అవసరం.అసలు ప్రయత్నం లేకుండా గురువుకటాక్షం దొరకదు. శ్రీ రత్నం గారికి,
బాలయ పల్లె గ్రామం
ఎస్. ఆర్ . పురం మండలం
నెల్లూరు