తారాగణం : దగ్గుబాటి రాణా, ప్రియాఆనంద్ , రిచా గంగోపాధ్యాయ,సుహాసిని, సుమన్, కోట శ్రీనివాసరావు ,హర్షవర్ధన్, ఆహుతిప్రసాద్, సుబ్బరాజు, తనికెళ్ళ భరణి తదితరులు.
కధ , మాటలు : శేఖర్ కమ్ముల
ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం : మిక్కీ జే మేయర్
నిర్మాతలు : శరవణన్ , గుహన్
దర్శకత్వం : శేఖర్ కమ్ముల
భారీ అంచనాల మద్య వాయిదా పడుతూ వస్తున్న లీడర్ ఎట్టకేలకు ఫిబ్రవరి 19 న విడుదల అయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో , ప్రతిష్టాత్మక ఎవిఎం బానర్ పై దగ్గుబాటి రాణా హీరోగా నిర్మితమైన ఈ సినిమా పై చాలా అంచనాలు ఉన్నాయి. మరి ప్రేక్షకుల అంచనాలు లీడర్ అందుకున్నాడా లేదా అనేది చూద్దాం.
నటీనటుల పని తీరు : రాణా మొదటి చిత్రం తోనే భేష్ అనిపించుకోవడం ఖాయం . నిండైన విగ్రహంతో బాటు , చక్కని వాచకం కూడా ఉన్న ఇతను సినీ జగత్తులో ఒక వెలుగు వెలుగుతాడు అనడంలో సందేహం లేదు. కొత్త వాడన్న బెరుకు ఎక్కడా కనపడనీయకుండా డైలాగులు చక్కగా స్ప్రష్టంగా చెప్పాడు . సినిమాలో డాన్స్ కి అవకాశం లేనందున ఇతని డాన్స్ చూసే అవకాశం లేకుండా పోయింది.
హీరోయిన్ లు ఈ సినిమా కి పెద్ద మైనస్ ప్రియా ఆనంద్ గురించి యెంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రిచా పర్వాలేదనిపించింది.
కోటా పాత్ర చాలా సీరియస్ గా ఉంటుంది . ఈయన్ని శేఖర్ కమ్ముల సరిగా వాడుకోలేదనిపించింది. సుబ్బరాజు తన పరిధిలో బాగా చేశాడు. హర్షవర్ధన్ కూడా ఓకే అనిపించాడు .రావు రమేష్ చేసింది చిన్న పాత్ర అయినా బాగా చేశాడు. ఒక పాటలో నర్తించిన ఉదయభాను బట్టలు బాగా తక్కువ వేసుకుంటే తను ఎలా ఉంటుందో చూపించింది.
ప్రేమ సందేశాలిచ్చే శేఖర్ కమ్ముల ఈ సినిమాలో రాజకీయ సందేశాలెక్కువ ఇచ్చి సరుకు తక్కువ చేశాడు . మొదటి సగం బాగా ఎక్కడా బోర్ కొట్ట కుండా తీస్తే రెండో సగం నిడివి ఎక్కువయ్యింది.. కధంతా పదవిని నిలబెట్టు కోడానికి వేసే ఎత్తులు మీద తిరుగుతుంది. కారంచేడు దహన సంఘటన , ఎవరి సత్తా బట్టి వాళ్ళకి వృత్తులు నిర్ణయించడం జరిగిందని , అందులో పుట్టిన వాడు వేరే వృత్తులు పదవులు చేస్తా అంటే కుదరదని పెద్దాయన (కోట) చేత చెప్పించడం వివాదం అవడానికి ఆస్కారం ఉంది. .కామెడి ఎక్కడా లేదు కనీసం చిరు మంద హాసానికి కుడా అవకాశం లేదు .స్పీకర్ స్థానం లో వ్యక్తి కూర్చోండి ప్లీజ్ ……….సిడవును ప్లీజ్ అనప్పుడు మాత్రం కొద్ది మంది నవ్వారు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ని గుర్తు తెచ్చు కుని .
మొత్తానికి సినిమా కాలక్షేపానికి చూడాల్సిందే ……….వేరే సినిమాలు లేవుగాబట్టి .