తారాగణం : అక్కినేని నాగచైతన్య, సమంతా , కృష్ణుడు, పూర్ జగన్నాద్ , కృష్ణుడు , సురేఖా వాణి, సంజయ్ స్వరూప్సంగీతం ; ఏ.ఆర్. రెహమాన్
నిర్మాతలు : మంజుల , సంజయ్ స్వరూప్
దర్శకత్వం : గౌతం మీనన్
కధ కమామిషు : కార్తీక్ ( నాగ చైతన్య ) ఇంజనీరింగ్ విద్యార్ధి . సినిమా డైరక్టర్ అవడం అతని కోరిక . కానీ అతని తండ్రి ఒప్పుకోడు . ఇంజినీరింగ్ పూర్తి చేసిన కార్తీక్ తన స్నేహితుని ( కృష్ణుడు) సాయంతో ఒక డైరక్టర్ ( పూరీ జగన్నాద్ ) వద్ద అసిస్టెంట్ డైరక్టర్ గా చేరుతాడు. సరిగ్గా ఇదే సమయానికి అతని జీవితంలోకి జెస్సీ ( సమంతా) అనే క్రిష్టియన్ అమ్మాయి ప్రవేశిస్తుంది. తొలి చూపులోనే అమ్మాయి ప్రేమలో పడతాడు కార్తీక్ . కార్తీక్ హిందూ అయినా క్రిష్టియన్ అయిన జెస్సీ ని గాడంగా ప్రేమిస్తాడు . అదీ కాక కార్తీక్ వయసు 22 ,జెస్సీ వయసు 24. ఇదే కధలో అసలైన పాయింట్. తమ మద్య ఉన్న వయసు భేదాన్ని పట్టించుకోకుండా ఆమె వెంట పడుతూ ఉంటాడు . కొన్నాళ్ళకి జెస్సీ అతనికి ఓకే చెబుతుంది . ఆమె చేత ఒఒప్పించుకోవడాని కార్తీక్ చేసిన కొన్ని పనుల వల్ల అతనికి కొన్ని చిక్కులు వస్తాయి అవి కార్తీక్ ఎలా పరిష్కరించుకున్నాడు , డైరక్టర్ అవ్వాలనే తన లక్ష్యం నెరవేరిందా అనేది తెర మీద చూడాలి.
నటీనటుల పనితీరు : నాగ చైతన్య మొదటి సినిమా కన్నా ఈ సినిమాలో నటనలో పరిణితి కనబరిచాడు , హావభావాల విషయంలో మరి కాస్త మెరుగుపడాల్సి ఉంది . డైలాగ్ డెలివరీ పర్వాలేదు,. సమంతా చక్కగా చేసింది . నటన , ఎక్స్ప్రెషన్స్ అన్నీ చాలా బాగున్నాయి . హీరోయిన్ గా నిలదొక్కుకునే చాన్స్ లు ఉనాయి. పూరీ జగన్నాద్ సహజంగా నటించేసాడు. మిగతా పాత్రలన్నీ తమ తమ పరిధిలో చేశారు.
ఈ సినిమా యువతకి అందులోనూ ప్రేమలో మునిగి తేలే వారికి చక్కగా నచ్చుతుంది . ప్రేమ , కెరీర్ ఈ రెండిటి మద్య నడిచే కధ కనుక కాలేజీ యువత కి బాగా నచ్చే అవకాశం కూడా ఉంది. “4 ఫైట్లు, ఆరు పాటలు రెండు కామెడీ సీన్లతో సినిమా ఎన్నాళ్ళు చూస్తారు అందుకే మా సినిమాలో అవేమీ ఉండవు డిఫరెంట్ గా తీసాం” అని నిర్మాత మంజుల ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమాలో ఎక్స్పొసింగ్ లు లేవు , భారీ ఫైట్లు లేవు . మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోఇవడం కష్టం . కాలేజీ యువత మీదే సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది.
రెహమాన్ అందించిన అద్బుత సంగీతానికి తగినట్టు సినిమా మొదటి భాగం లో పాటలకి గౌతమ్ మీనన్ న్యాయం చేయలేదు అనిపిస్తుంది. రెండవ భాగం లో పాటలు బాగున్నాయి . మొత్తానికి సినిమాని కళ్ళతో కాకుండా మనసుతో చూడాలి.