అందాన్ని ఆరోగ్యాన్ని పెంచే ఆరెంజ్ పండు

“ఆరెంజ్‌ క్లాటస్‌ ఆరంటమ్‌” అనే శాస్త్రీయ నామం కలిగిన నారింజ పండ్లు చలికాలంలో ఎక్కువగా దొరుకుతుంటాయి. ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచే సుగుణాలను తనలో నింపుకున్న నారింజను ఇంగ్లీషులో ఆరెంజ్‌, సంస్కృతంలో “నారంగ-ఐరావతి”, హిందీలో “నారంగీ, సంతరా”, బంగ్లాలో “కమలా రేఖ” అనే పేర్లతో పిలుస్తుంటారు.

నారింజ పండు కఫం, వాతం, అజీర్ణాలను హరిస్తుంది. శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. మూత్ర విసర్జన ప్రక్రియను సరళతరం చేస్తుంది. ముదిరిన నారింజ కాయలను కోసి, ఉప్పులో ఊరబెట్టి, ఎండబెట్టి, కారం మరియు మెంతిపొడి కలుపుకున్నట్లయితే… ఊరగాయలా నిల్వ ఉంటుంది. రుచిగా ఉండటమే కాక, ఆరోగ్యాన్ని కూడా వృద్ది పరుస్తుంది.

నారింజలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్‌లు కూడా ఉన్నాయి. జ్వరాల బారిన పడి జీర్ణశక్తి తగ్గినప్పుడు… నారింజను వాడితే అజీర్ణ సమస్యల నుండి బయటపడవచ్చు. అలాగే, ఆహారనాళాలలో విషక్రిములు చేరకుండా నిరోధించే శక్తి కూడా నారింజకు కలదు.

నారింజలో బెటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంట్లో ఉండే కాల్షియం.. ఎముకలు, దంతాల దృఢత్వానికి ఎంతగానో సహకరిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయటంలోనూ, రక్త ప్రసరణ సక్రమంగా జరగడంలోనూ దోహదపడుతుంది. ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడుతుంది.

విటమిన్ సి శాతం ఎక్కువగా ఉన్న నారింజను రోజుకు ఒకటి తీసుకున్నట్లయితే.. చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. జలుబు, దగ్గు లాంటి ఆరోగ్య సమస్యలు కూడా దరి చేరవు. రోజూ పరగడుపున ఒక గ్లాస్ నారింజ జ్యూస్ తాగితే, మార్నింగ్ సిక్‌నెస్‌నుండి సులభంగా బయటపడవచ్చు.

గర్భవతులు రోజూ ఒక గ్లాస్ నారింజ జ్యూస్ తాగినట్లయితే.. ఫోలిక్‌యాసిడ్ సంప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నారింజ తొక్కను పడేయకుండా… ఎండబెట్టి, పొడి చేసి, సున్నిపిండిలో కలుపుకుంటే మంచిది. ఈ పిండిని స్నానానికి ముందు ఒంటికి రాసుకుని రబ్ చేస్తే… చర్మంపై ఉండే మృతకణాలన్నీ సులభంగా తొలగిపోతాయి. చర్మం మృదువుగా అవటమే కాకుండా, కొత్త మెరుపును సంతరించుకుంటుంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s